''నాకిది ఆరంభం మాత్రమే.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్తులో నేను టీమిండియాకు చాలా చేయాల్సి ఉంది.''.. ఇవీ విండీస్‌తో తొలి టెస్టులో శతకంతో మెరిసిన జైశ్వాల్ చేసిన వ్యాఖ్యలు.
టీమిండియా తరపున అరంగేట్రం చేసిన టెస్టులోనే సెంచరీ చేసిన 17వ ఆటగాడిగా.. మూడో ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్ చరిత్రకెక్కాడు. వీటితో పాటు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టిన జైశ్వాల్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆడుతుంది వెస్టిండీస్ లాంటి బి-గ్రేడ్ జట్టుతో కావొచ్చు.. కానీ ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఒక ల్యాండ్ మార్క్ ఇన్నింగ్స్‌తో కెరీర్‌ను మొదలుపెట్టడం ఏ క్రికెటర్ కైనా గొప్పగానే కనిపిస్తోంది.
అందుకే జైశ్వాల్ రెండోరోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమెషనల్ అయ్యాడు. "నాకు, నా కుటుంబానికి, నాకు అన్ని విధాలుగా మద్దతిచ్చిన అందరికీ ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. దీనికి ఎంతగానో సహకరించిన మా అమ్మానాన్నలకు ఈ సెంచరీ అంకితమిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది" అని యశస్వి అన్నాడు.
ఒకప్పుడు క్రికెట్ను కెరీర్గా మలచుకోవడానికి ముంబై వచ్చి పానీపూరీ అమ్మిన యశస్వి.. ఇప్పుడు ఇండియాతరఫున అరంగేట్రం చేయడమే కాదు తొలి టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. 91 ఏళ్ల రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఐపీఎల్ ద్వారా సెలక్టర్ల దృష్టిలో పడిన యశస్వి.. అంతర్జాతీయ క్రికెట్ ను ఘనంగా మొదలుపెట్టాడు. 2020లో తొలిసారి ఐపీఎల్ ఆడిన యశస్వి.. 2023 సీజన్ ను మరుపురానిదిగా మలచుకున్నాడు.
ఈ సీజన్ లో అతడు 14 మ్యాచ్ లలో 625 రన్స్ చేసి రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఒక సెంచరీతోపాటు ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ప్రదర్శన అతన్ని జాతీయ జట్టులోకి వచ్చేలా చేసింది. సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని యశస్వి వమ్ము చేయలేదు.
A special dedication after a special start in international cricket! 😊#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/Dsiwln3rwt
— BCCI (@BCCI) July 14, 2023
చదవండి: Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో
ICC-BCCI Revenue Share: పేరుకే పెద్దన్న.. బీసీసీఐదే సింహభాగం, మరోసారి నిరూపితం
Comments
Please login to add a commentAdd a comment