ఫాక్స్ కార్పొరేషన్ ఉచిత యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ట్యూబీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారతీయ-అమెరికన్ అంజలీ సూద్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఈవోగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
విమియో కంపెనీ సీఈవోగా ఉన్న అంజలీ సూద్, తొమ్మిదేళ్లు అక్కడ పనిచేశాక ఇటీవలే పదవి నుంచి వైదొలిగారు. ట్యూబీ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫర్హాద్ మస్సౌదీ అనంతరం ఆమె ఆ కంపెనీగా సీఈవోగా నియమితులయ్యారు. విమియో కంటే ముందు ఆమె టైమ్ వార్నర్, అమెజాన్ కంపెనీల ఫైనాన్స్, మీడియా, ఈ-కామర్స్ విభాగాల్లో పనిచేశారు.
సీఈవోగా అంజలి సూద్ నాయకత్వంలో విమియో ప్రపంచవ్యాప్తంగా వీడియో క్రియేటర్లు, ఇతర ప్రొఫెషనల్స్‌కు కేంద్రంగా మారింది. 300 మిలియన్లకు పైగా యూజర్లను సంపాదించుకోవడంతోపాటు గణనీయమైన ఆదాయాన్నీ ఆర్జించింది.
అమెరికాలో ఇటీవల అత్యధికంగా వీక్షించిన ఫ్రీ యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్‌గా ట్యూబీ నిలిచింది. నీల్సన్ ప్రకారం.. ట్యూబీకి 64 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఈవోగా అంజలీ సూద్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యూబీని ఫాక్స్ కార్పొరేషన్ 2020లో 440 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తం టీవీ వీక్షణ నిమిషాల్లో ప్లూటోటీవీ, పీకాక్, హెచ్‌బీవో మ్యాక్స్‌లను కూడా ట్యూబీ అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment