
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. శనివారం పోలాండ్, సౌదీ అరేబియా మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అంతదాకా తన సొంతజట్టైన సౌదీ అరేబియాకు సపోర్ట్ చేసిన ఒక అభిమాని.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు గోల్ కొట్టగానే దెబ్బకు ప్లేట్ ఫిరాయించాడు.
అప్పటిదాకా సౌదీ.. సౌదీ అని అరిచిన నోటి నుంచి లెండోవాస్కీ పేరు బయటకు వచ్చింది. అంతేకాదు తాను వేసుకున్న సౌదీ అరేబియా జెర్సీని తీసేసి లోపల వేసుకున్న లెండోవాస్కీ జెర్సీని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ''నువ్వయ్యా అసలైన అభిమానివి.. దెబ్బకు ప్లేట్ ఫిరాయించావు.. నీలాంటోడు ఉండాల్సిందే'' అంటూ పేర్కొన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో పోలాండ్ సౌదీ అరేబియాను 2-0తో ఓడించింది. మ్యాచ్‌లో పోలాండ్ కెప్టెన్ రాబర్ట్ లెండోవాస్కీ గోల్ నమోదు చేశాడు. కాగా తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న లెండోవాస్కీకి ఇదే తొలి గోల్ కావడం విశేషం. అంతకముందు తొలి అర్థభాగంలో ఆట 39వ నిమిషంలో జిలిన్ స్కీ పోలాండ్‌కు తొలి గోల్ అందించాడు.
మొదటి హాఫ్ అదనపు సమయంలో సౌదీ అరేబియాకు పెనాల్టీ లభించింది. దీంతో కచ్చితంగా గోల్ చేస్తుంది అన్న తరుణంలో పోలాండ్ గోల్ కీపర్ వోజిక్ జెన్సీ రెండుసార్లు అద్బుతంగా అడ్డుకొని సౌదీకి గోల్ రాకుండా చేశాడు. ఇది మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక అర్జెంటీనాకు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా ఆటలు పోలాండ్ ముందు సాగలేదు.
— Out Of Context Football (@nocontextfooty) November 26, 2022
Comments
Please login to add a commentAdd a comment