బుజ్జి కుక్క పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. మీలాగే చైనాలో కూడా వాంగ్ అనే ఒక అమ్మాయి చాలా ఇష్టపడి గతేడాది ఓ దుకాణం నుంచి చిన్న కుక్క పిల్లను కొనుక్కుంది. దాన్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంది. అయితే షాంగ్జీ ప్రావిన్స్ జిన్‌జాంగ్‌లో కొన్న ఈ కుక్కపిల్ల కొద్ది నెలలు బాగానే ఉంది. ఆ తర్వాతే కుక్కలు తినే ఆహారాన్ని తినడం మానేసిందట. తోక కూడా కుక్కలకు పెరిగినట్లు కాకుండా చాలా పొడవుగా పెరగుతోందట.
అయితే వాంగ్ దీన్ని అంతగా పట్టించుకోలేదట. అయినా కూడా చికెన్, పళ్లు వంటి ఆహారాన్ని పెడుతూనే ఉందట. అయితే ఇక అప్పటి నుంచి ఆమెకు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయట. వెంట్రుకలు చాలా మందంగా, గుబురుగా పెరుగుతున్నాయట. ముక్కు పొడవుగా సాగుతోందట.
తోక సాధారణ కుక్కల కన్నా చాలా పొడవుగా పెరిగిందట. మామూలు కుక్కల మాదిరిగా అరవడం లేదట. పార్కులకు తీసుకెళ్లినప్పుడు తోటివారంతా ఇది కుక్క కాదు.. నక్క అని చెప్పడంతో కంగారుపడ్డ వాంగ్ కుక్కల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిందట. అప్పుడు అసలు విషయం చెప్పారు డాక్టర్లు. దీంతో ఈ నక్కను జంతుశాలకు అప్పగించిందట.
Comments
Please login to add a commentAdd a comment