ఇంగ్లండ్ లిస్ట్-ఎ క్రికెట్‌లో రికార్డు
లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఒకే వన్డే మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 870 పరుగులు చేశాయి. దీంతో ఇంగ్లండ్ లిస్ట్-ఎ క్రికెట్‌లో ఇది అత్యధిక స్కోరుగా రికార్డులకెక్కింది. మరో మూడు పరుగులు చేసి ఉంటే 2006లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నమోదు చేసిన 872 పరుగుల ప్రపంచ రికార్డు బద్దలయ్యేది. రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా సోమవారం జరిగిన నార్త్ గ్రూప్ మ్యాచ్‌లో... తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్‌హామ్‌షైర్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 445 పరుగులు చేసింది.
ప్రపంచ వ్యాప్త లిస్ట్-ఎ క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఓపెనర్లు మైకేల్ లంబ్ (150 బంతుల్లో 184; 21 ఫోర్లు, 6 సిక్సర్లు), రికీ వెస్సెల్ (97 బంతుల్లో 146; 14 ఫోర్లు, 8 సిక్సర్లు) తొలి వికెట్‌కు 39.2 ఓవర్లలో 342 పరుగులు చేశారు. ఇంగ్లండ్ లిస్ట్-ఎ క్రికెట్‌లో ఇది అత్యధిక భాగస్వామ్యం కాగా ప్రపంచ వ్యాప్తంగా మూడోది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్తంప్టన్‌షైర్ 48.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది. దీంతో 20 పరుగుల స్వల్ప తేడాతో నార్తంప్టన్ ఓటమి చూవిచూసింది.
క్లెన్‌వెల్ట్ (63 బంతుల్లో 128; 10 ఫోర్లు, 9 సిక్సర్లు), రోసింగ్టన్ (69 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో లంబ్, వెసెల్ కలిపి 342 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై ద్రవిడ్-గంగూలీ నెలకొల్పిన 318 పరుగుల అత్యధిక భాగస్వామ్య రికార్డు బద్దలయ్యింది. 1999 ప్రపంచకప్‌లో ద్రవిడ్ (145), దాదా (183) శతకాలతో ఈ రికార్డును నెలకొల్పారు.
ఒకే వన్డేలో 870 పరుగులు
Published Tue, Jun 7 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement