
వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 377 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు (సెకెండ్ ఇన్నింగ్స్) చేసింది. అశ్విన్ (8), బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో కదంతొక్కాడు. అక్షర్ పటేల్ (45) పర్వాలేదనిపించాడు. రోహిత్ (13), శ్రేయస్ (29), కేఎస్ భరత్ (6) మరోసారి నిరాశపరిచారు.
తొలి ఇన్నింగ్స్ సెన్సేషన్, డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ 9 పరుగులకు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 209 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బుమ్రా (6/45), కుల్దీప్ (3/71) ధాటికి 253 పరుగులకే ఆలౌటైంది.
A STUNNER FROM STOKES. 🔥🫡pic.twitter.com/7Ml2YADBEE
— Johns. (@CricCrazyJohns) February 4, 2024
కళ్లు చెదిరే క్యాచ్..
మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. స్టోక్స్ దాదాపు 23 మీటర్లు పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. స్టోక్స్ క్యాచ్ పట్టిన తీరును చూసి బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నిశ్రేష్ఠుడిగా ఉండిపోయాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో స్టోక్స్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.