Vitality Blast T20 league
-
టీ20 బ్లాస్ట్ విజేత గ్లోసెస్టర్‌షైర్
ఇంగ్లండ్ వేదికగా జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్ 2024 ఎడిషన్ టైటిల్‌ను గ్లోసెస్టర్‌షైర్ గెలుచుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో గ్లోసెస్టర్‌షైర్ సోమర్సెట్ను 8 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 19.4 ఓవర్లలో 124 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.డేవిడ్ పేన్, మ్యాట్ టేలర్ తలో మూడు, జోష్ షా రెండు వికెట్లు తీసి సోమర్సెట్ను దెబ్బకొట్టారు. ఒలివర్ ప్రైస్, టామ్ ప్రైస్ తలో వికెట్ దక్కించుకున్నారు. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లెవిస్ గ్రెగరీ ఒక్కడే అర్ద సెంచరీతో (53) రాణించాడు. కాడ్మోర్ (21), ఏబెల్ (19) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.Maiden T20 Blast title for Gloucestershire🏆#ICYMI: Half-centuries from Cameron Bancroft and Miles Hammond powered Gloucestershire to their first T20 Blast title with a comfortable win over Somerset in Birmingham on Saturday. pic.twitter.com/Wsw9Qqsdkx— CricTracker (@Cricketracker) September 15, 2024అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లోసెస్టర్‌షైర్.. 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి విజయతీరాలకు చేరింది. మైల్స్ హామండ్ (58 నాటౌట్), కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ (53) తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించి గ్లోసెస్టర్‌షైర్‌ను గెలిపించారు. జోష్ డేవి, జేక్ బాల్‌లకు తలో వికెట్ దక్కింది. టీ20 బ్లాస్ట్ టైటిల్‌ను గెలవడం గ్లోసెస్టర్‌షైర్‌కు ఇది మొదటిసారి. -
క్రికెట్లో అత్యంత అరుదైన 'నో బాల్'
క్రికెట్లో బౌలర్ల తప్పిదాల కారణంగా నో బాల్స్ అవ్వడం తరుచూ చూస్తుంటాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఆసక్తికరంగా వికెట్‌కీపర్ తప్పిదం కారణంగా నో బాల్ ప్రకటించబడింది. బౌలర్ ఎలాంటి పొరపాటు చేయకుండానే అంపైర్ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. A No Ball in the Vitality Blast because the wicketkeeper's gloves were in front of the stumps. 😲pic.twitter.com/bYvAtQ2pQv— Mufaddal Vohra (@mufaddal_vohra) September 5, 2024వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లో జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో సోమర్సెట్, నార్తంప్టన్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బంతికి బౌలింగ్ టీమ్ స్టంపౌట్ కోసం అప్పీల్ చేసింది. ఫీల్డ్ అంపైర్ రీప్లేకు ఆదేశించాడు. ఇక్కడే వికెట్‌కీపర్ చేసిన ఓ పొరపాటు బయటపడింది.సదరు అప్పీల్ స్టంపౌట్‌గా తేలకపోగా నో బాల్ అయ్యింది. బౌలర్ తనవైపు (క్రీజ్ దాటకుండా) నుంచి ఎలాంటి పొరపాటు చేయనప్పటికీ.. వికెట్‌కీపర్ గ్లవ్స్ స్టంప్స్ కంటే ముందుండటంతో థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. వికెట్‌కీపర్ తప్పిదం కారణంగా బ్యాటర్‌కు ఆ మరుసటి బంతి ఫ్రీ హిట్‌గా లభించింది. సదరు బ్యాటర్ ఫ్రీ హిట్‌ను సద్వినియోగం చేసుకుని భారీ సిక్సర్‌గా మలిచాడు. క్రికెట్లో వికెట్‌కీపర్ పొరపాటు వల్ల ఇలా నో బాల్స్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.ఇదిలా ఉంటే, టీ20 బ్లాస్ట్ టోర్నీలో నిన్నటితో (సెప్టెంబర్ 6) క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లన్నీ ముగిసాయి. సర్రే, సోమర్సెట్, గ్లోసెస్టర్‌షైర్, ససెక్స్ జట్లు సెమీస్‌కు చేరాయి. సెప్టెంబర్ 14న జరిగే రెండు సెమీఫైనల్స్ మ్యాచ్‌ల్లో సర్రే, సోమర్సెట్.. గ్లోసెస్టర్‌షైర్, ససెక్స్ జట్లు పోటీపడతాయి. అనంతరం అదే రోజు ఫైనల్ కూడా జరుగుతుంది. -
T20 Blast 2024: క్రికెట్ మైదానంలోకి నక్క
క్రికెట్ మైదానంలోకి పాములు, కుక్కలు రావడం ఇటీవలికాలంలో తరుచూ చూస్తున్నాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఓ గుంట నక్క మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 బ్లాస్ట్ 2024లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానంలో హ్యాంప్‌షైర్, సర్రే మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా.. నక్క ఒక్కసారిగా మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆటగాళ్లు, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.Fox invades the field in Vitality Blast. 😄pic.twitter.com/dENXcc1wIL— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2024నక్క మైదానంలో చక్కర్లు కొట్టడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. నక్క మైదానం సిబ్బంది వచ్చేలోపు పలాయనం చిత్తగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నక్క ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వచ్చిన దారిలోనే కామ్‌గా వెళ్లిపోయింది. ఇది చూసి ఆటగాళ్లు, ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. హ్యాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్ 183 పరుగులకు ఆలౌట్ కాగా.. సామ్ కర్రన్ శతక్కొట్టడంతో (102 నాటౌట్) సర్రే మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, టీ20 బ్లాస్ట్ 2024 చివరి దశకు చేరింది. మే 30న మొదలైన ఈ టోర్నీ పలు బ్రేక్‌ల అనంతరం గ్రూప్ దశను ముగించుకుంది. గ్రూప్ దశ అనంతరం మొత్తం ఎనిమిది జట్లు (సర్రే, డర్హమ్, ససెక్స్, లాంకాషైర్, సోమర్సెట్, వార్విక్షైర్, గ్లోసెస్టర్‌షైర్) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్ దశ సెప్టెంబర్ 3 నుంచి మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 3, 4, 5, 6 తేదీల్లో జరుగనున్నాయి. రెండు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 14న జరుగనున్నాయి. -
పాక్ నుంచి పుట్టుకొచ్చిన బౌలర్.. మలింగను గుర్తుచేస్తూ
పాకిస్తాన్‌కు చెందిన కొత్త ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో మెరిశాడు. డెర్బీషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న జమాన్ ఖాన్ లంక మాజీ బౌలర్ లసిత్ మలింగ బౌలింగ్‌ను పోలి ఉంది. అతని శైలిలోనే పదునైన యార్కర్లు సంధిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. తాజాగా జమాన్ ఖాన్ ప్రత్యర్థి బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా సోమవారం డెర్బీషైర్, వోర్సెష్టర్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వోర్సెష్టర్‌షైర్ దూకుడుగా ఆడింది. తొలి 3.4 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జాక్ చాపెల్ బౌలింగ్‌లో ఒలివిరియా ఔట్ అయ్యాడు అనంతరం న్యూజిలాండ్ స్టార్ మిచెల్ సాంట్నర్, హెయిన్స్‌కు జత కలిశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన జమాన్ ఖాన్ ఈ జోడిని విడదీశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతికి అద్భుత యార్కర్ సంధించగా.. సాంట్నర్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. బంతి సూపర్‌స్పీడ్‌తో రావడంతో రెండు స్టంప్‌లు గాలిలో ఎగిరిపడ్డాయి. ఇక ఈ యంగ్ బౌలర్ నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే మిగతా బౌలర్లు విఫలం కావడంతో వోర్సెష్టర్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ సాంట్నర్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెర్బీషైర్ మొదటి పది ఓవర్లు దూకుడు కనబరిచినప్పటికి అదే టెంపోను చివరి వరకు కొనసాగించలేకపోయింది. దీంతో 19.4 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అవడంతో వోర్సెష్టర్‌షైర్ 28 పరుగుల తేడాతో విజయం అందుకుంది. వేన్ మాడ్సన్ 63, హ్యారీ కేమ్ 43 పరుగులతో రాణించారు. Zaman Khan with an elite yorker 😍 #Blast23 pic.twitter.com/NiBPxfHK52— Vitality Blast (@VitalityBlast) July 4, 2023 చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! -
ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ఆర్సీబీ స్టార్
సాధారణంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే ప్రపంచ రికార్డుగా పరిగణిస్తారు. అదే ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొడితే దానిని సంచలనం అంటారు. అలాంటి సంచలనం విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో నమోదైంది. సర్రీ బ్యాటర్ విల్ జాక్స్ మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.45 బంతుల్లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 96 పరుగులు చేసిన జాక్స్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విల్ జాక్స్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన హోల్మన్కు చుక్కలు చూపించాడు. ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా.. రెండో బంతిని స్ట్రెయిట్ వికెట్ మీదుగా.. మేడో బంతిని లాంగాన్ మీదుగా.. నాలుగో బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా.. ఐదో బంతిని మరోసారి లాంగాన్ మీదుగా తరలించాడు. ఆఖరి బంతిని కూడా సిక్సర్ బాదే ప్రయత్నం చేసినప్పటికి కేవలం సింగిల్ మాత్రమే రావడంతో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్ మిస్సయింది. అయితే విల్ జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ సర్రీని ఓటమి నుంచి తప్పించలేకపోయింది. 252 పరుగులు చేసిన సర్రీ జట్టు.. టార్గెట్‌ను కాపాడుకోలేకపోయింది. మిడిలెసెక్స్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 254 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించిన జట్టుగా మిడిలెసెక్స్ చరిత్ర సృష్టించింది. ఇక ఐపీఎల్లో విల్ జాక్స్ ఆర్సీబీ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 6 6 6 6 6 🔥 Absolutely brutal 🫣 from Will Jacks 🏏#Blast23 pic.twitter.com/B0l9QWqS13 — FanCode (@FanCode) June 22, 2023 చదవండి: సస్పెన్షన్ వేటు.. బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ -
కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల ఛేదన
తుఫాను వచ్చేముందు ప్రశాంతత ఉంటుందంటారు. అయితే ఒక్కసారి వర్షం మొదలయ్యాకా వచ్చే ఉరుములు, మెరుపులు మనల్ని ఉలికిపాటుకు గురి చేస్తాయి. అచ్చం అలాంటి తుఫాను ఇన్నింగ్స్ టి20 బ్లాస్ట్ 2023 టోర్నీలో నమోదైంది. కొడితే సిక్సర్.. లేదంటే బౌండరీ అనేలా స్టేడియం పరుగుల జడివానలో తడిసి ముద్దయింది. టోర్నీలో భాగంగా సౌత్ గ్రూప్‌లో ఉన్న సర్రీ, మిడిలెసెక్స్ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.. సర్రీ జట్టు విధించిన 253 పరుగుల భారీ టార్గెట్‌ను మిడిలెసెక్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించడం విశేషం. ఇరుజట్లలో ఎవరు సెంచరీలు చేయకపోయినప్పటికి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. మ్యాచ్‌లో మొత్తంగా 52 బౌండరీలు, 24 సిక్సర్లు నమోదయ్యాయి. టి20 బ్లాస్ట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా మిడిలెసెక్స్ చరిత్ర సృష్టించగా.. ఓవరాల్‌గా టి20 చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య చేధన కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. విల్ జాక్స్ (45 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, 7 సిక్సర్లు) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. లారి ఎవన్స్ (37 బంతుల్లో 85 పరుగులు, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మినహా మిగతావారి నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు రాలేదు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెసెక్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. వచ్చినోళ్లు వచ్చినట్లు కసితీరా బాదారు. తొలుత ఓపెనర్లు స్టీఫెన్ ఎస్కినాజి(39 బంతుల్లో 73 పరుగులు, 13 ఫోర్లు, ఒక సిక్సర్), జో క్రాక్నెల్(16 బంతుల్లో 36 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్ హోల్డన్(35 బంతుల్లో 68 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ హిగ్గిన్స్(24 బంతుల్లో 48 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో జాక్ డేవిస్ 3 బంతుల్లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. Utterly extraordinary 😲@Middlesex_CCC had lost their previous 14 Blast matches and have just chased down 253 🤯#Blast23 pic.twitter.com/NxeweZyKOh — Vitality Blast (@VitalityBlast) June 22, 2023 చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! -
ఇలా ఔటవ్వడం చూసుండరు.. శనిలా వెంటాడిన నాన్‌స్ట్రైక్ బ్యాటర్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరు ఊహించని విధంగా ఔటయ్యి పెవిలియన్ చేరడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా లీస్టర్‌షైర్, నాటింగ్హమ్షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లీస్టర్‌షైర్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 13వ ఓవర్ స్టీవెన్ ముల్లానే వేశాడు. స్ట్రైక్ ఎండ్‌లో కెప్టెన్ కొలిన్ అకెర్మన్ ఉండగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో వియాన్ ముల్డర్ ఉన్నాడు. స్టీవెన్ వేసిన ఓవర్ తొలి బంతిని కొలిన్ అకెర్మన్ స్ట్రెయిట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతిని అందుకునే ప్రయత్నంలో స్టీవెన్ తొలుత విఫలమయ్యాడు. దీంతో బంతి వెళ్లి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న వియాన్ ముల్డర్ చేతులను తాకి మరోసారి పైకి లేచింది. ఈసారి ఎలాంటి పొరపాటు చేయని స్టీవెన్ ముల్లానే క్యాచ్ తీసుకున్నాడు. దీంతో కొలిన్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఊహించని విధంగా బంతి వియాన్‌కు తగలడం.. ఆపై క్యాచ్ తీసుకోవడం కొలిన్ అకెర్‌మన్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది. రూల్ ప్రకారం ఔట్ అవడం వల్ల ఏం చేయలేక నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. వీడియో చూసిన అభిమానులు.. ''ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్ శని రూపంలో వెంటపడ్డాడు'' అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్‌లో నాటింగ్హమ్షైర్ 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జో క్లార్క్ 72 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లీస్టర్‌షైర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. వియాన్ ముల్డర్ 38, నిక్ వెల్చ్ 32 పరుగులు చేశారు. నాటింగ్హమ్షైర్ బౌలర్లలో స్టీవెన్ ముల్లానే మూడు వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Vitality Blast (@vitalityblast) చదవండి: 'పాక్‌కు ఇది అవమానం.. హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నా' అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ కౌంటర్.. ఇది ఫిక్స్ -
క్రికెట్ చరిత్రలో ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్.. వీడియో వైరల్
క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ నమోదైంది. ససెక్స్ క్రికెటర్ బ్రాడ్ కర్రీ స్టన్నింగ్ ఫీట్ చేసి ఔరా అనిపించాడు. టి20 బ్లాస్ట్ క్రికెట్లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా హంప్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హంప్‌షైర్ విజయానికి 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే క్రీజులో ఆల్‌రౌండర్ బెన్నీ హావెల్ 14 బంతుల్లోనే 25 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. 19వ ఓవర్ టైమల్ మిల్స్ వేశాడు. ఓవర్ రెండో బంతిని మిల్స్ ఫ్లాట్ డెలివరీ వేయగా.. క్రీజులో ఉన్న హావెల్ స్వీప్ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా స్టాండ్స్‌లో పడుతుందని.. ఇక లక్ష్యం 10 బంతుల్లో 17 పరుగులే అని అంతా భావించారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న బ్రాడ్ కర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ గాల్లోకి అమాంతం లేచి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుత విన్యాసాన్ని మైదానంలోని ఆటగాళ్లు సహా ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూశారు. కర్రీ అందుకున్న క్యాచ్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. క్యాచ్‌తోనే కాదు బౌలింగ్‌తోనూ మెరిసిన బ్రాడ్ కర్రీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కర్నీ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. STOP WHAT YOU ARE DOING BRAD CURRIE HAS JUST TAKEN THE BEST CATCH OF ALL TIME 🤯#Blast23 pic.twitter.com/9tQTYmWxWI — Vitality Blast (@VitalityBlast) June 16, 2023 చదవండి: లీగ్‌లో తొలి శతకం నమోదు..సెంచరీ చేజార్చుకున్న సాయి సుదర్శన్ -
టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 82 పరుగులు..!
ఇంగ్లండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మాట్ మెకరైన్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. విటాలిటీ బ్లాస్ట్ టీ20లో సోమర్సెట్,డెర్భీషైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన మెకరైన్ ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా మెకరైన్ నిలిచాడు. అంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ బౌలర్ సర్మద్ అన్వర్ పేరిట ఉండేది. 2011లో సూపర్ ఎలైట్ టీ20 కప్‌లో అన్వర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 81 పరుగులు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌లో ఈ రికార్డును మెకరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెర్భీషైర్పై సోమర్ సెట్ 191 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. సోమర్సెట్ బ్యాటర్లలో రోసోవ్ (93),బాంటన్(73) పరుగులతో చెలరేగారు. ఇక 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెర్భీషైర్ 74 పరుగులకే కుప్పకూలింది. సోమర్సెట్ బౌలర్లలో పీటర్ సిడిల్,గ్రీన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. లూయిస్ గ్రెగొరీ రెండు ,ఓవర్టాన్ ఒక్క వికెట్ సాధించారు. -
టీ20 క్రికెట్ చరిత్రలో నయా రికార్డు
లీసెస్టర్: టీ20 క్రికెట్ చరిత్రలో నయా రికార్డు లిఖించబడింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కొలిన్ అక్రమాన్ ఏడు వికెట్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విటలిటీ బ్లాస్ టీ20 లీగ్‌లో భాగంగా లీసెస్టర్ షైర్ కెప్టెన్ కొలిన్ ఆక్కర్మాన్ ఏడు వికెట్లతో చెలరేగిపోయాడు. బుధవారం వార్విక్షైర్తో జరిగిన మ్యాచ్‌లో కొలిన్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థి జట్టులోని మైకేల్ బర్గెస్, సామ్ హైన్, విల్ రోడ్స్, లియామ్ బ్యాంక్స్, అలెక్స్ థామ్సన్, హెన్రీ బ్రూక్స్, జీతన్ పటేల్ వికెట్లు సాధించాడు. దాంతో 20 పరుగుల వ్యవధిలో వార్విక్ షైర్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లీసెస్టర్ షైర్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. హరీ స్విండెల్స్(63), లూయిస్ హిల్(58)లు హాఫ్ సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. ఆపై 190 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన వార్విక్ షైర్ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై సామ్ హైన్(61), ఆడమ్ హోస్(34)లు ఆదుకోవడంతో ఆ జట్టు మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తరుణంలో కొలిన తన బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. అతనికి ధాటికి వార్విక్షైర్ 17.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. 0️⃣3️⃣4️⃣W0️⃣1️⃣0️⃣1️⃣1️⃣1️⃣1️⃣1️⃣W2️⃣W0️⃣W0️⃣W1️⃣1️⃣W1️⃣W Colin Ackermann takes 7/18 - the best bowling figures in T20 history ➡️ https://t.co/afo2WOG7iX pic.twitter.com/BLgpf0H2F1 — Vitality Blast (@VitalityBlast) August 7, 2019