మెట్రో రైల్లో వెధవ్వేషాలు.. పట్టేసిన మహిళ! | man shoots woman in metro train, she catches red handed | Sakshi
Sakshi News home page

Published Wed, May 17 2017 2:13 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

మెట్రో రైల్లో వెళ్తుండగా వెధవ్వేషాలు వేస్తున్న వ్యక్తిని ఓ మహిళ రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదని అనుకున్నట్లు.. ఆ వ్యక్తి రైల్లో తన ఎదురు సీట్లో ఉన్న మహిళను ఫోన్లో వీడియో తీస్తూ.. ఎవరికీ తెలియలేదని అనుకున్నాడు. రైలు మొత్తం ఖాళీగా ఉన్నా, అతడు సరిగ్గా ఆమెకు ఎదురుగా ఉన్న సీట్లోనే కూర్చున్నాడు. తన దగ్గర ఉన్న ఐఫోన్ బయటకు తీసి, దాంట్లో ఏదో చూస్తున్నట్లుగా సీరియస్‌గా స్క్రీన్ వైపు చూస్తూ చాలాసేపు అలాగే ఉన్నాడు. అతడు ఫోన్ పట్టుకున్న తీరు అనుమానాస్పదంగా కనిపించింది. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, అతడి వెనకాల ఉన్న కిటికీ అద్దం మీద ఆ ఫోన్‌లో ఏం చేస్తున్నదీ స్పష్టంగా కనిపించింది. అతడు తననే వీడియో తీస్తున్నట్లు ఆమె గుర్తించింది. ఏమీ ఎరగనట్లుగా తాను కూడా ఫోన్ తీసి అతగాడిని షూట్ చేయడం మొదలుపెట్టారు. అతడు తొలుత మామలూగా చూస్తూనే, కాసేపు ఆగి ఫోన్‌ను మరింత జూమ్ చేసి ఆమెను బాగా క్లోజప్‌లో షూట్ చేయసాగాడు. అదంతా వెనకాల కిటికీ అద్దం మీద కనిపిస్తూనే ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement