వారెవ్వా శ్రేయస్.. డైరెక్ట్ త్రో! స్టోక్స్ రనౌట్(PC: Jio Cinema/BCCI)
India vs England, 2nd Test Day 4 Vizag: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో బ్యాటింగ్‌లో విఫలమైనా తన ఫీల్డింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. వైజాగ్ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 56 (27, 29) పరుగులు మాత్రమే చేశాడు.
అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ జాక్ క్రాలే(76) ఇచ్చి క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు అయ్యర్. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కాలే షాట్ ఆడేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికి బంతి గాల్లోకి లేవగానే బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్.. వెనక్కి పరిగెత్తి డైవ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు.
ఇలా రెండో రోజు ఆటలో... కీలక వికెట్ పడగొట్టడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. తాజాగా సోమవారం నాటి ఆటలో అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్ వద్ద అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు.
అయితే, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్ బద్దకంగా కదిలాడు. ఈ క్రమంలో మిడ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని ఒంటిచేత్తో అందుకున్న శ్రేయస్ అయ్యర్.. నేరుగా దానిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికి స్టోక్స్ ఇంకా క్రీజులోకి చేరుకోకపోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోగా.. టీమిండియా విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో నిలిచింది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్
►టాస్: టీమిండియా... బ్యాటింగ్
►మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396-10 (112 ఓవర్లలో)
►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 253-10 (55.5 ఓవర్లలో)
►రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 255-10 (78.3 ఓవర్లలో)
►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్.
చదవండి: Ind vs Eng: 0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్.. రెప్పపాటులో క్యాచ్!
Comments
Please login to add a commentAdd a comment