చాలామంది కోపంలో ఎదుటి వ్యక్తిని గాడిదతో పోలుస్తూ నిందిస్తుంటారు. అయితే తాజాగా వైరల్‌గా మారిన ఒక వీడియోలో గాడిద తన తెలివి తేటలను అద్భుతంగా ప్రదర్శించింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన వారంతా ఆ గాడిదను మెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ఇన్నాళ్లూ గాడిద పేరుతో అప్పుడప్పుడూ ఇతరులను నిందిస్తూ వచ్చామని, తెలియక పొరపాటు చేశామని లెంపలేసుకుంటున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తమ కళ్లనే తాము నమ్మలేకపోతున్నామని అంటున్నారు. మరికొందరు ఈ గాడిద.. కథల్లో చెప్పినట్లు నక్క కన్నా తెలివైనదని అంటున్నారు. ఈ గాడిద కష్టించేందుకు బదులు తన తెలివిని ఉపయోగించి, తాను చేయాల్సిన పనిని మరింత సులభతరం చేసుకుంది.
Work smarter.. 😅 pic.twitter.com/fFanLbhCO1
— Buitengebieden (@buitengebieden) December 10, 2023
ఈ వీడియోకు ఇప్పటివరకూ 80 లక్షలకు పైగా వీక్షణలు దక్కాయి. వేలమంది ఈ వీడియోను లైక్ చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏమున్నదనే విషయానికొస్తే.. కొన్ని గాడిదలు వాటికి ఎదురుగా అడ్డుగా ఉన్న కర్రను దాటి వెళుతున్నాయి. అయితే వాటిలో ఒక గాడిదకు అలా కర్రను దాటి అవతలి వైపునకు వెళ్లాలని అనిపించలేదు. కొసేపు ఆలోచించాక దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే అది అడ్డుగా ఉన్న కర్రను తన నోటితో సులువుగా తొలగించి, యమ దర్జాగా, హాయిగా మందుకు కదిలింది. ఈ వీడియోను చూసినవారంతా గాడిద తెలివితేటలకు తెగ ఆశ్చర్యపోతున్నారు.
ఇది కూడా చదవండి: రైలులో యువతిపై అకృత్యం.. బాత్రూమ్‌లో నిందితుని పట్టివేత!
మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి:
Comments
Please login to add a commentAdd a comment