ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరు ఊహించని విధంగా ఔటయ్యి పెవిలియన్ చేరడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా లీస్టర్‌షైర్, నాటింగ్‌హమ్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లీస్టర్‌షైర్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 13వ ఓవర్ స్టీవెన్ ముల్లానే వేశాడు. స్ట్రైక్ ఎండ్‌లో కెప్టెన్ కొలిన్ అకెర్‌మన్ ఉండగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో వియాన్ ముల్డర్ ఉన్నాడు.
స్టీవెన్ వేసిన ఓవర్ తొలి బంతిని కొలిన్ అకెర్‌మన్ స్ట్రెయిట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతిని అందుకునే ప్రయత్నంలో స్టీవెన్ తొలుత విఫలమయ్యాడు. దీంతో బంతి వెళ్లి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న వియాన్ ముల్డర్ చేతులను తాకి మరోసారి పైకి లేచింది. ఈసారి ఎలాంటి పొరపాటు చేయని స్టీవెన్ ముల్లానే క్యాచ్ తీసుకున్నాడు. దీంతో కొలిన్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
ఊహించని విధంగా బంతి వియాన్‌కు తగలడం.. ఆపై క్యాచ్ తీసుకోవడం కొలిన్ అకెర్‌మన్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది. రూల్ ప్రకారం ఔట్ అవడం వల్ల ఏం చేయలేక నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. వీడియో చూసిన అభిమానులు.. ''ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్ శని రూపంలో వెంటపడ్డాడు'' అంటూ కామెంట్ చేశాడు.
ఇక మ్యాచ్‌లో నాటింగ్‌హమ్‌షైర్ 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్‌హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జో క్లార్క్ 72 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లీస్టర్‌షైర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. వియాన్ ముల్డర్ 38, నిక్ వెల్చ్ 32 పరుగులు చేశారు. నాటింగ్‌హమ్‌షైర్ బౌలర్లలో స్టీవెన్ ముల్లానే మూడు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: 'పాక్‌కు ఇది అవమానం.. హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నా'
అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ కౌంటర్.. ఇది ఫిక్స్
Comments
Please login to add a commentAdd a comment