ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా పోలాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సిలో శనివారం సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. పోలాండ్ తరపున ఆట 39వ నిమిషంలో పియోట్ జిలిన్ స్కీ తొలి గోల్ కొట్టగా.. ఆట 82వ నిమిషంలో జట్టు కెప్టెన్ రాబర్ట్ లెవాండోస్కీ రెండో గోల్ అందించాడు. అయితే తమ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాను ముచ్చెమటలు పట్టించి ఓడించిన సౌదీ అరేబియా పోలాండ్‌కు మాత్రం దాసోహమయ్యింది.
తొలి అర్థభాగంలో ఆట 39వ నిమిషంలో జిలిన్ స్కీ పోలాండ్‌కు తొలి గోల్ అందించాడు. ఇక మొదటి హాఫ్ అదనపు సమయంలో సౌదీ అరేబియాకు పెనాల్టీ లభించింది. దీంతో కచ్చితంగా గోల్ చేస్తుంది అన్న తరుణంలో పోలాండ్ గోల్ కీపర్ వోజిక్ జెన్సీ రెండుసార్లు అద్బుతంగా అడ్డుకొని సౌదీకి గోల్ రాకుండా చేశాడు. ఆ తర్వాత రెండో అర్థభాగంలో సౌదీ పలుమార్లు పోలాండ్ గోల్ పోస్ట్‌పై దాడి చేసినప్పటికి సఫలం కాలేకపోయింది. ఇక చివర్లో పోలండ్ కెప్టెన్ రాబర్ట్ లెవాండోస్కీ గోల్ కొట్టడంతో పోలాండ్ 2-0 తేడాతో విజయం అందుకుంది. ఇక తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న లెవాండోస్కీకి ఇదే తొలి గోల్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment