కౌంటీల్లో పుజారా జోరు | Chhatteshwar Pujara Century | Sakshi
Sakshi News home page

కౌంటీల్లో పుజారా జోరు

Published Sat, May 27 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

కౌంటీల్లో పుజారా జోరు

కౌంటీల్లో పుజారా జోరు

సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మన్‌

ట్రెంట్‌బ్రిడ్జ్‌: ఒకవైపు భారత వన్డే జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ సన్నాహాల్లో ఇంగ్లండ్‌లో బిజీగా ఉంటే... ఈ జట్టులో స్థానం లేని మరో భారత ఆటగాడు చతేశ్వర్‌ పుజారా ఆ దేశంలోనే ఇంకో చోట తన బ్యాట్‌ పదును చూపించాడు. కౌంటీ క్రికెట్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌షైర్‌ తరఫున ఆడుతున్న పుజారా, తన రెండో మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు.

గ్లూసెస్టర్‌షైర్‌తో శుక్రవారం ప్రారంభమైన ఈ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో పుజారా (206 బంతుల్లో 112; 14 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనితో పాటు మైకేల్‌ లంబ్‌ (117) కూడా సెంచరీ బాదడంతో తొలి రోజు నాటింగ్‌హామ్‌ 96 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. గత వారం గ్లామోర్గాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పుజారా విఫలమయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement