
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కౌంటీల్లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. వరుస డబుల్ సెంచరీలతో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్న పుజారా ఈ సీజన్‌లో ససెక్స్ తరపున ఒకే సీజన్‌లో వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో పుజారా ససెక్స్ తరపున 8 మ్యాచ్‌లాడి 1095 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. వాటిలో మూడు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం.
ఈ సీజన్‌లో డెర్బీషైర్, డుర్హమ్, మిడిలెసెక్స్ జట్లపై పుజారా ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ సీజన్‌లో కౌంటీల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గ్లామోర్గాన్ ఆటగాడు సామ్ నార్త్‌ఈస్ట్ 10 మ్యాచ్‌ల్లో 1127 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవలే లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్ 401*పరుగులు రికార్డు ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా 8 మ్యాచ్‌ల్లో 1095 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. డెర్బీషైర్ ఆటగాడు షాన్ మసూద్ 8 మ్యాచ్‌ల్లో 1074 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
పుజారా వ్యక్తిగత రికార్డుతో మెరిసినప్పటికి అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్ మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. నాటింగ్‌హమ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ 256 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో నాటింగ్‌హమ్‌షైర్ 240 పరుగులకు ఆలౌట్ కాగా.. ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. జట్టు అంతా విఫలం కాగా.. పుజారా 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో నాటింగ్‌హమ్‌షైర్ 301 పరుగులకు ఆలౌటై ససెక్స్‌కు 398 పరుగులను టార్గెట్‌గా నిర్దేశించింది.
అయితే ససెక్స్ మరోసారి ఘోరమైన ఆటతీరును ప్రదర్శిస్తూ 142 పరుగులకే కుప్పకూలింది. ఈసారి కూడా పుజారా ఒక్కడే నిలబడ్డాడు. పుజారా 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ ఓటమితో కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ 11 మ్యాచ్‌ల్లో ఒక విజయం.. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. భారీ విజయంతో నాటింగ్‌హమ్‌షైర్ టాప్ స్థానానికి దూసుకెళ్లింది. నాటింగ్‌హమ్‌షైర్ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఒక ఓటమితో తొలి స్థానంలో ఉంది.
చదవండి: టెస్ట్ క్రికెట్‌లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..!
Gustav McKeon T20I Records: 18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్?