ఇంగ్లండ్ వేదికగా జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్ 2024 ఎడిషన్ టైటిల్‌ను గ్లోసెస్టర్‌షైర్ గెలుచుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో గ్లోసెస్టర్‌షైర్ సోమర్‌సెట్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్‌సెట్ 19.4 ఓవర్లలో 124 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.
డేవిడ్ పేన్, మ్యాట్ టేలర్ తలో మూడు, జోష్ షా రెండు వికెట్లు తీసి సోమర్‌సెట్‌ను దెబ్బకొట్టారు. ఒలివర్ ప్రైస్, టామ్ ప్రైస్ తలో వికెట్ దక్కించుకున్నారు. సోమర్‌సెట్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లెవిస్ గ్రెగరీ ఒక్కడే అర్ద సెంచరీతో (53) రాణించాడు. కాడ్‌మోర్ (21), ఏబెల్ (19) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
Maiden T20 Blast title for Gloucestershire🏆#ICYMI: Half-centuries from Cameron Bancroft and Miles Hammond powered Gloucestershire to their first T20 Blast title with a comfortable win over Somerset in Birmingham on Saturday. pic.twitter.com/Wsw9Qqsdkx
— CricTracker (@Cricketracker) September 15, 2024
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లోసెస్టర్‌షైర్.. 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి విజయతీరాలకు చేరింది. మైల్స్ హామండ్ (58 నాటౌట్), కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ (53) తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించి గ్లోసెస్టర్‌షైర్‌ను గెలిపించారు. జోష్ డేవి, జేక్ బాల్‌లకు తలో వికెట్ దక్కింది. టీ20 బ్లాస్ట్ టైటిల్‌ను గెలవడం గ్లోసెస్టర్‌షైర్‌కు ఇది మొదటిసారి.
Comments
Please login to add a commentAdd a comment