ఇంగ్లండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మాట్ మెకరైన్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. విటాలిటీ బ్లాస్ట్ టీ20లో సోమర్‌సెట్,డెర్భీషైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన మెకరైన్ ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా మెకరైన్ నిలిచాడు. అంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ బౌలర్ సర్మద్ అన్వర్ పేరిట ఉండేది. 2011లో సూపర్ ఎలైట్ టీ20 కప్‌లో అన్వర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 81 పరుగులు ఇచ్చాడు.
ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌లో ఈ రికార్డును మెకరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెర్భీషైర్‌పై సోమర్ సెట్ 191 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్‌సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. సోమర్‌సెట్ బ్యాటర్లలో రోసోవ్ (93),బాంటన్(73) పరుగులతో చెలరేగారు. ఇక 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెర్భీషైర్ 74 పరుగులకే కుప్పకూలింది. సోమర్‌సెట్ బౌలర్లలో పీటర్ సిడిల్,గ్రీన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. లూయిస్ గ్రెగొరీ రెండు ,ఓవర్టాన్ ఒక్క వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment