Kohli Serious On Yashasvi Jaiswal Shocks Everyone After Abusing Kemar Roach - Sakshi
Sakshi News home page

విండీస్‌ ఆటగాడిపై జైశ్వాల్‌ దూషణల పర్వం; కోహ్లి సీరియస్‌

Published Fri, Jul 14 2023 11:26 AM | Last Updated on Fri, Jul 14 2023 11:40 AM

Kohli Serious-Yashasvi Jaiswal Shocks Everyone By Abusing Kemar Roach - Sakshi

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు యశస్వి జైశ్వాల్‌కు అరంగేట్రం మ్యాచ్‌ అన్న సంగతి తెలిసిందే. కాగా డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి పలు రికార్డులు బద్దలు కొట్టిన యశస్వి జైశ్వాల్‌ అందరి ప్రశంసలు అందుకున్నాడు. బ్యాటింగ్‌తో ఇరగదీసిన జైశ్వాల్‌ ఒక్క విషయంలో మాత్రం దొరికిపోయాడు.

వెస్టిండీస్‌ వెటరన్‌ ప్లేయర్‌ కీమర్‌ రోచ్‌పై జైశ్వాల్‌ దూషణల పర్వానికి దిగడం ఆసక్తి కలిగించింది. ఇన్నింగ్స్‌ చివరి సెషన్‌లో ఇది చోటుచేసుకుంది. అప్పటికే సెంచరీతో మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్న యశస్వి జైశ్వాల్‌ క్రీజులో పాతుకుపోయాడు.. మరో ఎండ్‌లో కోహ్లి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌ బాగానే చేస్తున్న సందర్భంలోనే జైశ్వాల్‌ అనవసరంగా ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు. 

కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసిన అనంతరం నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌కు వచ్చిన జైశ్వాల్‌.. రోచ్‌వైపు చూస్తూ “Hutt Na Behe*c**d Samne Se( నా దారి నుంచి పక్కకు తప్పుకో...) అంటూ బూతు పదం అందుకున్నాడు. ఇది గమనించిన కోహ్లి జైశ్వాల్‌ వైపు సీరియస్‌ లుక్‌ ఇచ్చాడు. ''మంచిగా ఆడుతున్నావ్‌.. ఈ సమయంలో ఇలాంటి వివాదాలు అవసరమా'' అన్నట్లుగా కోహ్లి చూపుల్లో అర్థమున్నట్లుగా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: #ViratKohli: ఒక్క బౌండరీ.. 'నిన్ను చూస్తే హీరో నాని గుర్తొస్తున్నాడు కోహ్లి'

Equal Prize Money For Cricketers: క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement