
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రాధా యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్ నమోదు చేసింది. యూపీ వారియర్జ్ ఇన్నింగ్స్ సమయంలో 11వ ఓవర్ శిఖా పాండే వేసింది. ఓవర్ తొలి బంతిని దీప్తి శర్మ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న రాధా యాదవ్ ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తూ లో క్యాచ్ తీసుకుంది. దెబ్బకు దీప్తి శర్మ మొహం మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్జ్ ముంగిట 212 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎస్సెల్‌స్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు.
Catch of the WPL: Radha Yadav. pic.twitter.com/RTGoONifYT
— Johns. (@CricCrazyJohns) March 7, 2023
Comments
Please login to add a commentAdd a comment