క్రికెట్‌లో బౌలర్ల తప్పిదాల కారణంగా నో బాల్స్ అవ్వడం తరుచూ చూస్తుంటాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఆసక్తికరంగా వికెట్‌కీపర్ తప్పిదం కారణంగా నో బాల్ ప్రకటించబడింది. బౌలర్ ఎలాంటి పొరపాటు చేయకుండానే అంపైర్ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు.
A No Ball in the Vitality Blast because the wicketkeeper's gloves were in front of the stumps. 😲pic.twitter.com/bYvAtQ2pQv
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 5, 2024
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లో జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో సోమర్‌సెట్, నార్తంప్టన్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బంతికి బౌలింగ్ టీమ్ స్టంపౌట్ కోసం అప్పీల్ చేసింది. ఫీల్డ్ అంపైర్ రీప్లేకు ఆదేశించాడు. ఇక్కడే వికెట్‌కీపర్ చేసిన ఓ పొరపాటు బయటపడింది.
సదరు అప్పీల్ స్టంపౌట్‌గా తేలకపోగా నో బాల్ అయ్యింది. బౌలర్ తనవైపు (క్రీజ్ దాటకుండా) నుంచి ఎలాంటి పొరపాటు చేయనప్పటికీ.. వికెట్‌కీపర్ గ్లవ్స్ స్టంప్స్ కంటే ముందుండటంతో థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు.
వికెట్‌కీపర్ తప్పిదం కారణంగా బ్యాటర్‌కు ఆ మరుసటి బంతి ఫ్రీ హిట్‌గా లభించింది. సదరు బ్యాటర్ ఫ్రీ హిట్‌ను సద్వినియోగం చేసుకుని భారీ సిక్సర్‌గా మలిచాడు. క్రికెట్‌లో వికెట్‌కీపర్ పొరపాటు వల్ల ఇలా నో బాల్స్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
ఇదిలా ఉంటే, టీ20 బ్లాస్ట్ టోర్నీలో నిన్నటితో (సెప్టెంబర్ 6) క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లన్నీ ముగిసాయి. సర్రే, సోమర్‌సెట్, గ్లోసెస్టర్‌షైర్, ససెక్స్ జట్లు సెమీస్‌కు చేరాయి. సెప్టెంబర్ 14న జరిగే రెండు సెమీఫైనల్స్ మ్యాచ్‌ల్లో సర్రే, సోమర్‌సెట్.. గ్లోసెస్టర్‌షైర్, ససెక్స్ జట్లు పోటీపడతాయి. అనంతరం అదే రోజు ఫైనల్ కూడా జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment