టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మాములుగా క్రీజులోకి వచ్చాడంటే బౌండరీ కొట్టడానికి ఎక్కువ సమయం తీసుకోడు. బౌండరీ బాదడానికి మహా అయితే 20 బంతులు తీసుకోవడం చూస్తుంటాం. అయితే వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మాత్రం కోహ్లి తొలి బౌండరీ బాదడానికి నానాకష్టాలు పడ్డాడు. తాను ఎదుర్కొన్న 80 బంతుల్లో కేవలం సింగిల్స్, డబుల్స్‌తోనే 29 పరుగులు చేశాడు. చివరికి 81వ బంతికి కవర్ డ్రైవ్ దిశగా ఆడి కోహ్లి బౌండరీ ఖాతా తెరిచాడు.
ఈ క్రమంలో తొలి బౌండరీ కొట్టానన్న సంతోషమో తెలియదు కానీ సెంచరీ సాధించినంత ఫీలింగ్‌తో కోహ్లి సెలబ్రేషన్ చేసుకోవడం ఆసక్తి కలిగించింది. 81వ బంతికి బౌండరీ బాదగానే కోహ్లి సంతోషంతో తన బ్యాట్‌ను గాల్లోకి లేపుతూ మొత్తానికి సాధించా అంటూ చిరుదరహాసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ''నువ్వేం చేసినా మాకు నచ్చుతుంది కోహ్లి''.. ''ఒక్క బౌండరీకే సెంచరీ సాధించినంత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చావ్''.. ''నిన్ను చూస్తుంటే జెర్సీ సినిమాలో నాని గుర్తుకొస్తున్నాడు(సినిమాలో ట్రైన్ వచ్చే సీన్‌లో.. యస్ నేను సాధించా)'' అంటూ కామెంట్ చేశారు.
రెండో రోజు ఆటలో భాగంగా విరాట్ కోహ్లి మరో రికార్డు సృష్టించాడు. టెస్టులో 8500 పరుగులు పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. తర్వాత వరుసగా రాహుల్ ద్రవిడ్, సునీల్ గావస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లి, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఉన్నారు.
ఇక విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. జైశ్వాల్ 143, కోహ్లి 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మలు శతకాలతో చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మూడోరోజు ఆటలో ఇంకేం అద్బుతాలు జరుగుతాయో చూడాలి. అంతకముందు వెస్టిండీస్ టీమిండియా స్పిన్నర్ల దాటికి 150 పరుగులకే కుప్పకూలింది.
King Kohli completed 8500 runs in test cricket with that boundary. #ViratKohlipic.twitter.com/ZC8CIgtbJ7
— Mufaddal Vohra (@133_AT_Hobart) July 14, 2023
చదవండి: Yashasvi Jaiswal 1st Test Century: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్
#KylianMbappe: ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్'
Comments
Please login to add a commentAdd a comment