Ind Vs WI, 3rd ODI: After Waterboy, Virat Kohli Turns Substitute Fielder - Sakshi
Sakshi News home page

Virat Kohli: మొన్న వాటర్‌బాయ్‌! ఇప్పుడు ఇలా.. ఏంటిది కోహ్లి! మిస్సవుతున్నాం.. వీడియో వైరల్‌

Published Wed, Aug 2 2023 9:21 AM | Last Updated on Wed, Aug 2 2023 11:19 AM

Ind Vs WI 3rd ODI: After Waterboy Kohli Turns Substitute Fielder Viral - Sakshi

West Indies vs India, 3rd ODI- Virat kohli: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ మెరుపులు చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. బార్బడోస్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ నుంచే మేనేజ్‌మెంట్‌ ప్రయోగాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుల కారణంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా కోహ్లి లోయర్‌ ఆర్డర్‌లో ఆడేందుకు సిద్ధమయ్యారు.

ప్రయోగాలు కొనసాగగా..
అయితే, కోహ్లి బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేకుండా రోహిత్‌ తొలి వన్డేలో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇక రెండో వన్డే నుంచి ప్రయోగాలు శృతి మించగా.. హిట్‌మ్యాన్‌, రన్‌మెషీన్‌లు విశ్రాంతి పేరిట ఆటకు దూరంగా ఉన్నారు. బార్బడోస్‌లో ఘోర పరాభవం నేపథ్యంలోనూ ఆఖరిదైన మూడో వన్డేలో కూడా రోహిత్‌, కోహ్లిలకు రెస్ట్‌ ఇవ్వడం విశేషం.

మొన్న వాటర్‌బాయ్‌.. ఇప్పుడిలా
ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో రెండో వన్డేలో విండీస్‌ చేతిలో ఓడిన టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో మాత్రం ఘన విజయం సాధించింది. 200 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో గెలిచింది. ఇదిలా ఉంటే.. బార్బడోస్‌లో వాటర్‌బాయ్‌ అవతారమెత్తిన విరాట్‌ కోహ్లి.. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా మైదానంలో దిగడం గమనార్హం.

మిస్సవుతున్నాం కోహ్లి!
ఇందుకు సంబంధించిన వీడియోను కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌ నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. ‘‘అతడు మైదానంలో ఉంటే చాలు.. పూనకాలే!. కానీ నీ బ్యాటింగ్‌ మెరుపులు మిస్సవుతున్నాం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో కోహ్లి వరుసగా 76, 121 పరుగులు సాధించాడు. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మ్యాచ్‌ సందర్భంగా.. అంతర్జాతీయ కెరీర్‌లో 76వ శతకం నమోదు చేశాడు.

చదవండి: విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..
ఓడిపోతే ఏం జరిగేదో తెలుసు! అందుకే రోహిత్‌, కోహ్లిలను కాదని ఇలా: హార్దిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement