Nottinghamshire
-
భారత సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో పృథ్వీ షా కీలక నిర్ణయం
టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వారిలో పృథ్వీ షా ఒకరు. 23 ఏళ్ల ఈ ముంబై ఓపెనర్ చాలా రోజులుగా భారత జట్టులో చోటు దక్కక నిరాశగా ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు ఇతన్ని ఎంపిక చేసినా.. తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. తదనంతరం జరిగిన ఐపీఎల్-2023లో ఘోర వైఫల్యం చెందడం, అదే సమయంలో అతని సమకాలీకులు ఓపెనర్లుగా రాణించడంతో షా టీమిండియాకు ఆడే ఆశలను దాదాపుగా వదులుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతనికి తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం దొరికింది. నాటింగ్హమ్షైర్.. షాతో ఒప్పందం చేసుకున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక జర్నలిస్ట్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. దులీప్ ట్రోఫీ 2023 ముగిసాక షా నాలుగు రోజుల కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లు ఆడతాడని, తదనంతరం రాయల్ లండన్ వన్డే కప్ (50 ఓవర్ల టోర్నీ) ఆడతాడని తెలుస్తుంది. దీనికి ముందు షా.. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒకవేళ సెమీస్‌లో సెంట్రల్ జోన్ గెలిస్తే జులై 12-16 మధ్యలో జరిగే ఫైనల్లో కూడా ఆడతాడు. 2021లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన షా.. ఆతర్వాత ఫామ్ లేమి, వివాదాలు, సరైన అవకాశాలు రాక ఖాళీగా ఉన్నాడు. పృథ్వీ షా తన కెరీర్లో 5 టెస్ట్‌లు, 6 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. వన్డేల్లో, టీ20ల్లో పెద్దగా రాణించని షా.. టెస్ట్‌ల్లో పర్వాలేదనిపించాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించే షా.. గడిచిన సీజన్లో 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు చేశాడు. -
చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. పొట్టి క్రికెట్లో తొలి బౌలర్‌గా రికార్డు
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్షైర్తో నిన్న (జూన్ 30) జరిగిన మ్యాచ్‌లో నాటింగ్హమ్ ఆటగాడు, పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు గోల్డెన్ డకౌట్లు (తొలి బంతికే ఔట్) ఉన్నాయి. ఫలితంగా వార్విక్షైర్ తొలి ఓవర్లో 7 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. Shaheen Afridi, you cannot do that!! 💥 https://t.co/ehXxmtz6rX pic.twitter.com/wvibWa17zA — Vitality Blast (@VitalityBlast) June 30, 2023 వార్విక్షైర్ ఖాతాలో ఉన్న 7 పరుగుల్లో 5 వైడ్ల రూపంలో వచ్చినవి కావడం విశేషం. తొలి బంతికి వైడ్ల రూపంలో 5 పరుగులు రాగా.. ఆతర్వాతి బంతికి అలెక్స్ డేవిస్ (0) ఎల్బీడబ్ల్యూ, రెండో బంతికి బెంజమిన్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యారు. 3, 4 బంతులకు సింగల్స్ రాగా.. ఐదో బంతికి మౌస్లే (1).. ఓలీ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖరి బంతికి బర్నార్డ్ (0) క్లీన్ బౌల్డయ్యాడు. ఇలా షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో ఓ బౌలర్ ఈ తరహాలో తొలి ఓవర్లో 4 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. వన్డేల్లో శ్రీలంక పేస్ దిగ్గజం చమిందా వాస్ ఈ ఘనత సాధించాడు. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాస్.. తొలి ఓవర్లో హ్యాట్రిక్‌తో పాటు 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హమ్.. నిర్ణీత ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. లింటాట్, హసన్ అలీ తలో 3 వికెట్లు, మ్యాక్స్‌వెల్ 2, బ్రూక్స్ ఓ వికెట్ పడగొట్టగా.. నాటింగ్హమ్ ఇన్నింగ్స్‌లో టామ్ మూర్స్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఛేదనలో షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయిన వార్విక్షైర్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాబర్ట్ ఏట్స్ (65), జేకబ్ బెథెల్ (27), జేక్ లింటాట్ (27 నాటౌట్) రాణించారు. నాటింగ్హమ్ బౌలర్లలో అఫ్రిది 4, జేక్ బాల్ 3 వికెట్లు పడగొట్టారు. -
ఇలా ఔటవ్వడం చూసుండరు.. శనిలా వెంటాడిన నాన్‌స్ట్రైక్ బ్యాటర్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరు ఊహించని విధంగా ఔటయ్యి పెవిలియన్ చేరడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా లీస్టర్‌షైర్, నాటింగ్హమ్షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లీస్టర్‌షైర్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 13వ ఓవర్ స్టీవెన్ ముల్లానే వేశాడు. స్ట్రైక్ ఎండ్‌లో కెప్టెన్ కొలిన్ అకెర్మన్ ఉండగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో వియాన్ ముల్డర్ ఉన్నాడు. స్టీవెన్ వేసిన ఓవర్ తొలి బంతిని కొలిన్ అకెర్మన్ స్ట్రెయిట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతిని అందుకునే ప్రయత్నంలో స్టీవెన్ తొలుత విఫలమయ్యాడు. దీంతో బంతి వెళ్లి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న వియాన్ ముల్డర్ చేతులను తాకి మరోసారి పైకి లేచింది. ఈసారి ఎలాంటి పొరపాటు చేయని స్టీవెన్ ముల్లానే క్యాచ్ తీసుకున్నాడు. దీంతో కొలిన్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఊహించని విధంగా బంతి వియాన్‌కు తగలడం.. ఆపై క్యాచ్ తీసుకోవడం కొలిన్ అకెర్‌మన్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది. రూల్ ప్రకారం ఔట్ అవడం వల్ల ఏం చేయలేక నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. వీడియో చూసిన అభిమానులు.. ''ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్ శని రూపంలో వెంటపడ్డాడు'' అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్‌లో నాటింగ్హమ్షైర్ 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జో క్లార్క్ 72 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లీస్టర్‌షైర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. వియాన్ ముల్డర్ 38, నిక్ వెల్చ్ 32 పరుగులు చేశారు. నాటింగ్హమ్షైర్ బౌలర్లలో స్టీవెన్ ముల్లానే మూడు వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Vitality Blast (@vitalityblast) చదవండి: 'పాక్‌కు ఇది అవమానం.. హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నా' అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ కౌంటర్.. ఇది ఫిక్స్ -
పుజారానా 'మజాకా'.. ఒకే సీజన్లో వెయ్యి పరుగులు
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కౌంటీల్లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. వరుస డబుల్ సెంచరీలతో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్న పుజారా ఈ సీజన్లో ససెక్స్ తరపున ఒకే సీజన్లో వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో పుజారా ససెక్స్ తరపున 8 మ్యాచ్‌లాడి 1095 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. వాటిలో మూడు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఈ సీజన్లో డెర్బీషైర్, డుర్హమ్, మిడిలెసెక్స్ జట్లపై పుజారా ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ సీజన్లో కౌంటీల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గ్లామోర్గాన్ ఆటగాడు సామ్ నార్త్ఈస్ట్ 10 మ్యాచ్‌ల్లో 1127 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవలే లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ 401*పరుగులు రికార్డు ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా 8 మ్యాచ్‌ల్లో 1095 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. డెర్బీషైర్ ఆటగాడు షాన్ మసూద్ 8 మ్యాచ్‌ల్లో 1074 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పుజారా వ్యక్తిగత రికార్డుతో మెరిసినప్పటికి అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్ మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. నాటింగ్హమ్షైర్తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ 256 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో నాటింగ్హమ్షైర్ 240 పరుగులకు ఆలౌట్ కాగా.. ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. జట్టు అంతా విఫలం కాగా.. పుజారా 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో నాటింగ్హమ్షైర్ 301 పరుగులకు ఆలౌటై ససెక్స్‌కు 398 పరుగులను టార్గెట్‌గా నిర్దేశించింది. అయితే ససెక్స్ మరోసారి ఘోరమైన ఆటతీరును ప్రదర్శిస్తూ 142 పరుగులకే కుప్పకూలింది. ఈసారి కూడా పుజారా ఒక్కడే నిలబడ్డాడు. పుజారా 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ ఓటమితో కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ 11 మ్యాచ్‌ల్లో ఒక విజయం.. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. భారీ విజయంతో నాటింగ్హమ్షైర్ టాప్ స్థానానికి దూసుకెళ్లింది. నాటింగ్హమ్షైర్ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఒక ఓటమితో తొలి స్థానంలో ఉంది. చదవండి: టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..! Gustav McKeon T20I Records: 18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్? -
అలెక్స్ హేల్స్ 'లార్డ్స్' రికార్డులు
లార్డ్స్:ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు అలెక్స్ హేల్స్ పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ లండన్ వన్డే కప్ లో భాగంగా నాటింగ్షైర్ తరపున బరిలోకి దిగిన హేల్స్ శనివారం జరిగిన ఫైనల్లో అజేయంగా 187 పరుగులు చేశాడు. తద్వారా కొన్ని రికార్డుల్ని సాధించాడు. కౌంటీ మ్యాచ్ ఫైనల్లో లార్డ్స్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డును నమోదు చేశాడు. దాంతో పాటు ఈ స్టేడియంలో లిస్ట్-ఎ మ్యాచ్ ల్లో అత్యధిక స్కోరును సాధించిన ఆటగాడిగా కూడా హేల్స్ నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ బూన్(166) రికార్డును హేల్స్ సవరించాడు. 1989 లో లార్డ్స్ లో ఎంసీసీతో జరిగిన లిస్ట్-ఎ మ్యాచ్ లో బూన్ అత్యధిక వ్యక్తిగత పరుగుల్ని సాధించాడు. ఆపై ఇంతకాలానికి హేల్స్ దాన్ని బద్ధలు కొట్టాడు. మరొకవైపు ఇంగ్లండ్ తరపున అత్యధిక వన్డే పరుగుల్ని నమోదు చేసిన తన పాత రికార్డును సవరించుకున్నాడు. గత సీజన్లో నాటింగ్‌హామ్‌లో పాకిస్తాన్ తో జరిగిన వన్డేలో హేల్స్ 171 పరుగులు చేశాడు. అదే ఇంగ్లండ్ నుంచి ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు. ఆ తర్వాత ఏడాది కాలంలో ఆ రికార్డును హేల్సే సవరించడం ఇక్కడ విశేషం. రాయల్ లండన్ వన్డే కప్‌లో నాటింగ్షైర్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను కైవసం చేసుకుంది. సర్రేతో జరిగిన మ్యాచ్ లో నాటింగ్షైర్ ఇంకా రెండు ఓవర్లకు పైగా ఉండగానే గెలుపొందింది. -
కౌంటీల్లో పుజారా జోరు
సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మన్ ట్రెంట్‌బ్రిడ్జ్: ఒకవైపు భారత వన్డే జట్టు చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో ఇంగ్లండ్‌లో బిజీగా ఉంటే... ఈ జట్టులో స్థానం లేని మరో భారత ఆటగాడు చతేశ్వర్ పుజారా ఆ దేశంలోనే ఇంకో చోట తన బ్యాట్ పదును చూపించాడు. కౌంటీ క్రికెట్లో భాగంగా నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడుతున్న పుజారా, తన రెండో మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. గ్లూసెస్టర్‌షైర్‌తో శుక్రవారం ప్రారంభమైన ఈ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో పుజారా (206 బంతుల్లో 112; 14 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు మైకేల్ లంబ్ (117) కూడా సెంచరీ బాదడంతో తొలి రోజు నాటింగ్‌హామ్ 96 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. గత వారం గ్లామోర్గాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పుజారా విఫలమయ్యాడు. -
ఒకే వన్డేలో 870 పరుగులు
ఇంగ్లండ్ లిస్ట్-ఎ క్రికెట్లో రికార్డు లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అద్భుతం చోటు చేసుకుంది. ఒకే వన్డే మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 870 పరుగులు చేశాయి. దీంతో ఇంగ్లండ్ లిస్ట్-ఎ క్రికెట్లో ఇది అత్యధిక స్కోరుగా రికార్డులకెక్కింది. మరో మూడు పరుగులు చేసి ఉంటే 2006లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నమోదు చేసిన 872 పరుగుల ప్రపంచ రికార్డు బద్దలయ్యేది. రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా సోమవారం జరిగిన నార్త్ గ్రూప్ మ్యాచ్‌లో... తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్‌హామ్‌షైర్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 445 పరుగులు చేసింది. ప్రపంచ వ్యాప్త లిస్ట్-ఎ క్రికెట్లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఓపెనర్లు మైకేల్ లంబ్ (150 బంతుల్లో 184; 21 ఫోర్లు, 6 సిక్సర్లు), రికీ వెస్సెల్ (97 బంతుల్లో 146; 14 ఫోర్లు, 8 సిక్సర్లు) తొలి వికెట్‌కు 39.2 ఓవర్లలో 342 పరుగులు చేశారు. ఇంగ్లండ్ లిస్ట్-ఎ క్రికెట్లో ఇది అత్యధిక భాగస్వామ్యం కాగా ప్రపంచ వ్యాప్తంగా మూడోది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్తంప్టన్‌షైర్ 48.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది. దీంతో 20 పరుగుల స్వల్ప తేడాతో నార్తంప్టన్ ఓటమి చూవిచూసింది. క్లెన్‌వెల్ట్ (63 బంతుల్లో 128; 10 ఫోర్లు, 9 సిక్సర్లు), రోసింగ్టన్ (69 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో లంబ్, వెసెల్ కలిపి 342 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై ద్రవిడ్-గంగూలీ నెలకొల్పిన 318 పరుగుల అత్యధిక భాగస్వామ్య రికార్డు బద్దలయ్యింది. 1999 ప్రపంచకప్‌లో ద్రవిడ్ (145), దాదా (183) శతకాలతో ఈ రికార్డును నెలకొల్పారు. -
గంగూలీ-ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేశారు
ట్రెండ్ బ్రిడ్జి: టీమిండియా మాజీ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌లు వన్డే క్రికెట్లో నెలకొల్పిన 318 పరుగుల భాగస్వామ్యం రికార్డును ఇంగ్లండ్ కుర్రాళ్లు బ్రేక్ చేశారు. రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా నార్తాంప్టన్‌షైర్‌తో మ్యాచ్‌లో నాటంగ్హామ్షైర్ ఓపెనింగ్ జోడీ రికీ వెస్సెల్స్, మైకేల్ లంబ్ 342 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 39.2 ఓవర్లలో ఈ పరుగులు సాధించారు. సెంచరీ వీరులు రికీ వెస్సెల్స్ (146), మైకేల్ లంబ్ (184) కెరీర్ బెస్ట్ నమోదు చేశారు. 1999 వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంకతో టాంటన్ (ఇంగ్లండ్)తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున గంగూలీ, ద్రావిడ్ 318 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో మూడో అత్యుత్తమ భాగస్వామ్యంకాగా, ఇంగ్లండ్ గడ్డపై ఇదే అత్యధికం. తాజాగా నాటంగ్హామ్షైర్ ఓపెనర్లు జోడీ ఈ రికార్డును బ్రేక్ చేసి.. అత్యధిక వన్డే పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఇంగ్లీష్ జోడీగా ఘనత సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో మరో రికార్డు కూడా బ్రేక్ అయ్యింది. లిస్ ఏ మ్యాచ్‌లో ఇరు జట్లు కలసి అత్యధిక రికార్డు పరుగులు చేశాయి. ఇరు జట్లు కలసి 870 పరుగులు చేశాయి. నాటంగ్హామ్షైర్ 445 పరుగులు చేయగా, నార్తాంప్టన్‌షైర్ 425 పరుగులకు ఆలౌటైంది.