PC: Jio Cinema
టెస్టు పునరాగమనంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఈ ఢిల్లీ క్రికెటర్ పూర్తిగా విఫలమయ్యాడు. చెన్నై టెస్టులో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఫలితంగా పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరే క్రమంలో టీమిండియా స్వదేశంలో వరుస సిరీస్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 19) నుంచి బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది.
ఆది నుంచే చెలరేగిన బంగ్లా పేసర్
చెపాక్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు బంగ్లా యువ క్రికెటర్ హసన్ మహమూద్ చుక్కలు చూపిస్తున్నాడు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ(6)ను పెవిలియన్‌కు పంపిన ఈ పేస్ బౌలర్.. తర్వాత శుబ్‌మన్ గిల్‌ను డకౌట్ చేశాడు. అనంతరం.. కోహ్లి క్రీజులోకి రాగా.. అభిమానులు కేరింతలు కొట్టారు.
చెత్త షాట్ సెలక్షన్
హసన్‌కు దీటుగా బదులిస్తాడని.. కోహ్లి నామస్మరణతో హోరెత్తించారు. ఆరంభంలో కాస్త బాగానే ఆడినా.. కోహ్లి సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో ఉసూరుమన్నారు. భారత ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో.. హసన్ వేసిన రెండో బంతి అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా వెళ్తుంగా.. కోహ్లి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి వికెట్ కీపర్ లిటన దాస్ చేతుల్లో పడింది. అలా చెత్త షాట్ సెలక్షన్ వల్ల కోహ్లి వికెట్ కోల్పోయాడు.
Virat Kohli's Dismissal 💔
Edged and gone 😢
King's Rare failure 💯 #IndVsBan#ViratKohli
pic.twitter.com/ebQ2OPbWaT— Berzabb (@Berzabb) September 19, 2024
కోహ్లి అవుట్.. రోహిత్ రియాక్షన్ వైరల్
ఇక మ్యాచ్ మొదలైన తొలి గంటలోనే ఇలా మూడు వికెట్లు కోల్పోవడం.. ముఖ్యంగా కోహ్లి కూడా త్వరగా అవుట్ కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ముఖం మాడ్చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Virat kohli got out & the crowd is still cheering. 😭
Reason : Rishabh pant #CricketUpdatespic.twitter.com/KmFI59xjjO— Rp17 (@HarshadSarode13) September 19, 2024
ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 88/3 (23). జైస్వాల్ 37, పంత్ 33 పరుగులతో ఆడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment