ఎవరా నక్క? ఏమా కథ? | What is story and who are fox ? | Sakshi
Sakshi News home page

ఎవరా నక్క? ఏమా కథ?

Published Sat, Sep 12 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

ఎవరా నక్క? ఏమా కథ?

ఎవరా నక్క? ఏమా కథ?

 ‘‘మానవ జన్మలో వుండగా నక్క జీవితంపై నాకు అపోహలుండేవి. అవన్నీ అపోహలే. నక్కకి నక్క జీవితంలో దొరికే సౌఖ్యం నక్కగా నాకు దొరుకుతోంది. నన్నిలా బతకనీ’’ అంటూ డ్రైనేజీ బొరియలోకి వెళ్లిపోయాడు గురువు. ఇంతకీ కథ అంతరార్థం తెలియలేదండీ అంటే పెద్దాయన ‘‘నాకూ అంతే’’ అంటూ నవ్వాడు. నదుల అనుసంధానం జరిగి పోయింది. మనదిక కరువు రహిత రాష్ట్రం- అని రాష్ట్ర మం త్రులు మోకాల్లోతు నీళ్లలో నిల బడి డిక్లేర్ చేశారు. గోదావరీ మాతకు పూర్ణకుంభంతో స్వా గతం పలికారు. ప్రకృతిలో దొ రికే పసుపుపచ్చ పూలను బకె ట్ల కొద్దీ గోదావరి జలాలకు సంతోషంగా సమర్పించారు.
 
 రాష్ట్ర ప్రజకు ఏమి జరు గుతోందో అర్థం కావడం లేదు. ‘‘అయితే మాకు నీళ్లొదుల్తారా’’ అంటున్నారు కృష్ణా డెల్టా రైతులు. ఏమిటి మళ్లీ యిటువైపు మళ్లారని అడిగితే- ఔనండీ, ఎప్పుడూ కేపిటల్ కబుర్లే వినిపిస్తుంటే బోరుకొడు తోంది. అందుకని పది పన్నెండు టాపిక్స్ తీసుకుని వాటి మీద దృశ్యాలు తయారు చేస్తున్నాం అంటూ వివ రించాడు ప్రభుత్వంతో ప్రమేయం వున్న ఛోటా నాయ కుడు. దానికో సిలబస్ తయారు చేసుకున్నాం. ఆ ప్రకా రం ముందుకు వెళ్తున్నామని చెప్పాడు. పది రోజులు గమనించాక ఆయన చెప్పింది నమ్మాలనిపించింది.
 
 తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువై నాయి. వేర్వేరు కారణాల వల్ల ధైర్యం కోల్పోయి ఆత్మహ త్యలకు పాల్పడుతున్నారని అధికార వర్గాలు నివేదికలు సమర్పిస్తున్నాయి. కారణం ఏదైనా జరుగుతున్నది చాలా దారుణం. ముందుగా వాటి నివారణకు అందరూ నడుం కట్టాలి. చదువుకున్న యువత గ్రామాలకు వెళ్లి నాలుగు మంచి మాటలు వారికి చెప్పాలి. అంతకు మిం చిన దేశ సేవ మరొకటి ఉండదు. విజువల్ మీడియాకి నేడు బాగా వ్యాప్తి వుంది. దృశ్య మాధ్యమాలలో మాన సిక వైద్యం అందించాలి. దురదృష్టవశాత్తు మన రాజ కీయవేత్తలు, అధికారగణం సామాన్య ప్రజలో విశ్వా సాన్ని కోల్పోయారు. అధికారుల చేతిలో అధికారం లేక పోవడం, నేతలకు చిత్తశుద్ధి లేకపోవడం ఇందుకు కారణం.
 
  ‘‘దేశ సేవని ప్రవృత్తిగా కాక వృత్తిగా స్వీకరించడం మొదలయ్యాక దేశానికి అరిష్టం చుట్టుకుందండీ’’ అం టూ ఓ కథ చెప్పాడు పెద్దాయన - వెనకటికి ఒక గురుశిష్యులున్నారు. గురువు ఒక రోజు శిష్యుణ్ణి చేరపిలిచి ‘‘ఇప్పుడే మనో నేత్రంతో చూశా. వచ్చే జన్మలో నేనొక నక్కగా జన్మించబోతున్నా. కారణాలు అడగద్దు. పూర్వజన్మ అవశేష ఫలితం’’ అని చెప్పాడు. నువ్వొక సాయం చేయాలి శిష్యా. నేను నక్క గా పుట్టగానే నన్ను నిర్దాక్షిణ్యంగా చంపెయ్. ఎందు కంటే ఇంత బతుకూ బతికి నక్కజిత్తులతో జీవించుట దుర్లభమని వాపోయాడు. శిష్యుడు అంతా విని అయితే నక్క రూపంలో వున్న మిమ్మల్ని గుర్తించడం ఎలా గురూ అని అడిగాడు. ‘‘ఏం లేదు శిష్యా. ఇప్పుడు నా మూతి మీదున్న పెద్ద పుట్టుమచ్చ అప్పుడు కూడా ఉంటుంది.
 
 అదే నా కొండ గుర్తు’’ అన్నాడు. శిష్యుడికి కర్తవ్యం బోధ పడింది. కొన్నాళ్లకు గురువు కాలం చేశాడు. నమ్మక పాత్రమైన శిష్యుడు నక్క గురువు కోసం కొండల్లో కోనల్లో అడవుల్లో అన్వేషించడం మొదలుపెట్టాడు. ఒక శుభోదయాన నగరంలోనే గురువు తారసపడ్డాడు. చూడగానే శిష్యుడికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది.

నక్కను తరిమి తరిమి చంపడానికి సిద్ధపడ్డాడు. నక్క ‘శిష్యా చం పకు, చంపకు’ అని అరిచింది. శిష్యుడు ప్రశ్నార్థకంగా చూశాడు. ‘‘మానవ జన్మలో వుండగా నక్క జీవితంపై నాకు అపోహలుండేవి. అవన్నీ అపోహలే. నక్కకి నక్క జీవితంలో దొరికే సౌఖ్యం నక్కగా నాకు దొరుకుతోంది. నన్నిలా బతకనీ’’ అంటూ డ్రైనేజీ బొరియలోకి వెళ్లిపో యాడు గురువు. ఇంతకీ కథ అంతరార్థం తెలియలేదండీ అంటే పెద్దాయన ‘‘నాకూ అంతే’’ అంటూ నవ్వాడు.
 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
 - శ్రీరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement