క్రికెట్ మైదానంలోకి పాములు, కుక్కలు రావడం ఇటీవలికాలంలో తరుచూ చూస్తున్నాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఓ గుంట నక్క మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 బ్లాస్ట్ 2024లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్‌స్టన్ ఓవల్ మైదానంలో హ్యాంప్‌షైర్, సర్రే మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా.. నక్క ఒక్కసారిగా మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆటగాళ్లు, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.
Fox invades the field in Vitality Blast. 😄pic.twitter.com/dENXcc1wIL
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2024
నక్క మైదానంలో చక్కర్లు కొట్టడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. నక్క మైదానం సిబ్బంది వచ్చేలోపు పలాయనం చిత్తగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నక్క ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వచ్చిన దారిలోనే కామ్‌గా వెళ్లిపోయింది. ఇది చూసి ఆటగాళ్లు, ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. హ్యాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్ 183 పరుగులకు ఆలౌట్ కాగా.. సామ్ కర్రన్ శతక్కొట్టడంతో (102 నాటౌట్) సర్రే మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఇదిలా ఉంటే, టీ20 బ్లాస్ట్ 2024 చివరి దశకు చేరింది. మే 30న మొదలైన ఈ టోర్నీ పలు బ్రేక్‌ల అనంతరం గ్రూప్ దశను ముగించుకుంది. గ్రూప్ దశ అనంతరం మొత్తం ఎనిమిది జట్లు (సర్రే, డర్హమ్, ససెక్స్, లాంకాషైర్, సోమర్‌సెట్, వార్విక్‌షైర్, గ్లోసెస్టర్‌షైర్) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్ దశ సెప్టెంబర్ 3 నుంచి మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 3, 4, 5, 6 తేదీల్లో జరుగనున్నాయి. రెండు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 14న జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment