fox
-
మొసలి అస్వస్థత
వేసవికాలం.. సుందరవనం అనే అడవిలో ఒక జింక పిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక మొసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగిన వెంటనే ఆ మొసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని మొసలితో ‘ఓ మొసలి మామా! నీకు అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికో మందు చెబుతాను. నన్ను వదిలిపెట్టు అంది. ఆ మొసలి నిజంగానే అస్వస్థతతో బాధపడుతున్నది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి ‘నీకు నా అస్వస్థత సంగతి ఎలా తెలుసు?’ అని అడిగింది. ‘నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది’ అని చెప్పిందా జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అది ‘అదిగో! ఆ నక్కను తింటే నీ అస్వస్థత మాయమౌతుంది. దాన్ని పట్టుకో!’అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టింది మొసలి. ఒడ్డుకు చేరిన జింక పిల్ల ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఎదురుగా ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరుగెత్తింది. బుజ్జి నక్కకూ ఆ మడుగులో మొసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అదీ నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడా మొసలి బుజ్జి నక్క కాలును పట్టుకొని ‘నా అస్వస్థతకు నీ మాంసమే మందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా అస్వస్థతను పోగొట్టుకుంటాను’ అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా ‘అయ్యో.. నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను. నన్ను తిన్నవారిక్కూడా వ్యాధి సోకుతుంది. కావాలంటే అదిగో ఆ ఒడ్డు మీదున్న తోడేలు పిల్లనడుగు’ అంది. అప్పుడు మొసలి ‘ఈ నక్క చెప్పింది నిజమేనా’ అంటూ తోడేలును అడిగింది. ‘ఔను నిజమే’ అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క ‘నీ అస్వస్థతకు సరైన మందును వైద్యుడైన ఎలుగుబంటి చెబుతుంది దాన్నడుగు’ అన్నది. దాంతో బుజ్జి నక్కను వదిలేసింది మొసలి. వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలోకే ఎలుగుబంటి వచ్చిందక్కడికి. మొసలి తన అస్వస్థతకు దాన్ని మందు అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు గనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి, కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి. తర్వాత ‘ఎలుగు మామా! ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందట.. నిజమేనా!’అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి ‘దానికా వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చేది. ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా’ అంది. ‘మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే’ అంది మొసలి. ‘దానికది ఊతపదం. ఏం మాట్లాడినా అది ఔను! నిజమే అంటుంది. ఆ జింక పిల్ల,బుజ్జి నక్క తెలివిగలవి. ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటమేంటీ? రేప్పొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా! చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని, వాటి జోలికి వెళ్లొద్దని మృగరాజు సింహం జంతువులన్నిటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇకనుంచైనా వాటి జోలికి వెళ్లకు. అదిగో! ఆ చెట్టు పండ్లను తిని కడుపు నింపుకో! అవి ఆరోగ్యాన్నిస్తాయి’ అంది ఎలుగుబంటి. ‘ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ మొసలికి చిక్కుతున్నాయి. మరికొన్ని కొలనులు తవ్వించి, జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి’ అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
T20 Blast 2024: క్రికెట్ మైదానంలోకి నక్క
క్రికెట్ మైదానంలోకి పాములు, కుక్కలు రావడం ఇటీవలికాలంలో తరుచూ చూస్తున్నాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఓ గుంట నక్క మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 బ్లాస్ట్ 2024లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానంలో హ్యాంప్‌షైర్, సర్రే మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా.. నక్క ఒక్కసారిగా మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆటగాళ్లు, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.Fox invades the field in Vitality Blast. 😄pic.twitter.com/dENXcc1wIL— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2024నక్క మైదానంలో చక్కర్లు కొట్టడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. నక్క మైదానం సిబ్బంది వచ్చేలోపు పలాయనం చిత్తగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నక్క ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వచ్చిన దారిలోనే కామ్‌గా వెళ్లిపోయింది. ఇది చూసి ఆటగాళ్లు, ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. హ్యాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్ 183 పరుగులకు ఆలౌట్ కాగా.. సామ్ కర్రన్ శతక్కొట్టడంతో (102 నాటౌట్) సర్రే మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, టీ20 బ్లాస్ట్ 2024 చివరి దశకు చేరింది. మే 30న మొదలైన ఈ టోర్నీ పలు బ్రేక్‌ల అనంతరం గ్రూప్ దశను ముగించుకుంది. గ్రూప్ దశ అనంతరం మొత్తం ఎనిమిది జట్లు (సర్రే, డర్హమ్, ససెక్స్, లాంకాషైర్, సోమర్సెట్, వార్విక్షైర్, గ్లోసెస్టర్‌షైర్) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్ దశ సెప్టెంబర్ 3 నుంచి మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 3, 4, 5, 6 తేదీల్లో జరుగనున్నాయి. రెండు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 14న జరుగనున్నాయి. -
ఈ వీడియో చూస్తే.. గాడిద అంటూ ఎవరినీ నిందించరు!
చాలామంది కోపంలో ఎదుటి వ్యక్తిని గాడిదతో పోలుస్తూ నిందిస్తుంటారు. అయితే తాజాగా వైరల్‌గా మారిన ఒక వీడియోలో గాడిద తన తెలివి తేటలను అద్భుతంగా ప్రదర్శించింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన వారంతా ఆ గాడిదను మెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ఇన్నాళ్లూ గాడిద పేరుతో అప్పుడప్పుడూ ఇతరులను నిందిస్తూ వచ్చామని, తెలియక పొరపాటు చేశామని లెంపలేసుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తమ కళ్లనే తాము నమ్మలేకపోతున్నామని అంటున్నారు. మరికొందరు ఈ గాడిద.. కథల్లో చెప్పినట్లు నక్క కన్నా తెలివైనదని అంటున్నారు. ఈ గాడిద కష్టించేందుకు బదులు తన తెలివిని ఉపయోగించి, తాను చేయాల్సిన పనిని మరింత సులభతరం చేసుకుంది. Work smarter.. 😅 pic.twitter.com/fFanLbhCO1 — Buitengebieden (@buitengebieden) December 10, 2023 ఈ వీడియోకు ఇప్పటివరకూ 80 లక్షలకు పైగా వీక్షణలు దక్కాయి. వేలమంది ఈ వీడియోను లైక్ చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏమున్నదనే విషయానికొస్తే.. కొన్ని గాడిదలు వాటికి ఎదురుగా అడ్డుగా ఉన్న కర్రను దాటి వెళుతున్నాయి. అయితే వాటిలో ఒక గాడిదకు అలా కర్రను దాటి అవతలి వైపునకు వెళ్లాలని అనిపించలేదు. కొసేపు ఆలోచించాక దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే అది అడ్డుగా ఉన్న కర్రను తన నోటితో సులువుగా తొలగించి, యమ దర్జాగా, హాయిగా మందుకు కదిలింది. ఈ వీడియోను చూసినవారంతా గాడిద తెలివితేటలకు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది కూడా చదవండి: రైలులో యువతిపై అకృత్యం.. బాత్రూమ్లో నిందితుని పట్టివేత! మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
పదవి నుంచి తప్పుకొన్న మీడియా మొఘల్ ముర్డోచ్.. ఏడు దశాబ్దాల తర్వాత..
మీడియా మొఘల్‌గా పేరొందిన రూపర్ట్ ముర్డోచ్ (Rupert Murdoch) ఏడు దశాబ్దాల తర్వాత పదవి నుంచి దిగిపోయారు. ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన కుమారుడు లాచ్లాన్ ముర్డోచ్ రెండు కంపెనీలకు తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు అమెరికన్ న్యూస్ ఏజెన్సీ ‘ఏపీ’ నివేదించింది. 92 ఏళ్ల రూపర్ట్ ముర్డోచ్ రెండు కంపెనీలకు ఎమిరిటస్ చైర్మన్ అవుతారని, లాచ్లాన్ న్యూస్ కార్ప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని, ఫాక్స్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గానూ కొనసాగుతారని ‘ఫాక్స్’ సంస్థ పేర్కొంది. రూపర్ట్ ముర్డోచ్ ఎమెరిటస్ ఛైర్మన్‌గా కొనసాగనుండటం సంతోషంగా ఉందని, ఆయన విలువైన సలహాలు రెండు కంపెనీలకు కొనసాగుతాయని లాచ్లాన్ ముర్డోచ్ పేర్కొన్నారు. తనలాగే కంపెనీలు కూడా దృఢమైన ఆరోగ్యంతో ఉన్నాయని ‘ఫాక్స్’ ఉద్యోగులను ఉద్దేశిస్తూ రూపెర్ట్ మర్డోచ్ పేర్కొన్నట్లు తమకు లభించిన లేఖను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. ఫాక్స్, న్యూస్ కార్ప్‌లను విలీనం చేయడం ద్వారా తన మీడియా సామ్రాజ్యాన్ని మళ్లీ ఏకం చేసే ప్రణాళికను విరమించుకున్న కొన్ని నెలల్లోనే ముర్డోచ్ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. ఫాక్స్ న్యూస్‌తో పాటు ABC, CBS, NBC వార్తా సంస్థలకు పోటీగా మొదటి ప్రసార నెట్‌వర్క్‌ను ముర్డోచ్ ప్రారంభించారు. అంతేకాదు రూపర్ట్ ముర్డోచ్.. వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థలకు కూడా యజమానే. -
ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్‌కు సీఈవోగా అంజలీ సూద్
ఫాక్స్ కార్పొరేషన్ ఉచిత యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ట్యూబీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారతీయ-అమెరికన్ అంజలీ సూద్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఈవోగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. విమియో కంపెనీ సీఈవోగా ఉన్న అంజలీ సూద్, తొమ్మిదేళ్లు అక్కడ పనిచేశాక ఇటీవలే పదవి నుంచి వైదొలిగారు. ట్యూబీ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫర్హాద్ మస్సౌదీ అనంతరం ఆమె ఆ కంపెనీగా సీఈవోగా నియమితులయ్యారు. విమియో కంటే ముందు ఆమె టైమ్ వార్నర్, అమెజాన్ కంపెనీల ఫైనాన్స్, మీడియా, ఈ-కామర్స్ విభాగాల్లో పనిచేశారు. సీఈవోగా అంజలి సూద్ నాయకత్వంలో విమియో ప్రపంచవ్యాప్తంగా వీడియో క్రియేటర్లు, ఇతర ప్రొఫెషనల్స్‌కు కేంద్రంగా మారింది. 300 మిలియన్లకు పైగా యూజర్లను సంపాదించుకోవడంతోపాటు గణనీయమైన ఆదాయాన్నీ ఆర్జించింది. అమెరికాలో ఇటీవల అత్యధికంగా వీక్షించిన ఫ్రీ యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్‌గా ట్యూబీ నిలిచింది. నీల్సన్ ప్రకారం.. ట్యూబీకి 64 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఈవోగా అంజలీ సూద్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యూబీని ఫాక్స్ కార్పొరేషన్ 2020లో 440 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తం టీవీ వీక్షణ నిమిషాల్లో ప్లూటోటీవీ, పీకాక్, హెచ్‌బీవో మ్యాక్స్‌లను కూడా ట్యూబీ అధిగమించింది. -
కుక్క పిల్ల అని తెచ్చుకుంటే..
బనశంకరి: రోడ్డు మీద కనిపించిన కుక్క పిల్లని ఇంటికి తెచ్చి పాలు పెరుగు పెట్టారు. తరువాత అది నక్క పిల్ల అని తెలిసి అవాక్కయ్యారు. ఇటీవల బెంగళూరు బనశంకరికి చెందిన వ్యక్తి వీధిలో దొరికిన కుక్క పిల్లను ఇంటికి తీసుకువచ్చాడు. మామూలుగా దానికి పాలు, పెరుగు పెట్టారు. అవి తినడంతో అది అనారోగ్యానికి గురై నాలుగురోజుల పాటు ఇంట్లో మూలుగుతూ ఇబ్బంది పడింది. దాని అరుపులు విన్న ఇరుగుపొరుగువారు ప్రాణి సంరక్షకులను ఫోన్ చేశారు. కుక్కపిల్ల వీడియో పంపాలని వారు కోరగా వారు అలాగే చేశారు. దానిని పరిశీలించి అది కుక్క కాదు నక్క అని తేల్చారు. పోలీసులు వచ్చి నక్క పిల్లను తీసుకుని కెంగేరి వద్ద గల జంతు సంరక్షణాలయానికి తరలించారు. కాగా నగరంలో జనావాసాల్లోకి నక్కపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా ఉంది. (చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం) -
పిల్లల కథ: ఎవరు ఎక్కువ ప్రమాదం?
ఒక అడవిలో జింకపిల్ల ఒకటి వుండేది. చాలా తెలివైనది. దాని తెలివికి ముచ్చటపడిన ఆ అడవి జంతువులన్నీ ‘నీలాంటి తెలివిగలవారు రాజుగారి కొలువులో వుంటే మన జంతువులకు మేలు జరగొచ్చు. అదీగాక నీ తెలివికి గుర్తింపూ దొరుకుతుంది’ అని సలహానిచ్చాయి. దాంతో ఆ జింకపిల్ల.. సింహరాజు దగ్గర కొలువు కోసం బయలుదేరింది. అది వెళ్లేముందు జింకపిల్ల తల్లి దాన్ని హెచ్చరించింది ‘మంత్రి నక్కతో మాత్రం జాగ్రత్త’ అంటూ. సింహరాజుని కలిసి కొలువు అడిగింది జింకపిల్ల సింహం కొన్ని ప్రశ్నలు అడిగింది. జింకపిల్ల సమాధానాలు ఇచ్చింది. దాని తెలివి తేటలకు అబ్బరపడ్డ సింహం దానికి తన కొలువులో ప్రధాన సలహా దారుగా ఉద్యోగమిచ్చింది. మంత్రి నక్క.. జింకకు అభినందనలు తెలిపింది ‘నీలాంటి తెలివైనవారు వుండటం వల్ల నాకూ పని భారం తగ్గుతుంది’ అంటూ. ‘ ఇంత మంచి నక్క గురించి అమ్మ ఏంటీ అలా హెచ్చరింది?’ అనుకుంది జింక. నిజానికి జింకపిల్ల కొలువులోకి రావడం నక్కకి యిష్టంలేదు తన ప్రాబల్యం తగ్గితుందని. అయితే బయటపడకుండా సమయం కోసం ఎదురు చూడసాగింది. (పిల్లల కథ: జానకమ్మ తెలివి) ఒకరోజు సింహం.. జింకపిల్ల తెలివితేటల్ని నక్క ముందు ప్రశంసించింది. ‘ఏంటో నాకైతే ఆ జింకపిల్ల అది పక్క రాజ్యం వారు పంపిన గూఢచారేమోనని అనుమానం. త్వరలో సాక్ష్యాలతో రుజువు చేస్తా’ అన్నది. ఒకరోజు ఎలుగు, తోడేలుకు ఏదో ఆశ చూపి సాక్షులుగా తీసుకొచ్చి జింకపిల్ల గూఢచారి అని రుజువు చేయబోయింది. అప్పుడు ఆ కొలువులోనే ఉన్న ఏనుగు ‘ప్రభూ! జింకపిల్ల తెలివైనదని, అది కొలువులో వుంటే బావుంటుందని మేమే దాన్ని మీ దగ్గరకు పంపాం. అది గూఢచారి కాదు’ అని వాదించింది. ఆ వాదనకు భయపడ్డ ఎలుగుబంటి, తోడేలు నిజం చేప్పేశాయి. సింహం కోపంతో నక్కకు చురకలు అంటించింది. తల్లిని కలవడానికి జింకపిల్ల ఇల్లు చేరింది. జరిగింది చెప్పి ‘అమ్మా.. క్రూరజంతువైన సింహం కొలువులో చేరతానంటే ఒప్పుకున్నావు కానీ నక్క లాంటి జంతువుతో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించావు ఎందుకు?’ అని అడిగింది. ‘చెడ్డవారని ముందుగానే తెలిస్తే జాగ్రత్తగా వుంటాం కానీ మంచివారుగా కనిపిస్తూ గోతులు తవ్వేవారినే కనిపెట్టలేం. వారే చాలా ప్రమాదం. సింహం క్రూరజంతువు అని తెలుసు గనక జాగ్రత్తగా వుంటాం. కానీ నక్కలాంటివారు మంచిగా నటిస్తూ కీడు చేయ చూస్తారు. అందుకే అలాంటివారితో జాగ్రత్తా అని చెప్పాను. నీకూ అదే ఎదురైంది గనక ముందు ముందు అలాంటివారితో మరింత జాగ్రత్తగా వుండు’ అంది తల్లి. జింకపిల్ల తన తల్లి సలహా పాటిస్తూ జీవితాన్ని హాయిగా గడిపింది. -
ఇంతకీ ఈ వింత జంతువు పేరేంటి!
అవును.. ఇదేంటి? ఒక్కొక్కరూ ఒక్కోటి చెప్తారు.. చూడ్డానికి నక్కలా ఉందని కొందరు.. కుక్కలా ఉందని మరికొందరు.. ఇవన్నీ కాదహే.. అని ఇంకొందరు.. ఇది తిమింగళం అని మేమంటాం? మీరేమంటారు? ఎర్రగడ్డ నుంచి డిశ్చార్జి అయి ఎన్ని రోజులైంది అని అనేగా.. అచ్చంగా ఇది తిమింగళమే.. అవును.. అవి ఒకప్పుడు నాలుగు కాళ్లపై నడిచేవట. మనిషి కోతి నుంచి పుట్టాడు అంటారు.. ఒక్కో జంతువు.. ఒక్కో జంతువు నుంచి పరిణామం చెందాయనేది కూడా తెలిసిందే. తాజాగా వేల్స్ విషయం చూసుకుంటే.. అవి ఎలా పరిణామం చెందాయనే దానిపై పరిశోధనలు జరిగాయి. ఈ జలచరాలు.. జింకల మాదిరిగా చెంగుచెంగున భూమిపై గంతులు వేసేవనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని నార్త్ ఒహియో మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. లిటిల్ డీర్స్ అనే ఇండోహయస్ జంతువుల నుంచి ఈ వేల్స్ పరిణామం చెందాయని వివరించారు. సీటేషియన్స్ జాతికి చెందిన జంతువుల (హిప్పోపోటమస్, వేల్స్ వంటివి) జీవ పరిణామం గురించి అధ్యయనం చేస్తుండగా, పాకిస్తాన్లో 4.7 కోట్ల సంవత్సరాల కిందటి లిటిల్ డీర్‌కు సంబంధించిన శిలాజం లభించింది. ఇది ఓ నక్క పరిమాణంలో ఉండి, పొడవాటి శరీరం, తోక కలిగి ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ జీవిలోని పలు ఎముకల నిర్మాణం వేల్స్ ఎముకలతో పోలి ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ జంతువులు ఆహారం కోసం వెతుకుతూ.. శత్రువుల బారి నుంచి తప్పించుకునేందుకు సముద్రం దగ్గరికి వెళ్లి దాచుకునేవని, అలా కాలక్రమేణా నీటిలో జీవించే జీవనాన్ని అలవరుచుకున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాస్త లోతుగా అధ్యయనం చేస్తే.. ఇండోహయస్, వేల్స్ రెండింటి కపాలం, చెవుల నిర్మాణాలు ఒకేలా ఉన్నాయని తెలిసింది. మొసళ్ల మాదిరిగా ఆహారం కోసం ఒడ్డున ఎదురుచూసేవని, చివరికి ఆ నీళ్లలోనే జీవనం అలవాటు చేసుకున్నాయని చెబుతున్నారు. -
జిత్తుల మారి నక్క.. తెలివితేటలు
సాక్షి, కరీంనగర్ : జిత్తుల మారి నక్క.. నక్కకు ఉన్న తెలివితేటలు ఎవరికీ ఉండవు అంటారు పెద్దలు. వ్యవసాయ బావిలో పడ్డ నక్క తెలివితో బయటపడి బతుకు జీవుడా అంటూ పరిగెత్తింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లిలో నక్క వ్యవసాయ బావిలో పడి ప్రాణాపాయ స్థితికి చేరింది. రైతులతో పాటు స్థానికులు చూసి అయ్యో పాపం అంటూ నక్కను కాపాడే ప్రయత్నం చేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఒకరు, పాత మంచం లోపటికి విడిచి బయటికి తీద్దామని మరొకరు ఇలా మాట్లాడుకుంటుండగానే నక్క తెలివిని ప్రదర్శించింది. వ్యవసాయ బావిలో నీళ్లలో ఉన్న కరెంటు మోటార్‌కు సంబంధించిన వైరును నక్క నోటితో కొరికి కట్ చేసింది. ఆ వైరును నోటితో జిత్తుల మారి నక్క గట్టిగా పట్టుకోగ రైతులు మెల్లిగా లాగారు. రైతుల సహాయానికి నక్క సహకరించి ప్రాణాలతో బయట పడింది. బతుకు జీవుడా అంటూ పక్కనే ఉన్న గుట్టల్లోకి పరిగెత్తింది. అపాయంలో ఉపాయం అంటు నక్క తన తెలివిని ప్రదర్శించడాన్ని చూసినవారు నక్క తెలివిని మెచ్చుకుంటూ అక్కడి నుంచి మెల్లిగా ఇంటికి చేరుకున్నారు. -
నక్కలు మాట్లాడుతున్నాయా? నవ్వుతున్నాయా?
-
ఇందులో నక్కలు ఏం మాట్లాడుతున్నాయి?
కుక్కలు మొరగడం, పిల్లులు మ్యావ్ అనడం, పక్షులు కూత పెట్టడం చూశాం. మరి నక్కలు ఏం చేస్తాయి? ఊల పెడతాయి అంటారా? అవును, అది రాత్రిళ్లు ఎక్కువగా ఊల పెడుతుంటాయి. కానీ అవి కూడా మాట్లాడతాయి. కానీ ఏం మాట్లాడుతుందో మనకు ఒక్క ముక్క అర్థం కాదు. అయితే "నక్కలు ఏదో మాట్లాడుతున్నాయి. అదేంటో చెప్పండి.." అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది నెటిజన్ల మెదడుకు సవాల్ విసురుతోంది. ఎంత జుట్టు పీక్కున్నా నక్కలు ఏం మాట్లాడుతున్నాయో ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. (అదిగో చిరుత.. ఇదిగో జింక) నిజానికి అవి మాట్లాడటం కన్నా ఎక్కువగా నవ్వుతూనే ఉన్నాయి. ఈ వీడియో ఈ ఏడాది మార్చిలో యూట్యూబ్‌లో ప్రత్యక్షం కాగా తాజాగా ట్విటర్లో వైరలవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 18 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఇందులో కనిపించే మూడు నక్కలు ఫిన్నెగన్, డిక్సీ, విక్సీ. వీటికి చక్కిలిగింతలు పెట్టిన కొద్దీ తెగ నవ్వుతున్నాయి. మధ్యమధ్యలో ఏవేవో శబ్ధాలు చేస్తూ నవ్వుతూ తుళ్లుతూ కిందపడి దొర్లుతున్నాయి. అయితే వీటి నవ్వు మనుషులను పోలి ఉండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. (వైరల్: పాము కాదు, స్పైడర్ కాదు మరేంటి?) -
అది కుక్కపిల్ల కాదు: అక్కడే వదిలేయ్!
టోక్యో : దారి తప్పిపోయిన అడవి నక్కపిల్లను కుక్కపిల్ల అనుకున్న ఓ వ్యక్తి దాన్ని యాజమానితో కలపటానికి తీవ్రంగా శ్రమించాడు. చివరకు నిజం తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ సంఘటన జపాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మార్సీ.కామ్ అనే ట్విటర్ యూజర్‌కు కొద్దిరోజుల క్రితం రోడ్డుపక్కన ఓ జంతువు కనిపించింది. అది కుక్కపిల్ల అనుకున్న అతడు దాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. కుక్కపిల్ల అనుకుంటున్న నక్కపిల్లను యాజమానితో కలపాలన్న ఉద్ధేశ్యంతో ట్విటర్ ద్వారా దాని యాజమాని ఎవరికైనా తెలిస్తే చెప్పాలని, యాజమాని వద్దకు చేర్చడానికి సహకరించాలని ప్రార్థించాడు. అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్ ‘‘ అది కుక్కపిల్లకాదు, నక్కపిల్ల. దాన్ని ఎక్కడినుంచి తెచ్చావో అక్కడే వదిలేయ్!’’ అని చెప్పాడు. ( బుల్లోడా! నువ్వు సామాన్యుడివి కాదు..) దీంతో అతడికి అది నక్కపిల్లా? కుక్కపిల్లా? అన్న అనుమానం కలిగింది. వెంటనే దాన్ని దగ్గరిలోని జంతు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. దాన్ని పరీక్షించిన ఆ వైద్యుడు అది కుక్కపిల్ల కాదని, అడవి నక్కపిల్ల అని తేల్చాడు. మార్సీ.కామ్ ట్విటర్ యూజర్ ఇక చేసేదేమీ లేక దాన్ని నక్కల అభయారణ్యంలో వదిలేశాడు. ( ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి! ) -
ఎగిరే నక్క
ఒకసారి ఒక నక్కకు ‘నేను కూడా పక్షుల మాదిరిగా గాలిలో ఎగిరితే ఎంత బాగుంటుంది’ అనిపించింది. ఆ కోరిక నక్కలో బాగా పెరిగిపోయింది. ఒకరోజు నక్కకు ‘హమ్మింగ్‌బర్డ్’ కనిపించింది. అది ఒక చెట్టు మీది నుంచి మరో చెట్టు మీదికి ఎగురుతూ, ఒక పువ్వు మీది నుంచి మరో పువ్వు మీద వాలుతూ మకరందం తాగుతోంది. అది చూసిన నక్క దాని దగ్గరకు వెళ్లి– ‘‘దయచేసి ఎగరడంలో వున్న రహస్యం ఏమిటో చెప్పవా? నాకు కూడా నీలా ఎగరడం నేర్పించవా?’’ అని బతిమిలాడింది. ‘‘నిజానికి ఎగరడం చాలా తేలిక. అందుకోసం నువ్వు ఏంచేయాలంటే, ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి, దాని మీద నుంచి కిందకు దూకు. ఒకవేళ నీకు కిందికి పడిపోతున్నట్లుగా అనిపిస్తే ‘పైకి, పైకి’ అనుకో. అప్పుడు నీకు గాలిలో ఎగరడం ఎలాగో తెలిసిపోతుంది’’ అని చెప్పింది హమ్మింగ్ బర్డ్. ‘‘ఎగరడమంటే ఇంతేనా?!’’ సంభ్రమంగా అడిగింది నక్క. ‘‘ఏమో మరీ, మా అమ్మ నాకు చెప్పింది అయితే అంతే మరి’’ అంటూ తేనె తాగడంలో మునిగిపోయింది హమ్మింగ్‌బర్డ్. నక్క ఊరుకోకుండా తన చుట్టాలు, పక్కాలు అందరి దగ్గరికి వెళ్లి... ‘‘మీకు, నాకు చాలా తేడా ఉంది. నేను చాలా గొప్పదాన్ని’’ అని ప్రగల్భాలు పలికింది. నక్క మాటలకు అవి బోలెడు ఆశ్చర్యపోయాయి. ‘‘నువ్వు మా కంటే ఎలా గొప్ప?’’ అని మిగిలి నక్కలు అడిగాయి. ‘‘మీరు గాలిలో ఎగరగలరా?’’ అని అడిగింది తెలివి తక్కువ నక్క. ‘‘అందరూ అన్నీ చేయలేరు. పక్షులు ఎగురుతాయి, మనం ఎగరలేము. అవి మనలా అరవలేవు...’’ అని రకరకాలుగా తెలివితక్కువ నక్కకు హితబోధ చేశాయి మిగిలిన నక్కలు. కానీ తెలివి తక్కువ నక్క ఆ మాటలను చెవికెక్కించుకోలేదు. ‘‘నేను గాలిలో ఎగిరిచూపిస్తాను. ఆ తరువాత మాత్రం నేను మీ కంటే గొప్పదాన్ని అని అంగీకరించాలి’’ అన్నది తెలివి తక్కువ నక్క. ‘‘ఎవరు గొప్పా? ఎవరు కాదు? అనేది ఇప్పుడు అనవసరంగానీ, నీలాగే మన తాతల కాలంలో ఒక నక్క పులిని చూసి వాతలు పెట్టుకొని లబోదిబో అందట. నువ్వు అలాంటి పనిచేయకు’’ అని హెచ్చరించాయి బంధుమిత్ర నక్కలు. అయినా సరే, ఆ మాటలను పెడచెవిన పెట్టింది తెలివితక్కువ నక్క. ‘‘మీరు నాతో రావల్సిందే. నేను గాలిలో ఎగిరిచూపిస్తాను’’ అని పట్టుబట్టి వాటిని తనతో పాటు తీసుకెళ్ళింది. అడవంతా గాలించి ఒక పెద్ద చెట్టు కనుక్కుంది. బంధుమిత్ర సపరివారంగా ఆ చెట్టు దగ్గరికి చేరి దాని పైకి ఎక్కింది. కింద నిలబడి చూస్తున్న తన వాళ్లతో... ‘‘ఇప్పుడు నేను ఎట్లా ఎగురుతున్నానో చూడండి’’ అంది కొంచెం గర్వంగా. ఆ జంతువులన్నీ ‘‘వద్దు, వద్దు... కిందపడతావు’’ అని అరిచాయి. కానీ వాటి అరుపులను ఏమాత్రం లెక్క చేయకుండా నక్క ఉత్సాహంగా చెట్టు కొమ్మ చివరి నుంచి ఒక్క ఉదుటున పైకి ఎగిరింది–మనసులో ‘పైకి, పైకి’ అనుకుంటూ. పైకి ఎగరడం మాటేమిటోగానీ, నేల మీద కుప్పకూలిపోయి ‘కుయ్యో మొర్రో’ అని అడవంతా ప్రతిధ్వనించేలా పెడబొబ్బలు పెట్టింది పాపం తెలివి తక్కువ నక్క! ∙ మేకల మదనమోహనరావు -
అదిగో చిరుత.. ఇదిగో జింక
పశ్చిమ ఏజెన్సీలోని పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గల రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటి కదలికలను గుర్తించారు. వీటి సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి) : జిల్లాలోని పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధితో పాటు పాపికొండల నేషనల్ పార్కుగా సుమారు 1.12 లక్షల హెక్టార్లలో అభయారణ్యం విస్తరించి ఉంది. అందులో ఎలుగుబంటులు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుత పులులు, కురుడు పందులు, చుక్కల దుప్పిలు, సాంబాలు, జాకర్స్, ముళ్ల పందులు, ముంగీసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్లు వన్యప్రాణి విభాగం అధికారులు చేసిన సర్వేల్లో బయట పడింది. పాపి కొండల అభయారణ్యంలో చిరుతపులి, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవిదున్నలు ఉన్నట్లు గుర్తించారు. 5 ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలో 60 బీట్లలో 2018లో జంతుగణన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో చిరుత పులులతో పాటు పలు వన్యప్రాణులు ఉన్నట్లు తేలడంతో వాటి సంరక్షణ కోసం గోగులపూడి సమీపంలో బేస్ క్యాంపు, పోలవరం మండలంలోని టేకూరు వద్ద మరో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున సిబ్బంది పని చేసేవిధంగా ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేశారు. అభయారణ్యం సంరక్షణ, జంతువుల ఉనికి తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పలు ప్రదేశాల్లో సంచరిస్తున్న అడవి జంతువుల కదలికలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. పాపికొండల అభయారణ్యంలో చిరుతపులి జాడ ఉందని తేలింది. దీనితో పాటు కార్నివోర్స్, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవి కుక్కలు, కుందేళ్లు, లేళ్లు, కనుజులు, అడవి పందుల జాడ కూడా ఉన్నట్లు తేలింది. పోలవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు అటవీరేంజ్ పరిధిలో నిర్వహించిన జంతు గణనల్లో పోలవరం రేంజ్ పరిధిలో సుమారు 30 అడుగుల గిరినాగులు కూడా ఉన్నట్లు తేలిందని అధికారులు చెప్పారు. కానరాని పెద్ద పులుల జాడ 2018లో నిర్వహించిన జంతు గణనల సర్వేలో జీవజాతుల సంఖ్య పెరిగినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో పెద్దపులుల జాడ ఉన్నట్లు ఎక్కడా సమాచారంలేదని అధికారులు చెబుతున్నారు. అయితే పెద్దపులి జాడ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తద్వారా సీసీ కెమెరాల ద్వారా బంధించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో పులుల సంచారం కూడా ఉందని, అయితే కెమెరాల్లో బందీ కావడంతో పాటు ఆచూకీ లభిస్తేనే వెల్లడిస్తామని అంటున్నారు. వేసవిలో వణ్యప్రాణుల దాహర్తి తీరుతుందిలా.. వేసవిలో వణ్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అటవీశాఖ అధికారులు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తారు. కుక్కలు, వాహనాల బారిన పడకుండా అటవీప్రాంతంలో జంతువులు సంచరించే ప్రాంతంలో సాసర్వెల్(నీటి తొట్టె) ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటితో నింపుతారు. బేస్‌క్యాంప్ సిబ్బందితో కలిసి అధికారులు ప్రతీరోజూ నీటిని పరిశీలించి అందులో చెత్తలేకుండా చూస్తారు. నీటి తొట్టె పక్కనే ఉప్పుముద్దను కూడా ఏర్పాటు చేస్తారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చుకుని ఉప్పుముద్దను నాకుతాయి. దీంతో ఎండ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పోలవరం, కన్నాపురం, కుక్కునూరు, వేలేరుపాడు రేంజ్ పరిధిలో సుమారు 70 వరకూ నీటి తొట్టెలు 150 వరకూ చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో వేణుగోపాల్ తెలిపారు. వెంటాడుతున్న నిధుల కొరత వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు అనేక అవస్థలు పడుతున్నారు. నీటితొట్టెల్లో నీటిని ట్యాంక్‌ల ద్వారా తరలించేందుకు, ఇతర ఏర్పాట్లకు నిధుల కొరత వెంటాడుతున్నట్లు అధికారులు అంటున్నారు. నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా మంజూరుకాలేదని దీనితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. జంతు సంరక్షణ కోసం చర్యలు అటవీ ప్రాంతంలోని జంతువులను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణి దాహర్తి తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే చెక్‌డ్యామ్‌లు, ర్యాపిడ్ ఫీల్డ్ డ్యామ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అయితే పనులకు సంబంధించి కాస్త నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. గత ఏడాది నుంచి నిధులు మంజూరు కావడంలేదు. – జి.వేణుగోపాల్, డిప్యూటీ రేంజర్ అధికారి వైల్డ్‌లైఫ్, పోలవరం -
నక్కతో జల్లికట్టు : 11మందికి జరిమానా
చెన్నై, తిరువొత్తియూరు: నిబంధనలకు విరుద్ధంగా గుంటనక్క జల్లికట్టు నిర్వహించిన 11 మందికి అటవీశాఖ అధికారులు జరీమానా విధించారు. సేలం జిల్లా వాళపాడి దాని పరిసర ప్రాంతాలలో 30 మందికిపైగా గ్రామ ప్రజలు 200 సంవత్సరాలుగా సంప్రదాయరీతిలో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలని గుంట నక్కతో జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గుంటనక్క జల్లికట్టుకు అటవీశాఖ వారు నిషేధం విధించారు. ఈ క్రమంలో వాళపాడి సమీపం చిన్నమనాయకన్ పాళయంలో శనివారం డప్పు వాయిద్యాలతో గుంట నక్కతో జల్లికట్టు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం మారియమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించి తరువాత 20 మంది ప్రజలు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుంట నక్క కోసం వల వేసి వేచి ఉంచారు. అర్ధరాత్రి సమయంలో గుంట నక్క వలలో చిక్కుకుంది. శనివారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన గుంట నక్కను రెండు కి.మీ దూరం గ్రామాలలో తిరగనిచ్చి మారియమ్మన్ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. తరువాత నక్కకు పూలమాల వేసి జల్లికట్టు నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న వాళపాడి అటవీశాఖ ఉద్యోగులు చిన్నమనాయకన్ పాళయంకు చేరుకుని నిబంధనలను అతిక్రమించి నక్కతో జల్లికట్టు జరిపిన 11 మందిపై కేసు నమోదు చేశారు. వారికి రూ.55వేలు జరిమానా విధించారు. -
కనుమరుగవుతున్నాయి.. కాపాడుకుంటే మేలు
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్): భూమిపై జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉంది. మానవ మనుగడకు జీవజాతుల అవసరం కీలకం. చీమ, పేడపురుగు, సీతాకోక చిలుక, నక్క, ఉడుము, కాకి, గబ్బిలం ఇలా ఎన్నో జీవులు ప్రత్యేకంగానో.. పరోక్షంగానో.. మానవ ప్రయోజనకారులు . మారుతన్న జీవన విధానంతో జీవ వైవిధ్యానికి కీడు కలిగిస్తోంది. కొన్ని జాతులు వేట గాళ్ల బారీన పడి కనుమరుగవుతుంటే... మరికొన్ని సహజంగా క్షీణదశకు చేరుకుంటున్నాయి. మితిమీరిన రసాయనాల వాడకం, ఆధునిక సమాచారల వ్యవస్థలతో కొన్ని జీవజాతులు కనుమరుగవుతున్నాయి. అందుకే అంతాకలిసి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మాయమవుతున్న ఉడుములు..! ఉడుములు అన్ని ప్రాంతాల్లోనూ సంచరిస్తుంటాయి. వీటిని శాస్త్రీయంగా వెరానస్ బెంగా లెన్సిస్ అంటారు. ఇవి సుమారు మూడున్నర కిలోల బరువు వరకు ఉంటాయి. భూమిలో బొరియాలు చేసి గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పి వేయడం వీటి ప్రత్యేకత. ఇవి పంటలకు హానీ చేసే కీటకాలను ఆహారంగా తీసుకొని ప్రయోజనకారిగా ఉంటాయి. వీటి మాంసం నడుంనొప్పులను తగ్గిస్తుందనే ఓ నమ్మకం ప్రచారంలో ఉంది. దీంతో వేటగాళ్లు వీటికి ఉచ్చులు వేసి పట్టుకొని విక్రయిస్తుంటారు. తూనిగలు కనుమరుగు... గుండ్రటి తల.. పొడవాటి రెక్కలు.. తోక చిన్నరకం హెలికాప్టర్ ఉండే తూనిగలను చూస్తే అందరికీ ముచ్చటేస్తోంది. చిన్నప్పుడు ప్రతీ ఒక్కరూ వాటితో ఆడుకునే ఉంటారు. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్న వెంటనే తూనిగలు గుంపులుగుంపులు చేరి గాల్లో ఎగురుతు కనిపిస్తాయి. నిజానికి ఇవి కీటకాలను తినే మాంసాహారులు వీటి జీవితంలో తక్కువ కాలం నీటిలో సయాడ్ అనే లార్వా రూపంలో ఉంటూ దోమగుడ్లను ఆహారంగా తీసుకొని దోమల నివారణకు ఉపయోగపడుతుంటాయి. ఫైడా తూనిగలు దోమలను, పంటలకు నష్టం కలిగించే శుత్రు పురుగులను తిని రైతులకు మేలు చేస్తాయి. రసాయాన ఎరువులు, పురుగు మందులు నీటి కాలుష్యంతో ప్రస్తుతం తూనిగలు కనుమరుగవుతున్నాయి. వాన పాముల.. భూమి పుత్రులు..! వానపాములు భూమిని సారవంతం చేస్తాయి. కొన్ని వేల సంఖ్యలో భూమి పై పొరల్లో ఉండి కంపోస్టును తయారు చేస్తాయి. ఇవి నేలలో బొరియాలు చేయడంతో నీటిని నిల్వ చేసుకునే శక్తి పెరుగుతోంది. వానపాము విషర్జకంలో నత్రజని సహజంగా ఉంటుంది. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం పెరిగి నేలలో వానపాములు చనిపోతున్నాయి. దీంతో నేలకు అవసరమయ్యే జీవద్రవం అందక గట్టిపడి పోతున్నాయి. కూలుతున్న పిచ్చుక గూడు.. ! గూడు కట్టుకోవడం అన్ని పక్షులది ఒక తీరైతే పిచ్చుకల గూడుది మరో ప్రత్యేకత. ఇవి ఇంజనీరింగ్ ప్రతిభ మాదరిగా.. ఈత, తుమ్మ, తాటి చెట్ల కొమ్మలకు చివరన గూల్లు కట్టుకుంటాయి. ఒకటే పొడవు ఉన్న గడ్డి పోచలను ముక్కున కరచి తెచ్చుకుని అత్యంత నైపుణ్యంతో గూళ్లను కట్టి ఆడపక్షిని ఆకర్శిస్తాయి. గూడు లోపల వెచ్చగా ఉండడంతో వాన వచ్చిన తడవక పోవడం దీని ప్రత్యేకత. ఇవి కూడ కీటకాలను అదుపులో ఉంచుతాయి. గుంట నక్క జిత్తులేవి..? ఇప్పటికే మన పరిసరాల్లో తోడేలు కనిపించడం లేదు. ఇక జిత్తులతో అందరిని అబ్బుర పరిచే టక్కులమారి గుంటనక్క ఆపదలో పడిపోయింది. వీటిని శాస్త్రియంగా ఉల్ప్స్ బెంగాలెన్సిస్ అంటారు. ఇవి భూమి లోపల రెండు నుంచి మూడు భూమి లోతులో గుంటలు చేసుకుని జీవిస్తాయి. చిన్న జంతువులు ఎలుకలు, పందికొక్కులు, పీతలు, కీటకాలను ఆహారంగా తీసుకొని వ్యవసాయ రంగానికి సహాకరిస్తాయి. రెల్లు దుబ్బలు వంటి వాటి ఆవాసాలను నాశనం చేయడం, పురుగుల మందుల ప్రభావంతో ఈ జాతి అంతరించి పోతుంది. -
డిస్నీ చేతికి ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ వ్యాపారం
లాస్ఏంజెల్స్: ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఫాక్స్ కంపెనీ ఎంటర్టైన్మెంట్ వ్యాపారాన్ని డిస్నీ కంపెనీ చేజిక్కించుకుంది. ఈ డీల్ విలువ 7,100 కోట్ల డాలర్లు మేర ఉంటుంది. ఒప్పందంలో భాగంగా ఫాక్స్ సంస్థకు చెందిన ఫిల్మ్, టీవీ స్టూడియో, ఎఫ్ఎక్స్, నేషనల్ జాగ్రఫిక్, హులు స్ట్రీమింగ్ సర్వీస్‌లో ఫాక్స్‌కు ఉన్న 30 శాతం వాటా, స్టార్ ఇండియాలపై హక్కులు డిస్నీకి లభిస్తాయి. ఈ కంపెనీ చేజిక్కిన ఫలితంగా డీస్నీ సంస్థ, డిస్నీ ప్లస్ పేరుతో అందించనున్న స్ట్రీమింగ్ సర్వీస్ ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి టెక్నాలజీ కంపెనీలకు గట్టిపోటీనివ్వడానికి ఈ డీల్ డిస్నీకి దోహదం చేయనున్నదని అంచనా. ఇది అసాధారణమైన, చారిత్రాత్మక డీల్ ఇది ఒక అసాధారణమైన, చారిత్రాత్మక ఘటన అని వాల్ట్ డిస్నీ కంపెనీ చైర్మన్, సీఈఓ రాబర్ట ఐగర్ వ్యాఖ్యానించారు. కాగా డిస్నీ, ఫాక్స్ రెండు కంపెనీలు సినిమాలు తీసే రంగంలోనే ఉండటంతో ఇరు సంస్థల్లో 4,000 ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ డీల్‌తో వార్నర్ బ్రదర్స్, యూనివర్శల్, సోనీ పిక్చర్స్, పారమౌంట్ పిక్చర్స్, డిస్నీ... ఈ 5 పెద్ద స్టూడియోలే హాలీవుడ్లో మిగులుతాయి. -
హ్యాట్సాఫ్ సుమ!
మహబూబాబాద్ రూరల్: నీళ్లు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురికాకూడదనే ఉద్దేశంతో తాగునీటి బావిలోని నక్క కళేబరాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు సాహసం చేసి తొలగించింది. మహబూబాబాద్ మండలం బేతోల్ గ్రామ శివారులోని నల్లా బావిలో ఓ నక్క పడి రెండు రోజులవుతోంది. ఆ మూగజీవి నరకయాతన పడుతుండటంతో మాజీ సర్పంచ్ సంతోష్ శుక్రవారం ’నేను సైతం’ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యురాలు సుమకు సమాచారం అందించారు. ఆమె బావి వద్దకు చేరుకునే సరికి అప్పటికే నక్క చనిపోయి కళేబరం నీటిపై తేలడాన్ని గమనించి.. వెంటనే మునిసిపల్ ప్రత్యేక అధికారి దిలీప్‌కు ఫోన్ చేశారు. కళేబరాన్ని తొలగించి నీళ్లల్లో బ్లీచింగ్ పౌడర్ కలిపేందుకు సిబ్బందిని పంపాలని కోరగా ఆయన వద్ద నుంచి సానుకూల సమాధానం రాకపోవడంతో స్వయంగా ఆమె నడుముకి తాడు కట్టుకుని మాజీ సర్పంచ్ సంతోష్ సహకారంతో సుమారు 42 అడుగుల లోతుగల బావిలోకి దిగి నక్క కళేబరాన్ని బయటకు తీసింది. దీంతో గ్రామస్తులంతా సుమను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారుల తీరుపపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
కుక్క కాదు.. నక్క!
బుజ్జి కుక్క పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. మీలాగే చైనాలో కూడా వాంగ్ అనే ఒక అమ్మాయి చాలా ఇష్టపడి గతేడాది ఓ దుకాణం నుంచి చిన్న కుక్క పిల్లను కొనుక్కుంది. దాన్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంది. అయితే షాంగ్జీ ప్రావిన్స్ జిన్జాంగ్లో కొన్న ఈ కుక్కపిల్ల కొద్ది నెలలు బాగానే ఉంది. ఆ తర్వాతే కుక్కలు తినే ఆహారాన్ని తినడం మానేసిందట. తోక కూడా కుక్కలకు పెరిగినట్లు కాకుండా చాలా పొడవుగా పెరగుతోందట. అయితే వాంగ్ దీన్ని అంతగా పట్టించుకోలేదట. అయినా కూడా చికెన్, పళ్లు వంటి ఆహారాన్ని పెడుతూనే ఉందట. అయితే ఇక అప్పటి నుంచి ఆమెకు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయట. వెంట్రుకలు చాలా మందంగా, గుబురుగా పెరుగుతున్నాయట. ముక్కు పొడవుగా సాగుతోందట. తోక సాధారణ కుక్కల కన్నా చాలా పొడవుగా పెరిగిందట. మామూలు కుక్కల మాదిరిగా అరవడం లేదట. పార్కులకు తీసుకెళ్లినప్పుడు తోటివారంతా ఇది కుక్క కాదు.. నక్క అని చెప్పడంతో కంగారుపడ్డ వాంగ్ కుక్కల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిందట. అప్పుడు అసలు విషయం చెప్పారు డాక్టర్లు. దీంతో ఈ నక్కను జంతుశాలకు అప్పగించిందట. -
అదృష్టం కోసం.. ఇంట్లో నక్కపిల్ల
దొడ్డబళ్లాపురం: రోజూ అదృష్టం కలిసిరావాలంటే పొద్దున లేవగానే నక్క ఫొటో చూడండని కొందరంటుంటారు. అందుకే నక్క ఫొటోలకు ఫ్రేం కట్టి మరీ విక్రయిస్తుండడం చూస్తుంటాం.అయితే ఇక్కడో మహిళ అదృష్టాన్ని ఇంట్లోనే పెట్టేసుకోవాలనుకుందేమో, నక్కపిల్లను తీసుకువచ్చి ఇంట్లో పెంచుకుంటోంది. ఈ సంఘటన నెలమంగల తాలూకా మస్కూరులో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఒక చిన్నకారు రైతు మహిళ నక్క పిల్లను పెంచుకుంటోందని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఇంటిపై దాడిచేసి నక్కను స్వాధీనం చేసుకున్నారు. అదృష్టం వరిస్తుందని పెంచుతున్నానని, వేరే ఉద్దేశం లేదని ఆమె వేడుకోవడంతో అధికారులు కేసు నమోదు చేయకుండా వదిలేశారు. నక్కపిల్లను బన్నేరుఘట్ట నేషనల్ పార్కుకు తరలించారు. -
నక్క బావ కథ కంచికేనా!
అంతరిస్తున్న నక్క, తోడేలు, మచ్చల జింక ► ప్రమాదంలో 150 వృక్ష, జంతుజాతుల మనుగడ ► 95 జాతుల జాబితాను రూపొందించిన జీవ వైవిధ్య బోర్డు ► మచ్చల కందుల జాడ లేదు.. పేలాల జొన్నల ఊసు లేదు.. ► పులి, ఉడుము, ఎలుకమూతి ఎలుగుబంటు, రాబందులకూ పొంచి ఉన్న ప్రమాదం.. కళ్లు తెరవకుంటే కనుమరుగే సాక్షి, హైదరాబాద్: ‘అనగనగా ఓ తోడేలు.. ఓ అడవిలో నక్క ఉండేది..’ చిన్నతనంలో బామ్మ చెప్పిన కథలన్నీ ఇలాగే మొదలయ్యేవి! చందమామ, బాలమిత్ర పుస్తకాల కథల్లోనూ చాలావరకు ఇవే కనిపించేవి. కానీ పరిస్థితులు చూస్తుంటే మున్ముందు ఈ జంతువుల ఉనికి ఇక కథలకే పరిమితమయ్యేలా ఉంది. భావి తరాలు వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కోల్పోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో వీటితోపాటు అనేక జంతు, వృక్ష, పక్షి, ఉభయచర, సరీసృపాల జాతుల మనుగడ ప్రమాదంలో పడిపోయింది. అవన్నీ అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఈ జాబితాలో సుమారు 150 జాతులున్నట్లు తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు గుర్తించింది. ప్రస్తుతానికి 95 జాతుల జాబితాను రూపొందించింది. మరో 55 జాతుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. అరుదైన వృక్ష, జంతు జాతులను పరిరక్షించుకోకుంటే భావి తరాలకు ఇవన్నీ దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబంధులు.. మచ్చల కందులేవీ? వినువీధిలో రాబంధుల రెక్కల చప్పుడు క్రమేణా కనుమరుగవుతోంది. తెలంగాణ సంప్రదాయ పంట మచ్చల కందులు మాయమౌతున్నాయి. రాష్ట్రానికే తలమానికమైన అరుదైన వృక్ష, జంతుజాతులు మాయమై జీవవైవిధ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. తరతరాలుగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన పంటలు కూడా అంతరించిపోతున్నాయి. తాతలనాటి నుంచి వంశపారంపర్యంగా> వస్తున్న ఎర్రమచ్చల కందులు.. పేలాల జొన్నలు, వాయునౌక జొన్నలు వంటి పంటలు అంతర్ధానమవుతున్నాయి. అడవుల నరికివేత, వేటలతో మన్ననూరు గేదె వంటి అరుదైన జంతు జాతులూ అంతరించిపోయే జాబితాలో చేరాయి. అంతరించిపోతున్న వృక్ష, జంతుజాతులివే.. పర్యావరణపరంగా అరుదు(రేర్), ఎన్డేంజర్డ్ (అంతరించిపోతున్న దశ), థ్రెటన్డ్(అంతిమ దశ) అన్న విభాగాల్లో సుమారు 150 వృక్ష, జంతు జాతులున్నట్లు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి గుర్తించింది. వాటి వివరాలివీ.. వృక్ష జాతులు(25): ఎర్రమచ్చల కందులు, పేలాల జొన్నలు, వాయునౌక జొన్న తదితరాలు జంతువులు(23): నక్క, తోడేలు, మన్ననూర్ గేదె, అడవి కుక్క, చిరుత, హైనా, మచ్చల జింక, బురద మచ్చల పిల్లి, ఉడుము, ఎలుకమూతి ఎలుగుబంటి, పులి వంటివి.. పక్షులు(27): తెల్ల రాబంధు, పొడవు ముక్క రాబంధు, ఎర్రతల రాబంధు, ఈజిప్షియన్ రాబందు, పెద్దమచ్చల గద్ద, కొంగ(బ్లాక్నెక్డ్ స్టార్క్) తదితరాలు సరీసృపాలు(9): మగ్గర్ మొసలి, కొండచిలువ వంటివి.. చేపలు(10): క్లైంబింగ్ పెర్క్, దక్కన్ వైట్ కార్ప్, దక్కన్ నంగ్రా వంటివి.. అరుదైన పంటలు ఎందుకు కనుమరుగవుతున్నాయంటే.. – వాతావరణ మార్పులు – సంప్రదాయ వంగడాలను పరిరక్షించుకునే దిశగా రైతులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లేకపోవడం – రైతులు వాణిజ్య పంటలకే మొగుచూపడం. విత్తనాలు విరివిగా లభించకపోవడం – మార్కెటింగ్ వసతులు లేకపోవడం, నిల్వచేసేందుకు స్టోరేజీ సదుపాయాలు లేకపోవడం – విత్తనాల లభ్యత లేకపోవడం, ఆశించిన దిగుబడి రాకపోవడం – సాగు భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారడం – నీటి సౌకర్యం లేకపోవడం – చీడపీడల నివారణ, ఎరువులు, పురుగు మందులు భారమవడం జంతుజాతుల ఎందుకు ప్రమాదంలో పడుతున్నాయి? – వన్య మృగాల వేట – అడవుల నరికివేత. వాస్తవానికి రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం అడవులుండాలి. కానీ మన రాష్ట్రంలో 23 శాతమే ఉన్నాయి – అటవీ ప్రాంతాల్లో మైనింగ్, వ్యవసాయ, వాణిజ్య కార్యకలాపాలు – అడవుల్లో సహజసిద్ధ వాతావరణం కనుమరుగుకావడం – జంతు జాతుల సంతానోత్పత్తి దిశగా ప్రయోగాలు చేయకపోవడం పరిష్కారం ఏంటి? – అంతరించిపోతున్న జీవజాలం వీర్యం, అండాలను సేకరించి ప్రయోగశాలల్లో కృత్రిమ ఫలదీకరణ చేయడం ద్వారా ఆయా జాతులను పరిరక్షించవచ్చు – అరుదైన పంటలు, వృక్షజాతుల విత్తనాలు సేకరించి, మరింత అభివృద్ధిపరచి రైతులకు అందజేయడం అవగాహన కల్పిస్తున్నాం: డాక్టర్ సి.సువర్ణ, సభ్య కార్యదర్శి, రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు అరుదైన వృక్ష, జంతుజాలం పరిరక్షణకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలోని బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అరుదైన పంటల పరిరక్షణ ద్వారా మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయవచ్చని అందరూ గుర్తించాలి. సంప్రదాయ పంటల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయి. ఈ పంటలతో అధిక దిగుబడులు సాధించే దిశగా పరిశోధనలు జరగాల్సి ఉంది. అంతరించిపోతున్న జంతు జాతులపై అవగాహన పెంపొందించుకోవాలి. వాటి పరిరక్షణకు అందరూ చర్యలు తీసుకోవాలి. -
మింగలేక.. కక్కలేక..
-
ఎవరా నక్క? ఏమా కథ?
‘‘మానవ జన్మలో వుండగా నక్క జీవితంపై నాకు అపోహలుండేవి. అవన్నీ అపోహలే. నక్కకి నక్క జీవితంలో దొరికే సౌఖ్యం నక్కగా నాకు దొరుకుతోంది. నన్నిలా బతకనీ’’ అంటూ డ్రైనేజీ బొరియలోకి వెళ్లిపోయాడు గురువు. ఇంతకీ కథ అంతరార్థం తెలియలేదండీ అంటే పెద్దాయన ‘‘నాకూ అంతే’’ అంటూ నవ్వాడు. నదుల అనుసంధానం జరిగి పోయింది. మనదిక కరువు రహిత రాష్ట్రం- అని రాష్ట్ర మం త్రులు మోకాల్లోతు నీళ్లలో నిల బడి డిక్లేర్ చేశారు. గోదావరీ మాతకు పూర్ణకుంభంతో స్వా గతం పలికారు. ప్రకృతిలో దొ రికే పసుపుపచ్చ పూలను బకె ట్ల కొద్దీ గోదావరి జలాలకు సంతోషంగా సమర్పించారు. రాష్ట్ర ప్రజకు ఏమి జరు గుతోందో అర్థం కావడం లేదు. ‘‘అయితే మాకు నీళ్లొదుల్తారా’’ అంటున్నారు కృష్ణా డెల్టా రైతులు. ఏమిటి మళ్లీ యిటువైపు మళ్లారని అడిగితే- ఔనండీ, ఎప్పుడూ కేపిటల్ కబుర్లే వినిపిస్తుంటే బోరుకొడు తోంది. అందుకని పది పన్నెండు టాపిక్స్ తీసుకుని వాటి మీద దృశ్యాలు తయారు చేస్తున్నాం అంటూ వివ రించాడు ప్రభుత్వంతో ప్రమేయం వున్న ఛోటా నాయ కుడు. దానికో సిలబస్ తయారు చేసుకున్నాం. ఆ ప్రకా రం ముందుకు వెళ్తున్నామని చెప్పాడు. పది రోజులు గమనించాక ఆయన చెప్పింది నమ్మాలనిపించింది. తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువై నాయి. వేర్వేరు కారణాల వల్ల ధైర్యం కోల్పోయి ఆత్మహ త్యలకు పాల్పడుతున్నారని అధికార వర్గాలు నివేదికలు సమర్పిస్తున్నాయి. కారణం ఏదైనా జరుగుతున్నది చాలా దారుణం. ముందుగా వాటి నివారణకు అందరూ నడుం కట్టాలి. చదువుకున్న యువత గ్రామాలకు వెళ్లి నాలుగు మంచి మాటలు వారికి చెప్పాలి. అంతకు మిం చిన దేశ సేవ మరొకటి ఉండదు. విజువల్ మీడియాకి నేడు బాగా వ్యాప్తి వుంది. దృశ్య మాధ్యమాలలో మాన సిక వైద్యం అందించాలి. దురదృష్టవశాత్తు మన రాజ కీయవేత్తలు, అధికారగణం సామాన్య ప్రజలో విశ్వా సాన్ని కోల్పోయారు. అధికారుల చేతిలో అధికారం లేక పోవడం, నేతలకు చిత్తశుద్ధి లేకపోవడం ఇందుకు కారణం. ‘‘దేశ సేవని ప్రవృత్తిగా కాక వృత్తిగా స్వీకరించడం మొదలయ్యాక దేశానికి అరిష్టం చుట్టుకుందండీ’’ అం టూ ఓ కథ చెప్పాడు పెద్దాయన - వెనకటికి ఒక గురుశిష్యులున్నారు. గురువు ఒక రోజు శిష్యుణ్ణి చేరపిలిచి ‘‘ఇప్పుడే మనో నేత్రంతో చూశా. వచ్చే జన్మలో నేనొక నక్కగా జన్మించబోతున్నా. కారణాలు అడగద్దు. పూర్వజన్మ అవశేష ఫలితం’’ అని చెప్పాడు. నువ్వొక సాయం చేయాలి శిష్యా. నేను నక్క గా పుట్టగానే నన్ను నిర్దాక్షిణ్యంగా చంపెయ్. ఎందు కంటే ఇంత బతుకూ బతికి నక్కజిత్తులతో జీవించుట దుర్లభమని వాపోయాడు. శిష్యుడు అంతా విని అయితే నక్క రూపంలో వున్న మిమ్మల్ని గుర్తించడం ఎలా గురూ అని అడిగాడు. ‘‘ఏం లేదు శిష్యా. ఇప్పుడు నా మూతి మీదున్న పెద్ద పుట్టుమచ్చ అప్పుడు కూడా ఉంటుంది. అదే నా కొండ గుర్తు’’ అన్నాడు. శిష్యుడికి కర్తవ్యం బోధ పడింది. కొన్నాళ్లకు గురువు కాలం చేశాడు. నమ్మక పాత్రమైన శిష్యుడు నక్క గురువు కోసం కొండల్లో కోనల్లో అడవుల్లో అన్వేషించడం మొదలుపెట్టాడు. ఒక శుభోదయాన నగరంలోనే గురువు తారసపడ్డాడు. చూడగానే శిష్యుడికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. నక్కను తరిమి తరిమి చంపడానికి సిద్ధపడ్డాడు. నక్క ‘శిష్యా చం పకు, చంపకు’ అని అరిచింది. శిష్యుడు ప్రశ్నార్థకంగా చూశాడు. ‘‘మానవ జన్మలో వుండగా నక్క జీవితంపై నాకు అపోహలుండేవి. అవన్నీ అపోహలే. నక్కకి నక్క జీవితంలో దొరికే సౌఖ్యం నక్కగా నాకు దొరుకుతోంది. నన్నిలా బతకనీ’’ అంటూ డ్రైనేజీ బొరియలోకి వెళ్లిపో యాడు గురువు. ఇంతకీ కథ అంతరార్థం తెలియలేదండీ అంటే పెద్దాయన ‘‘నాకూ అంతే’’ అంటూ నవ్వాడు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ -
భంగపడ్డ బెస్తవాడు
ఒక ఊరిలో గోపీనాథ్ అనే బెస్తవాడు ఉండేవాడు. అతను చాలా పిసినిగొట్టు. ఒకరోజు అతను ‘అడవిలో ఒక చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఉన్నాయి’ అనే విషయం విన్నాడు. ఆ మరునాడు ఎవ్వరికీ చెప్పకుండా తెల్లవారక ముందే బండి తోలుకుని అడవికి వెళ్ళాడు, దేవుడా ఇంకెవరూ ఆ చెరువు దగ్గరకు రాకూడదు. నా ఒక్కడికే బోలెడన్నీ చేపలు దొరకాలి అని దారంతా ప్రార్థిస్తూనే ఉన్నాడు. రెండు గంటల ప్రయాణం తర్వాత గోపీనాథ్ చెరువు దగ్గరకు చేరుకున్నాడు. ఆ చెరువులో వందలాది చేపలు ఉన్నాయి. గోపీనాథ్ ఆనందానికి అంతేలేదు. వెంటనే బండిలోంచి వల తీసి చెరువులోకి విసిరాడు. మధ్యాహ్నం అయ్యేసరికి తన దగ్గరున్న బుట్టల నిండా చేపలు పట్టాడు. ‘ఈ రోజు నా పంట పండింది. ఈ చేపలు సంతకు తీసుకెళ్ళి అమ్ముకుంటే ఎంతో డబ్బు వస్తుంది’ అనుకుంటూ ఆనందంగా తిరుగు ప్రయాణం అయ్యాడు. దారిలో ఒక గుంటనక్క చేపల వాసన పసికట్టింది. దానికి ఎన్నో రోజుల నుండి చేపలు తినాలని ఉంది. అయితే చెరువులో చేపలు పట్టుకోవడం చేతకాకపోవడంతో దాని కోరిక తీరలేదు. దాంతో చెట్టు చాటు నుండి గోపీనాథ్ ప్రయాణిస్తున్న బండిని నక్కి నక్కి చూసింది. చేపలను ఎలా తస్కరించాలా అని చాలాసేవు ఆలోచించింది. చివరకు ఆ నక్కకు ఒక గొప్ప ఉపాయం తట్టింది. వెంటనే అడ్డతోవన పరుగెత్తి, గోపీనాథ్ వస్తున్న దారిలో నేలమీద వెల్లకిలా పడిపోయింది. దారికి అడ్డంగా పడున్న నక్కను చూసాడు గోపీనాథ్. ‘ఆహా ఏమీ నా అదృష్టం! ఈ నక్క చర్మాన్ని సంతలో అమ్ముకుంటే చాలా ధనం వస్తుంది’ అనుకుంటూ నక్కను ఎత్తి బండిలో వేసుకుని, తిరిగి బండిని తోలసాగాడు. కొద్దిదూరం వెళ్ళాక నక్క నెమ్మదిగా లేచి చేపలు తినటం మొదలెట్టింది. దాని కడుపు నిండాక ఒక్కొక్క చేపను నేలమీద జారవిడవసాగింది. అలా బండిలో ఉన్న బుట్టలన్నీ ఖాళీ అయ్యాక నిశ్శబ్దంగా బండి దిగి అడవిలోకి పారిపోయింది నక్క. గోపీనాథ్ సంతకు చేరుకుని వెనక్కు తిరిగి చూస్తే అక్కడ ఇంకేం ఉంది? చేపలూ లేవు. నక్కా లేదు. దాంతో పెద్ద పెట్టున రోదించాడు. ఆ సమయంలో నక్క తన స్నేహితులతో చేపల విందు చేసుకోసాగింది. దాని తెలివితేటలకు మిగతా నక్కలన్నీ ఎంతో మెచ్చుకున్నాయి. నీతి: దురాశ దుఃఖానికి చేటు -
నక్కలు ఆహారాన్ని నమలవా?
► మగ నక్కను డాగ్ లేక రేనార్డ్ అని, ఆడ నక్కను విక్సెన్ అని అంటారు. వీటి నివాసాన్ని డెన్ లేక ఎర్త్ అంటారు! ►నక్కపిల్లల్ని కిట్స్ అంటారు. ఇవి జన్మించిన రెండు వారాల తర్వాతే కళ్లు తెరుస్తాయి. రెండు వారాల వరకూ వాటికి చెవులు కూడా వినిపించవు. అందుకే అంతవరకూ అవి బొరియల్లోంచి బయటకు రావు! ► నక్కలకు పగలు కంటే రాత్రిపూట కళ్లు చాలా బాగా కనిపిస్తాయి. అందుకే ఎక్కువగా రాత్రిళ్లే వేటాడుతుంటాయి! ►ఇవి ఆహారాన్ని నమలవు. పళ్లతో కొరికి అమాంతం మింగేస్తాయి. పైగా ఇవి అదీ ఇదీ అని కాదు... ఏది తిన్నా బతికేస్తాయి. అవి ఎప్పుడూ తినే ఆహారం దొరక్కపోయినా, మన ఇంటికి తీసుకొచ్చి బ్రెడ్డూ జామూ పెట్టినా కూడా సరిపెట్టేసుకుంటాయి! ►మగ నక్కలు ఆడనక్కలను చాలా ప్రేమగా చూసుకుంటాయి. ముఖ్యంగా గర్భంతో ఉన్న సమయంలో చాలా సేవలు చేస్తాయి. ఆహార వేటకు వెళ్లనివ్వవు. అవే స్వయంగా వెళ్లి తీసుకొస్తాయి. పిల్లల పెంపకంలో కూడా పాలు పంచుకుంటాయి. దగ్గరుండి పిల్లలకు వేటాడటం నేర్పుతాయి! ► తీరిక వేళల్లో ఇవి ఆటలాడుతుంటాయి. రెండు మూడు నక్కలు కలిసి పరుగులు తీస్తూ, గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి! ► నక్కలు ఒక్కోసారి చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తుంటాయి. తమకు ఆహారం దొరకని పక్షంలో... వేరొకరి ఆహారాన్ని నిర్దాక్షిణ్యంగా లాగేసుకుంటాయి. దానికోసం పెద్ద పెద్ద యుద్ధాలు కూడా చేస్తుంటాయి! ► ఇవి ఒక్కో వయసులో ఒక్కో రకంగా అరుస్తుంటాయి. అంటే వయసు పెరిగే కొద్దీ వాటి అరుపులో మార్పు వస్తుంటుంది. సందర్భాన్ని కూడా ఇవి రకరకాలుగా అరుస్తుంటాయి. ఆ అరుపును బట్టి మిగతావి అది ఏం చెబుతుందో అర్థం చేసుకుంటాయి! ► ఇవి అఖండమైన తెలివి తేటలు గలవి. ఆహారం కోసం రకరకాల ఎత్తులు వేయగలవు. అవి వేసే ఎత్తులకు తిరుగే లేదు. అందుకే నక్కజిత్తులు అని పేరు వచ్చింది. -
నీలిరంగు నక్క
పంచతంత్ర కథ పూర్వం దండకారణ్యంలో ఒక నక్క ఉండేది. ఆ నక్క అరణ్యాన్ని ఆనుకొని ఉన్న ఊరిలో రాత్రివేళ వెళ్లి దొరికిన తిండి తిని, కడుపు నింపుకునేది. ఒకరోజు అది రాత్రంతా తిరిగి ఆహారం తిని అడవికి బయలుదేరింది. ఊరి చివర చాకిరేవులో దానికి ఒక పెద్ద బాన కనిపించింది. వెళ్ళి నీళ్ళు తాగుదామని ఆ నక్క ఆ బానలోకి తొంగిచూసి పొరపాటున అందులో పడిపోయింది. ఆ బాన నిండా నీలిరంగు నీళ్ళున్నాయి. నక్క ఆ బానలో నుండి బయటికి రాలేకపోయింది. చాకలి వచ్చే సమయానికి నక్క చచ్చిపోయినట్లు నటించింది. కొంతసేపటికి చాకలి వచ్చి బానలో చచ్చిపోయిందనుకున్న నక్కను చూసి తీసి బయట పడేశాడు. కిందపడగానే గభాలున లేచి నక్క అడవిలోకి పరుగుతీసింది. కొద్దిసేపైన తర్వాత చూస్తే దాని శరీరం అంతా నీలిరంగులో మెరిసిపోతోంది. తన రంగు చూసుకుని ఎంతో మురిసిపోయిన నక్క ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంది. వెంటనే అది తన తోటి నక్కలను పిలిచి ‘‘మిత్రులారా! నాకు నిన్న రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఈ నీలిరంగును ప్రసాదించి, ఈ అడవికి రాజును చేశాడు. నాకు ఎన్నో శక్తులను కూడా ఇచ్చాడు. మీరందరూ ఇక ముందు సుఖంగా ఉండాలనుకుంటే నేను ఈ అడవికి రాజును అని గుర్తించండి’’ అని ప్రకటించింది. తమ జాతివాడు అడవికి రాజవుతున్నాడని నక్కలన్నీ ఎంతో ఆనందపడి, వెంటనే నీలిరంగు నక్కను అడవికి రాజుగా ప్రకటించి దండోరా వేశాయి. విషయం తెలుసుకున్న సింహాలు, పులులు, తోడేళ్ళు, ఏనుగులు ఇలా ఒకటేమిటి? అడవిలోని చిన్నా పెద్దా జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. నీలిరంగు నక్కను చూసి, నిజంగానే దేవుడు ఆ నక్కకు నీలిరంగు ప్రసాదించాడని, సింహంతో సహాఅన్ని జంతువులు నమ్మాయి. అన్ని జాతుల జంతువులు ఆ నీలిరంగు నక్కకు సన్మానం చేశాయి. పులులు, సింహాలు కూడా నన్ను సన్మానం చేశాయంటే నేను వాటికంటే నిజంగానే గొప్పవాడిని అని గర్వంతో విర్రవీగి పోయింది. నీలిరంగు నక్క వెంటనే ఒక మంత్రివర్గాన్ని ప్రకటించింది. సింహాన్ని మంత్రిగా, ఏనుగును న్యాయమూర్తిగా, పులిని సేనానాయకుడిగా, ఎలుకను ఆహరమంత్రిగా...ఇలా అన్ని జాతుల నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి ఇచ్చింది. నక్కజాతికి మాత్రం ఒక్క పదవినీ ఇవ్వలేదు. సమావేశం అయిపోయిన తర్వాత జంతువులన్నీ ఎవరి తావులకు వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి నక్కజాతి ఒక్కటే మిగిలింది. అందులోంచి ఒక ముసలి నక్క ముందుకు వచ్చి నీలిరంగు నక్కతో ఇలా అంది. ‘‘అయ్యా! మీరు మనకు శత్రువులైన వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు. కాని మన నక్క జాతికి ఒక్క పదవినీ ఇవ్వలేదు. మీరు నక్క జాతిని ఆదరించాలి. ఆపద సమయంలో వారే మీకు సహాయపడతారు’’ అంది. అందుకు నీలిరంగు నక్క అధికార గర్వంతో ‘‘నువ్వు వయసులో పెద్దవాడివి కావచ్చు. కాని బుద్ధిలో మాత్రం ఎంతో అల్పుడిగా కనబడుతున్నావు. శత్రుపక్షం వారికి పదవులు ఇస్తే ఇక వారినుండి మనకు ఎలాంటి ముప్పు ఉండదు. అంతేకాకుండా మన నక్కజాతిలో గొప్పవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి మీరంతా నేను రాజునైనందుకు సంతోషించండి.’’ అంది. నీలిరంగు నక్క మాటలు విన్న నక్కలన్నీ ఎంతో బాధపడి, దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాయి. కొన్నాళ్ళకు నక్కలన్నీ ఓ చోట సమావేశమయ్యాయి. ‘‘మన జాతి వాడు రాజు అయ్యాడంటే సంతోషంగానే ఉంది. కానీ ప్రతిరోజూ మనల్ని మిగతా జాతి వాళ్ళకంటే హీనంగా చూడడం బాగాలేదు. గతంలో సింహం రాజుగా ఉంటే మనం మంత్రులుగా వెలిగిపోయాం. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి దాపురించింది. దీనికంతటికీ కారణమైన ఆ నక్క రాజుకు మనం బుద్ధి చెప్పాల్సిందే’’ అని ముసలి నక్క అన్నది. దానికి మిగతా నక్కలన్నీ ‘సై’ అన్నాయి. ఓ రోజు సాయంత్రంపూట నక్కలన్నీ వెళ్ళి నీలిరంగు నక్క ఇంటిముందు చేరి పెద్దగా ఊళవేయడం ఆరంభించాయి. ఆ ఊళలకు నీలిరంగు నక్క ఎంతో ఆనందపడిపోయింది. తన జాతి స్వభావమైన ఊళవేయడం విని దాని మనసు పులకించిపోయింది. ‘‘నేను ఊళవేయడం మాని ఎంతకాలమైందో?’’ అనుకుంటూ ఇంటి బయటికి వచ్చి తాను కూడా తన జాతితో కలిసి ఊళ వేయడం ఆరంభించింది. ఇలా ఒక్కసారిగా నక్కలన్నీ ఊళవేస్తుండడం విని, మిగతా జంతుజాతులన్నీ అక్కడికి చేరుకున్నాయి. అక్కడే ఉండి చూస్తున్న సింహం ఆశ్చర్యపడి ‘‘అదేంటి? మిగతా నక్కల మాదిరిగా ఈ నీలిరంగు నక్క ఊళవేస్తుంది? దీనికి దైవశక్తులు ఉన్నాయని చెప్పింది కదా? మరి మామూలు నక్కలా ఊళవేయడమేమిటి? అని అనుమానించింది. ఇంతలో జోరుగా వర్షం కురవడం ఆరంభమైంది. వర్షపు నీళ్ళ వల్ల నీలిరంగు నక్క శరీరం మీద ఉన్న నీలిరంగు అంతా కొట్టుకుపోయి, అది మిగతా నక్కల మాదిరిగా మారిపోయింది. వెంటనే నక్కజాతి అంతా విషయాన్ని గ్రహించాయి. ‘‘అరె! ఇది కూడా మన మాదిరి నక్కనే! ఎక్కడో నీలిరంగు వేసుకొని తనకు దేవుడు వరమిచ్చాడని చెప్పి మనల్ని మోసం చేసింది.’’ అని అనుకున్నాయి. అక్కడే ఉన్న మంత్రి సింహం ‘‘అరె! జిత్తులమారి నక్కా! ఇన్నాళ్ళుగా నీవు నీలిరంగు వేసుకొని మమ్మల్నందర్నీ మోసం చేస్తావా? నీకు దేవుడు శక్తులు ఇచ్చాడా? మరి నీ నీలిరంగు ఏమైంది?’’ అని హుంకరించింది. నీలిరంగు నక్క ఒక్కసారి తన శరీరాన్ని చూసుకొని నీలిరంగు లేకపోవడంతో గతుక్కుమంది. ‘‘ఓసి జిత్తులమారి నక్కా! ఇంతమోసం చేస్తావా? అడవికి రాజునైన నన్నే బోల్తా కొట్టించి నన్ను మంత్రిగా చేసి నీవు నా చేత సేవలు చేయించుకుంటావా? ఎంత మోసకారి నక్కవు నీవు... నీ పని పట్టాల్సిందే’’ అంటూ సింహం ఒక్క ఉదుటున నక్క మీద పడి దాని గొంతు పట్టి చంపేసింది. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు విడిచింది. నక్కలన్నీ ఆ సంఘటనను చూసి ‘‘తగిన శాస్తి జరిగింది సొంత జాతిని కాదని శత్రు జాతిని చేరదీస్తే ఇలాగే ఉంటుంది.’’ అని అనుకున్నాయి. చూశారు కదా! ఎవరైనా సరే తన జాతివారిని, తన బంధువర్గాన్ని చేరదీయాలి. తన వాళ్ళను కాదని శత్రువులను చేరదీస్తే ఏనాటికైనా ముప్పు తప్పదు! -
నక్క ఆ ఊరికి సాధుజంతువు!
అసాధారణం: ఆ గ్రామంలో ఇపుడున్న వృద్ధులు ‘‘మా చిన్నప్పటి నుంచే నక్కలు ఇక్కడ భోజనం చేయడం చూస్తున్నాం’’ అని చెబుతున్నారంటే ఈ కథను నమ్మకతప్పదు. మనిషి జీవితంలో అసలు చూడకుండా మొదట పరిచయం చేసుకునే జంతువు ఏదైనా ఉందంటే అది నక్క. దాని గురించి తెలుసుకోకుండా ఏ పిల్లాడు పెరిగి పెద్ద కాడు. అది మోసాలకు, అతి తెలివికి చిహ్నంగా చెప్పుకునే జంతువు. అందుకే మనిషి ఎన్నో జంతువులను పెంచుకున్నాడు... చివరకు పులుల్ని కూడా పెంచుకున్న చరిత్రలు, పురాణాలు విన్నాం. కానీ మీరిప్పుడు మొట్టమొదటి సారి నక్కను నమ్మిన వారి గురించి తెలుసుకుంటారు. కుక్కకు నక్కకు పెద్దగా వేరుచేసి చూడతగినన్ని తేడాలుండవు. అంతేకాదు, అవి రెండూ ఒకేజాతికి చెందినవి. అయితే, లక్షణాల్లో మాత్రం వాటి రెంటికీ చాలా తేడా ఉంది. ఒకటి విశ్వాసానికి, ఇంకోటి అవిశ్వాసానికి ప్రతిరూపాలు. అందుకే ఎవరూ నక్కను పెంచుకునే సాహసం చేయలేదు. కానీ ఆ నక్కలను కూడా ఇతర జంతువుల్లా చూసే సంప్రదాయం దేశం మొత్తం మీద గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్‌లో ఉంది. అత్యంత వైవిధ్యమైన ఈ నేలలో ఇది అంతకంటే వైవిధ్యమైన విషయం. గుజరాత్‌లోని భుజ్ జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణిస్తే కళా దుంగర్ వస్తుంది. ఈ కళాదుంగర్ సముద్ర మట్టం నుంచి పదిహేడు వందల అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతం. ఇక్కడ ఒక ఆశ్రమం, గుడి ఉన్నాయి. గుట్టలకు దిగువన ఊరు ఉంటుంది. ప్రతిరోజు రెండు పూటలా గుడిలో పూజలు మాత్రమే కాదు, రెండు పూటలా అన్నదానం ఉంటుంది. అయితే అది మనుషులకు కాదు, ప్రత్యేకంగా నక్కలకు. మీరిక్కడో విషయం గమనించాలి. నక్క మాంసాహారి. కానీ ఈ గుడిలో వాటికి పెట్టేది శాకాహారం. అయినా కూడా అవి భుజిస్తున్నాయి. ఆ గుడి గుట్టల కింద ఉన్న గ్రామస్తులు సనాతనంగా ఆచరిస్తూ వస్తున్న సంప్రదాయం ఇది. దీని వెనుక ఓ కథ ఉంది. సుమారు నాలుగువందల సంవత్సరాల క్రితం ఆ గుడి పక్కన ఉన్న దత్తాత్రేయ స్వామి అనే ఓ మహాపురుషుడి ఆశ్రమం ఉండేది. ఓ రోజు ఆయన ధ్యానంలో ఉండగా... కొన్ని నక్కలు ఆయన ముందు నిశ్శబ్దంగా వచ్చి కూర్చున్నాయి. కళ్లు తెరిచిన ఆయన వాటిని చూడగానే అవి ఆకలితో ఉన్నాయన్న విషయం గ్రహించి వెంటనే వాటికి ఆశ్రమంలోని ఆహారం పెట్టించాడు. తిన్నవెంటనే అవి తిరిగివెళ్లిపోయాయి. మరుసటి రోజు ఆశ్చర్యకరంగా ఎవరో పిలిచినట్టు అదే సమయానికి అవి అక్కడికి వచ్చాయి. విషయం అర్థం చేసుకున్న ఆశ్రమ పీఠాధిపతి దత్తాత్రేయుడు వాటికి ప్రతిరోజు భోజనం పెట్టండి అంటూ ఆశ్రమంలో శిష్యులను ఆదేశించారట. ఒకరోజు ఆశ్రమంలో అన్నం లేకపోవడంతో అవి వెనక్కు వెళ్లలేదు. దీంతో వాటి ఆకలిని చూసి ఆయన తన దేహంలోని కొంత మాంసాన్ని తీసి వాటికి వేస్తూ ‘లీ ఆంగ్’ (ఇదిగో తిను) అని చెబితే వాటితో అవి సర్దుకుని వెళ్లిపోయాయి. ఇక ఆరోజు నుంచి ఆశ్రమంలో ప్రతిరోజు అన్నం ఉండేలా చూసుకుని వాటి ఆకలిని తీరుస్తూ వచ్చారట. ఆ గ్రామంలో ఇపుడున్న వృద్ధులు ‘‘మా చిన్నప్పటి నుంచే నక్కలు ఇక్కడ భోజనం చేయడం చూస్తున్నాం’’ అని చెబుతున్నారంటే ఈ కథను నమ్మకతప్పదు. ప్రతిరోజూ పూటకు ఎనిమిది కిలోల బియ్యం, నాలుగు కిలోల బెల్లం కలిపి వాటికి వండిపెడతారు. ఈ పనిచేయడానికి అక్కడ ప్రత్యేకంగా ఒక మనిషి ఉంటాడు. ఆ బియ్యం ఊరి ప్రజలే ఇస్తారు. అన్నం అయిన వెంటనే లీ ఆంగ్, లీ ఆంగ్ అని పిలుస్తూ గంట కొడతారు. ఆ శబ్దం వినగానే నక్కలన్నీ తిండికోసం వస్తాయి. అవి తిని వెళ్లిపోగానే మిగతా పక్షులు, చిన్న చిన్న జంతువులు వచ్చి మిగిలిన ఆహారాన్ని తినేస్తాయి. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి... ఇవాన్ పావ్లోవ్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త 1850-1940ల మధ్య జీవించారు. జంతువులకు ప్రేరణ ఉంటుందని, ఆ ప్రేరణకు కొన్ని కారకాలు ఉంటాయని ఆయన నిరూపించాడు. దీనికోసం ఆయన ఓ ప్రయోగం చేశాడు. ప్రతిరోజు గంట శబ్దం చేసి కుక్కకు అన్నం పెట్టేవాడు. కొంతకాలానికి గంట శబ్దం చేయగానే ఆహారం పెట్టకపోయినా ఆహారం ఉందనుకని వాటికి నోట్లో లాలాజలం పుట్టేది. ఇది ప్రపంచ వ్యాపంగా చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రేరణ సిద్ధాంతం. కానీ, అంతకంటే ముందే (స్థానిక కథ ప్రకారం నాలుగువందల ఏళ్లుగా) ఇక్కడ ఇదే ప్రయోగం జరుగుతోంది. ఓ శబ్దం చేయడం, ఆ శబ్దాన్ని విని నక్కలు తిండికోసం రావడం జరుగుతోంది. అంటే ఇవాన్పావ్లోవ్ సిద్ధాంతాన్ని వీళ్లెప్పట్నుంచో చాలా సాధారణంగా పాటించేస్తున్నారు! -
మరో ప్రపంచంలోకి ప్రయాణిద్దాం...
పాఠశాలలకు సెలవు రోజులు. తిరిగి బడులు తెరిచే సమయానికి ఎన్నో అద్భుతమైన ప్రాంతాలను సంద ర్శించాలనుకునేవారికి వన్యప్రాణి కేంద్రాలు సరైన ఎంపిక. మన దేశంలో అభయారణ్యాలుగా పేరుపొందిన ప్రాంతాలు మన దేశంలో ప్రతి రాష్ర్టంలోనూ ఉన్నాయి. వాటిలో కొన్ని అభయారణ్యాల గురించి తెలుసుకుందాం. దగ్గరలో ఉన్న వన్యప్రాణి కేంద్రాలనైనా దర్శించాలనే ఆలోచనలకు ఈ వేసవి సెలవుల్లో ఓ రూపమిద్దాం... అప్పటిదాకా పుస్తకాల్లో పులి, సింహం, ఏనుగు, జింక, నక్క.... ఇలా ఎన్నో బొమ్మలను చూసిన పిల్లలు కళ్లెదురుగా ఆ జంతువులు కదలాడుతుంటే ఆనందంతో కేరింతలు కొడతారు. జంతువుల జీవనశైలిని తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతారు. ఈ వేసవిని మరింత వేడుకగా జరుపుకున్నామని సంబరపడతారు. గిర్ సింహాలకు ఇల్లు... ఆఫ్రికా మినహా సింహాలు నివాసం ఉండే చోటు ప్రపంచమంతా వెతికినా కనపడదు అనుకునేవారికి సరైన సమాధానం చూపుతుంది ‘గిర్ జాతీయ అభయారణ్యం.’ మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఈ సింహాల వనం. గిర్ నేషనల్ పార్క్ ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ఆసియాజాతి సింహాలకు ఇల్లు లాంటిది. సింహాలకు అత్యంత సురక్షితమైన ఈ వనం 1412 చ.కి.మీలలో ఉండగా, మరో 1153 చ.కి.మీ శాంక్చ్యురీకి కేటాయించారు. 1913లో 20 సింహాలున్న ఈ ప్రాంతంలో 2010 నాటికి వీటి సంఖ్య 411కు చేరింది. జింకల ఉత్పత్తిలో అతిపెద్ద స్థావరంగా పిలిచే ఈ ప్రాంతంలో 32 వేల జింకలు ఉన్నాయి. చిరుతలు 300కు పైగా, 40కి పైగా సరీసృపాలు, 250కి పైగా పక్షి జాతులు, 2 వేలకు పైగా ఇతర జంతుజాలాలు గిర్‌లో సందడిచేస్తుంటాయి. పర్యాటకులు.. నక్షత్ర తాబేళ్లను, కొండచిలువలు, నక్కలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలను, గద్దలు, .. మొదలైనవాటినెన్నింటినో తమ కెమెరాలలో బంధించుకోవచ్చు. ఇలా వెళ్లాలి రోడ్డుమార్గాన: జునాగఢ్ పట్టణం నుంచి 55 కి.మీ, అహ్మదాబాద్ నుంచి 348 కి.మీ, రాజ్‌కోట్ నుంచి 156 కి.మీ. రైల్వేస్టేషన్: అహ్మదాబాద్/ రాజ్‌కోట్/ జునాగఢ్ విమానాశ్రయం: రాజ్‌కోట్ / అహ్మదాబాద్ ఇవి చూడవచ్చు గిర్ నేషనల్ పార్క్ చూసిన తర్వాత జునాగఢ్ ప్రాంత చరిత్రను తెలుసుకోవచ్చు. ఇక్కడి రాజకోటను, నాటి దేవాలయాలను, మ్యూజియాన్ని సందర్శించవచ్చు. పెరియార్ నేషనల్ పార్క్ పడమటి కనుమల్లో కేరళ- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో సుమారు 350 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించి ఉంది పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం. కేరళలోని దర్శనీయ ప్రదేశాలలో అత్యంత ముఖ్యమైన ఈ ప్రాంతం ఇడుక్కి జిల్లాలో ఉంది. దశాబ్దాల తరబడి పర్యాటకులను అలరిస్తోన్న ఈ జాతీయవనాన్ని 1978లో కేరళ ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. పెరియార్ నదిపై 1895లో జలాశయం నిర్మించడంతో ఏర్పడిన సరస్సుల నీటి అందాలతోనూ, పరుచుకున్న పచ్చదనంతోనూ ఈ ప్రాంత పర్యటన మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తోంది. పెరియార్ శాంక్చ్యురీలో గల సరస్సులో పడవ మీద ప్రయాణిస్తూ, ఇరువైపులా ఉండే అడవిలో సంచరించే జంతువులను, వాటి ప్రవర్తనను అతి దగ్గరగా, సురక్షితంగా చూసే అవకాశం పర్యాటకులకు కలుగుతుంది. అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం పెరియార్ శాంక్చురీలో సుమారు 600 ఏనుగులు, 450 జింకలు, 550 ఎలుగుబంట్లు, 180 నీలగిరి కోతులు, 45 పులులు, 15 చిరుతపులులు, పెద్ద సంఖ్యలో నక్కలు, ఎగిరే ఉడతలు, రంగు రంగుల పక్షులు.. పర్యాటకులను అలరిస్తున్నాయి. కొచ్చి పట్టణానికి 185 కి.మీ, కొట్టాయం రైల్వే స్టేషన్‌కు 114 కి.మీ దూరంలో ‘తేక్కడి’ అనే ప్రాంతం వన్యప్రాణుల నిలయంగా వాసికెక్కింది. పెరియార్ నదిలో బోటు షికారు చేసేవారు అడవిలో సంచరించే పులులు, ఏనుగులు, జింకలను చూడవచ్చు. సరస్సులో నీటిపై వాలి ఉండే చెట్టు కొమ్మలు.. వాటిపై వాలే వివిధ రకాల పక్షలు మనకు ఆనందానుభూతులను కలిగిస్తాయి. ఇక్కడి కోతుల అల్లరి చేష్టలు పర్యాటకులకు వినోదాన్ని కలిగిస్తుంటాయి. ఇక్కడ బస చేయాలనుకునే పర్యాటకుల కోసం సౌకర్యవంతమైన కాటేజీలు, రిసార్టులు ఉన్నాయి. తేక్కడిలోని రిసార్టుల్లో కేరళ ఆయుర్వేద కేంద్రాలకు సందర్శకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆయుర్వేద తైలాలతో శరీరానికి మర్దన చేయించుకునేందుకు నిత్యం వందల మంది వస్తుంటారు. ఇక్కడి రిసార్టుల్లో కేరళ వంటకాలు నోరూరిస్తుంటాయి. ఆహ్లాదం, ఆనందం పొందాలనుకునేవారు పెరియార్ నేషనల్ పార్క్ ఒక్కసారైనా సందర్శించాలి. పెరియార్ పార్క్‌కి.. ఇలా వెళ్లాలి విమానాశ్రయం: తమిళనాడులోని మదురై. కేరళలోని కొచ్చి. రైల్వేస్టేషన్: కొట్టాయం. కొట్టాయం నుంచి తేక్కడికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సదుపాయాలు ఉన్నాయి. సందర్శన సమయం: ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 7 గం.ల వరకు. ఇవి చూడచ్చు... చేస్తూ పచ్చదనాన్ని తిలకించవచ్చు. బోట్లో షికారు ట్రీ హౌజ్‌లు రణథంభౌర్ పులుల స్థావరం... ఉత్తరభారత దేశంలో అతిపెద్దది రణథంభౌర్ జాతీయ పార్క్. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉంది ఈ ప్రాంతం. జైపూర్ నుంచి 130 కి.మీ దూరంలో ఉన్న ఈ వన్యప్రాణి అభయారణ్యం పర్యాటకులకు అతిపెద్ద ఆకర్షణీయ ప్రాంతం. ఎంతో మంది వన్యప్రాణి ఫొటోగ్రాఫర్లకు, ప్రేమికులకు ఈ వనం మరపురాని అనుభూతినిచ్చే ప్రాంతం. రణథంభౌర్ జాతీయ వనం సుమారు 392 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీంట్లో మాన్సింగ్ శాంక్చ్యురీ, కైలాదేవి శాంక్చురీ ప్రసిద్ధమైనవి. ఇక్కడ పులులను చాలా దగ్గరగా, సురక్షితంగా చూసే అవకాశం ఉంది. పచ్చటి ప్రకృతిని, వన్యప్రాణులను కనులారా వీక్షిస్తూ, పక్షుల కిలకిలారావాలను వింటూ ఆనంద విహారం చేయవచ్చు. పులులు, చిరుతలు, హైనాలు, జింకలు, అడవి పిల్లులు, నక్కలు, ఎలుగుబంట్లు, మొసళ్లు.. ఇలా ఎన్నో జంతువులును ఇక్కడ చూడవచ్చు. కృష్ణ జింకలు, హనుమాన్ లాంగూర్లు నీటిని తాగడానికి తరచూ సరస్సు వద్దకు వచ్చి, విశ్రాంతి తీసుకుంటుంటాయి. విరబూసిన పువ్వుల అందాలను తిలకించవచ్చు. సఫారీ టైమ్: ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 9.30ని.ల వరకు. ఇలా వెళ్లచ్చు... దగ్గరలోని రైల్వేస్టేషన్: సవాయి మాధోపూర్ దగ్గరలోని విమానాశ్రయం: జైపూర్ ఇతర చూడదగినవి: రణథంభౌర్ కోట, జోగీ మహల్‌తో పాటు ఇక్కడ ఉన్న మూడు సరస్సులు.. ప్రధానంగా చూడదగినవి. కజిరంగా....ఖడ్గమృగాలను చూడాల్సిందే! అతి పెద్ద శక్తిమంతమైన జంతువులలో ఏనుగులు, ఖడ్గమృగాలకు కజిరంగా జాతీయ అభయారణ్యం పేరెన్నిక గన్నది. ఇప్పటి వరకు అనేకలక్షల మంది పర్యాటకులు సందర్శించిన రికార్డు ఈ అభయారణ్యానికి ఉంది. బ్రహ్మపుత్రా న ది ఒడ్డున, అస్సామ్ రాష్ట్రంలో నగావూ జిల్లాలో 430 చ.కి.మీ లలో విస్తరించి ఉంది ఈ జాతీయ వనం. బలిష్ఠమైన ఏనుగులు, ఖడ్గమృగాలు పచ్చని పచ్చిక మైదానాలలో తిరుగుతుంటాయి. ఏనుగులు, అడవిదున్నలు, లేళ్లు ఈ వనంలో ఎక్కువ. పక్షుల ఆవాసకేంద్రంగా కూడా కజిరంగా అంతర్జాతీయంగా పేరుగాంచింది. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంలో ఏర్పడిన చిన్న కొలనులు ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. 1904లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ సతీమణి మేరీ కర్జన్ ఈ ప్రాంతాన్ని సందర్శించారట. ఆ తర్వాత ఏడాది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో కజిరంగా అనే పేరును అధికారులు సూచించారట. వృక్షజాతులు: ఈ అభయారణ్యంలో మూడు రకాల అతిపెద్ద గడ్డి మైదానాలు ఉన్నాయి. వీటిలో బలిష్ఠమైన ఏనుగులు ఉన్నాయి. బ్రహ్మపుత్రా నదికి ఏర్పడిన వరదల వల్ల ఏర్పడిన సారవంతమైన భూములు ఇవి. ఈ వనం కమలాలకు ప్రసిద్ధి. నీటిలో పాకే మొక్కలు, అతి పొడవైన వృక్షాలతో ఈ ప్రాంతం కళకళలాడుతుంది. కర్బి గ్రామాలలో: అస్సాం పేరు వినగానే మనకు తేయాకు కళ్లముందు కనిపిస్తుంది. ఇక్కడ తేయాకు, కాఫీ, రబ్బర్ మొక్కల పెంపకం విస్తారంగా జరుగుతుంది. తోటల పెంపకం విశేషాలు దారంతా తెలుసుకుంటూ ముందుకు కదలవచ్చు. ఇలా వెళ్లాలి... విమానాశ్రయం: గౌహతి రైల్వేస్టేషన్: ఫర్కేటింగ్ బస్సు సదుపాయాలు ఉన్నాయి. సఫారీలో ఇలా... వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సందర్శించేవారు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. వన్యప్రాణి సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో ముందుగా మాట్లాడి, వన్యప్రాణుల పట్ల ఎలా మెలగాలో... వారి సూచనలు తీసుకోవచ్చు. పార్క్ నిబంధనలను తప్పక పాటించాలి. నిషేధం ఉన్న ప్రాంతాలలోకి వెళ్లకూడదు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు వేగం పోరాదు. శబ్దాలు, జంతువులను కవ్వించే పనులు చేయకూడదు. ఎవరైనా వన్యప్రాణులకు హానితలపెట్టే చర్యలు జరిపినప్పుడు వెంటనే పార్క్ అధికారులకు తెలియజేయాలి. వన్యప్రాణులకు - మీకు మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోవాలి. పార్క్ లేదా అభయారణ్యం నుంచి ఎలాంటి వస్తువులనూ, బయటకు తీసుకురాకూడదు. ఆహారపదార్థాలు జంతువులకు వేయడం, తెచ్చిన పదార్థాల చెత్త అక్కడ వదిలి వేయడం తగదు. ఏదైనా అభయారణ్యానికి వెళ్లే ముందు వెంట కెమెరా, సన్‌స్క్రీన్ లోషన్, టోపీ... తీసుకెళితే మీ ప్రయాణం ఆహ్లాదంగా, సౌకర్యంగా సాగుతుంది. మీ యాత్రానుభవాలను పంపవలసిన చిరునామా: విహారి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34. e-mail:sakshivihari@gmail.com -
ఆ సర్వేల్లో సగం అబద్ధాలే!
దంపతుల శృంగార రహస్యాలను ఛేదిస్తున్నామన్నట్టుగా వెలుగులోకి వచ్చే సర్వేల్లో పూర్తి నిజాలు వ్యక్తం కావడం లేదని ఒక సర్వే పేర్కొంది. నిత్యం వెలుగు చూసే సెక్స్ సర్వే ఫలితాల్లో సగం అబద్ధాలే ఉంటున్నాయని ఎక్కువమంది విశ్వసిస్తున్నారని ఆ సర్వే వివరించింది. ప్రస్తుతం వార్తల్లోకి వచ్చే సర్వేల గురించి జనుల అభిప్రాయాలను కోరింది ‘ఫాక్స్’ న్యూస్‌కు సంబంధించిన ఒక అధ్యయన బృందం. వీరి సర్వే ప్రకారం సెక్స్ సర్వేలు చెప్పే విషయాలకు సామాన్యులు అంత విలువనివ్వడం లేదని తేలింది. తమ నిజ జీవిత అనుభవాలతో పోల్చుకొని... సర్వేలో వస్తున్న వాటిలో చాలావరకూ అబద్ధాలే ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారట. అయితే రీడబులిటీ ఉండేందుకే వార్తాసంస్థలు సెక్స్ సర్వేలను ప్రచురిస్తున్నాయని వారు అంటున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. ఫస్ట్క్రాష్తో ఫుల్ ఫియర్... తమ జీవితంతో ఒక అమ్మాయిని తొలిసారిగా మీట్ అయినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యామని మగాళ్లు అంటున్నారు. వీరిలో 40 శాతం మంది ఫీలింగ్స్‌తో పాటు ఫియర్కూడా తప్పలేదని వ్యాఖ్యానించారు. అమ్మాయితో మాట్లాడటం తమకు మొహమాటంతో కూడిన ప్రక్రియ అని ఏకంగా 50 శాతం పురుషులు వ్యాఖ్యానించడం విశేషం. యూనివర్సిటీ ఆఫ్ షికాగో వారి పరిశోధనలో ఈ విషయం తేలింది. స్కూల్స్, కాలేజెస్, కాఫీ షాప్‌లు, మాల్స్.. ఇవే తొలి చూపు ఆకర్షణకు చక్కటి ప్లేస్‌లు అని జనాలు అభిప్రాయపడుతున్నారు.. రెస్టారెంట్లు, మూవీ థియేటర్లు మాత్రం ఈ జాబితాలో బాగా దిగువన ఉన్నాయి.