Ind vs WI, 1st Test: Ajinkya Rahane Hints At Possible Debut For Yashasvi Jaiswal - Sakshi
Sakshi News home page

WI Vs IND: జైశ్వాల్‌ ఆడడం ఖాయమా? రోహిత్‌ ప్రశ్నకు రహానే స్పందన

Published Tue, Jul 11 2023 11:38 AM | Last Updated on Tue, Jul 11 2023 11:50 AM

Ajinkya Rahane Hints At Possible Debut For Yashasvi Jaiswal - Sakshi

టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి విండ్సర్‌ పార్క్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇటీవలే వైస్‌కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన అజింక్యా రహానే సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. కాగా టెస్టు స్పెషలిస్టుగా ముద్రపడిన చతేశ్వర్‌ పుజారా ఫామ్‌ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. కాగా అతని స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేది ఎవరనే దానిపై రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్లులో యశస్వి జైశ్వాల్‌ అరంగేట్రం ఖాయంగా కనబడుతోంది. పుజారా స్థానమైన మూడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చేది జైశ్వాల్‌ అని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

ఇదే విషయమై రహానే మాట్లాడుతూ.. ''కచ్చితంగా పుజారా స్థానంలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది. పుజారా లోటును తీర్చడానికి మూడో స్థానం కాలకం. ఈ కీలక స్థానంలో బ్యాటింగ్‌ వచ్చే అవకాశం ఎవరిదనేది చెప్పలేను. కానీ అతనికి(యశస్వి జైశ్వాల్‌కు) మంచి చాన్స్‌. ఇప్పుడున్న యంగ్‌ క్రికెటర్లలో మంచి టాలెంట్‌ ఉన్నవాడు. మొత్తానికి జైశ్వాల్‌ టీమిండియా తరపున టెస్టు ఫార్మాట్‌లో ఆడడం సంతోషం కలిగిస్తోంది. డొమొస్టిక్‌ క్రికెట్‌లో ముంబై తరపున.. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున బాగా ఆడాడు.

గతేడాది దులీప్‌ ట్రోపీలోనూ తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే జోరు చూపించాలని కోరుకుంటున్నా. అతని బ్యాటింగ్‌ తీరు చూడముచ్చటగా ఉంది. స్థానం కాదు ముఖ్యం.. ఏ స్థానంలోనైనా వచ్చి బ్యాటింగ్‌ చేయగల సత్తా జైశ్వాల్‌ది. చాలా సంతోషంగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రహానేను ఇంటర్య్వూ చేసింది టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇక 21 ఏళ్ల జైశ్వాల్‌కు ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో మంచి బ్యాటింగ్‌ యావరేజ్‌ ఉంది. గత 18 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో జైశ్వాల్‌ 1845 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మది సెంచరీలు, రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌ 2023లోనూ జైశ్వాల్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున 14 మ్యాచ్‌ల్లో 625 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు అర్థశతకాలు ఉన్నాయి.

చదవండి: TNPL 2023 DD Vs NRK: మరో 'రింకూ సింగ్‌'.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో సంచలనం

ODI World Cup 2023: ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement