
బెర్లిన్: డబ్బుకు ఎక్కువగా విలువ ఇచ్చేవారు ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు గడుపుతున్నట్లు శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. స్వార్థప్రయోజనాల కోసం ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకోవాలనుకోడమే ఇందుకు కారణమని జర్మనీలోని ర్హుర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఫిలిప్ ఒజిమెక్ తెలిపారు. ఆన్‌లైన్‌లోని స్నేహితులను వీరు డిజిటల్ వస్తువులుగా భావిస్తున్నారట. ఇటువంటివారు తమ లక్ష్యాలను చేరుకునేందుకు, ఇతరులతో పోల్చుకుంటూ తమగురించి తాము తెలుసుకునేందుకు విరివిగా ఫేస్‌బుక్ వినియోస్తున్నారని, తరచుగా వాడడం వెనక ..వారు తమ స్నేహితులను వస్తువులుగా చూడటమేనని ఫిలిప్ అభిప్రాయపడ్డారు.
సామాజిక వ్యత్యాసాలను సరిపోల్చుకునేందుకు ఫేస్‌బుక్ మంచి మాధ్యమమని, లక్షల మంది ప్రొఫైల్స్ ఫేస్‌బుక్‌లో ఉండడంవల్ల వారితో తమను సరిపోల్చుకోవడం సులభమే కాకుండా ఖర్చులేని పనిగా భావిస్తున్నందునే ఎక్కువ సమయాన్ని ఫేస్‌బుక్‌లో గడుపుతున్నారని ఫిలిప్ చెప్పారు. పరిశోధనలో భాగంగా 242 ఫేస్‌బుక్ వినియోగదారులను ఆన్‌లైన్ ద్వారా కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు ఎక్కువగా ఫేస్‌బుక్‌ను దేనితో పోలుస్తారని ప్రశ్నించారు. సామాజిక పోలిక, తత్వం, వస్తువులు, పరికరాలు వంటి పదాలకు రేటింగ్ ఇవ్వాలని అడిగారు. ఎక్కువ మంది వస్తువుగా చూస్తున్నట్లు చెప్పారు.
ఫేస్‌బుక్‌లో మరో ఫీచర్
న్యూయార్క్: ఫేస్‌బుక్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో మరో పవర్‌ఫుల్ ఫీచర్ ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి రానుంది. ‘వాచ్’(Watch) పేరిట వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు లైవ్ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో ఉన్న ఫేస్‌బుక్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనున్నారు. మన దేశంలో ఈ ఏడాది జూలై వరకు ఫేస్‌బుక్ లెక్కల ప్రకారం ఆ సంస్థ సేవల్ని వాడుతున్న యూజర్లు 24.1 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. అంత భారీ మార్కెట్ ఉన్నందునే ఫేస్‌బుక్ వీడియో స్ట్రీమింగ్ సేవలను భారత్‌లో కూడా ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నామని ఫేస్‌బుక్ అధికారిక బ్లాగ్ ద్వారా వెల్లడించింది. యూజర్లకు బాగా నచ్చే అంశాలు కలిగిన వీడియో షోలను స్ట్రీమింగ్ సేవల్లో ఫేస్‌బుక్ అందిస్తుంది. లైఫ్ స్టైల్, కామెడీ, చిల్డ్రన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి విభాగాలకు సంబంధించిన వీడియోలను స్ట్రీమింగ్ సేవల ద్వారా అందించాలనే యోచనలో ఫేస్‌బుక్ ఉంది. అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయనేది ఫేస్‌బుక్ వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment