క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ నమోదైంది. ససెక్స్ క్రికెటర్ బ్రాడ్ కర్రీ స్టన్నింగ్ ఫీట్ చేసి ఔరా అనిపించాడు. టి20 బ్లాస్ట్ క్రికెట్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా హంప్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హంప్‌షైర్ విజయానికి 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది.
అప్పటికే క్రీజులో ఆల్‌రౌండర్ బెన్నీ హావెల్ 14 బంతుల్లోనే 25 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. 19వ ఓవర్ టైమల్ మిల్స్ వేశాడు. ఓవర్ రెండో బంతిని మిల్స్ ఫ్లాట్ డెలివరీ వేయగా.. క్రీజులో ఉన్న హావెల్ స్వీప్ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా స్టాండ్స్‌లో పడుతుందని.. ఇక లక్ష్యం 10 బంతుల్లో 17 పరుగులే అని అంతా భావించారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది.
బౌండరీ లైన్ వద్ద ఉన్న బ్రాడ్ కర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ గాల్లోకి అమాంతం లేచి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుత విన్యాసాన్ని మైదానంలోని ఆటగాళ్లు సహా ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూశారు. కర్రీ అందుకున్న క్యాచ్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
క్యాచ్‌తోనే కాదు బౌలింగ్‌తోనూ మెరిసిన బ్రాడ్ కర్రీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కర్నీ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
STOP WHAT YOU ARE DOING
— Vitality Blast (@VitalityBlast) June 16, 2023
BRAD CURRIE HAS JUST TAKEN THE BEST CATCH OF ALL TIME 🤯#Blast23 pic.twitter.com/9tQTYmWxWI
చదవండి: లీగ్‌లో తొలి శతకం నమోదు..సెంచరీ చేజార్చుకున్న సాయి సుదర్శన్
Comments
Please login to add a commentAdd a comment