గంగూలీ-ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేశారు
ట్రెండ్ బ్రిడ్జి: టీమిండియా మాజీ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్లు వన్డే క్రికెట్లో నెలకొల్పిన 318 పరుగుల భాగస్వామ్యం రికార్డును ఇంగ్లండ్ కుర్రాళ్లు బ్రేక్ చేశారు. రాయల్ లండన్ వన్డే కప్లో భాగంగా నార్తాంప్టన్షైర్తో మ్యాచ్లో నాటంగ్హామ్షైర్ ఓపెనింగ్ జోడీ రికీ వెస్సెల్స్, మైకేల్ లంబ్ 342 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 39.2 ఓవర్లలో ఈ పరుగులు సాధించారు. సెంచరీ వీరులు రికీ వెస్సెల్స్ (146), మైకేల్ లంబ్ (184) కెరీర్ బెస్ట్ నమోదు చేశారు.
1999 వన్డే ప్రపంచ కప్లో శ్రీలంకతో టాంటన్ (ఇంగ్లండ్)తో జరిగిన మ్యాచ్లో భారత్ తరపున గంగూలీ, ద్రావిడ్ 318 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఓవరాల్గా వన్డే క్రికెట్లో మూడో అత్యుత్తమ భాగస్వామ్యంకాగా, ఇంగ్లండ్ గడ్డపై ఇదే అత్యధికం. తాజాగా నాటంగ్హామ్షైర్ ఓపెనర్లు జోడీ ఈ రికార్డును బ్రేక్ చేసి.. అత్యధిక వన్డే పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఇంగ్లీష్ జోడీగా ఘనత సాధించింది.
ఇక ఈ మ్యాచ్లో మరో రికార్డు కూడా బ్రేక్ అయ్యింది. లిస్ ఏ మ్యాచ్లో ఇరు జట్లు కలసి అత్యధిక రికార్డు పరుగులు చేశాయి. ఇరు జట్లు కలసి 870 పరుగులు చేశాయి. నాటంగ్హామ్షైర్ 445 పరుగులు చేయగా, నార్తాంప్టన్షైర్ 425 పరుగులకు ఆలౌటైంది.