ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2 లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు.
హోవ్ వేదికగా డర్హామ్‌తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆట సందర్భంగా 55వ ఓవర్‌లో బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన పుజరా.. తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
134 బంతుల్లో పుజరా శతకం సాధించాడు. టామ్ క్లార్క్‌తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పుజరా నమోదు చేశాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 115 పరుగులు చేశాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది.
ససెక్స్ బ్యాటర్లలో పుజరా టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓలివర్ కార్టర్(41) పరుగులతో పర్వాలేదనపించాడు.అంతకుముందు డర్హామ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. కాగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు పుజారా అద్భుతమైన ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
చదవండి: IPL 2023 CSK vs MI: సీఎస్‌కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment