వికెట్ల వెనుక ధోని కింగ్.. వీడియో వైరల్ | a Video Shows that How MS Dhoni Is Boss Behind The Stumps | Sakshi
Sakshi News home page

వికెట్ల వెనుక ధోని కింగ్.. వీడియో వైరల్

Published Fri, Jun 30 2017 5:44 PM | Last Updated on Thu, Jul 26 2018 12:41 PM

వికెట్ల వెనుక ధోని కింగ్.. వీడియో వైరల్ - Sakshi

వికెట్ల వెనుక ధోని కింగ్.. వీడియో వైరల్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్‌తో పాటు.. బెస్ట్ వికెట్ కీపర్‌గానూ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉన్న ధోని, వికెట్ల వెనుక ఉండి బౌలర్లకు సంకేతాలిస్తూ ఎన్నో కీలక సమయాల్లో క్రీజును అంటిపెట్టుకుని నిలబడ్డ దిగ్గజ బ్యాట్స్‌మెన్లను సైతం తన అద్బుత స్టింపింగ్ నైపుణ్యంతో పెవిలియన్ బాట పట్టించిన ఘటన ధోని సొంతం. అయితే గతేడాది ధోని చేసిన కొన్ని స్టంపింగ్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వేల లైక్స్, షేర్లు, కామెంట్లను

వన్డేల్లో 96 స్టంపింగ్స్ చేసిన ధోని, శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర (99) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. మరో నాలుగు స్టంపింగ్స్ తన ఖాతాలో వేసుకుంటే ధోని సంగక్కరను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తాడు. ఈ వీడియోలో గమనిస్తే.. భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య ఇటీవల జరిగిన రెండో వన్డేలో విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వికెట్ తీస్తూ చేసిన స్లో మోషన్ స్టింపింగ్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఛేజ్‌తో కలిసి 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం కుల్దీప్ బౌలింగ్‌లో హోల్డర్‌ను ధోని స్టంప్ ఔట్ చేయడంతో భారత అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ మ్యాచ్‌లో విండిస్‌పై భారత్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు మూడో వన్డే జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement