దంపతుల శృంగార రహస్యాలను ఛేదిస్తున్నామన్నట్టుగా వెలుగులోకి వచ్చే సర్వేల్లో పూర్తి నిజాలు వ్యక్తం కావడం లేదని ఒక సర్వే పేర్కొంది.
దంపతుల శృంగార రహస్యాలను ఛేదిస్తున్నామన్నట్టుగా వెలుగులోకి వచ్చే సర్వేల్లో పూర్తి నిజాలు వ్యక్తం కావడం లేదని ఒక సర్వే పేర్కొంది. నిత్యం వెలుగు చూసే సెక్స్ సర్వే ఫలితాల్లో సగం అబద్ధాలే ఉంటున్నాయని ఎక్కువమంది విశ్వసిస్తున్నారని ఆ సర్వే వివరించింది. ప్రస్తుతం వార్తల్లోకి వచ్చే సర్వేల గురించి జనుల అభిప్రాయాలను కోరింది ‘ఫాక్స్’ న్యూస్‌కు సంబంధించిన ఒక అధ్యయన బృందం.
వీరి సర్వే ప్రకారం సెక్స్ సర్వేలు చెప్పే విషయాలకు సామాన్యులు అంత విలువనివ్వడం లేదని తేలింది. తమ నిజ జీవిత అనుభవాలతో పోల్చుకొని... సర్వేలో వస్తున్న వాటిలో చాలావరకూ అబద్ధాలే ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారట. అయితే రీడబులిటీ ఉండేందుకే వార్తాసంస్థలు సెక్స్ సర్వేలను ప్రచురిస్తున్నాయని వారు అంటున్నారని ఈ అధ్యయనం పేర్కొంది.
ఫస్ట్‌క్రాష్‌తో ఫుల్ ఫియర్...
తమ జీవితంతో ఒక అమ్మాయిని తొలిసారిగా మీట్ అయినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యామని మగాళ్లు అంటున్నారు. వీరిలో 40 శాతం మంది ఫీలింగ్స్‌తో పాటు ఫియర్‌కూడా తప్పలేదని వ్యాఖ్యానించారు. అమ్మాయితో మాట్లాడటం తమకు మొహమాటంతో కూడిన ప్రక్రియ అని ఏకంగా 50 శాతం పురుషులు వ్యాఖ్యానించడం విశేషం. యూనివర్సిటీ ఆఫ్ షికాగో వారి పరిశోధనలో ఈ విషయం తేలింది. స్కూల్స్, కాలేజెస్, కాఫీ షాప్‌లు, మాల్స్.. ఇవే తొలి చూపు ఆకర్షణకు చక్కటి ప్లేస్‌లు అని జనాలు అభిప్రాయపడుతున్నారు.. రెస్టారెంట్లు, మూవీ థియేటర్లు మాత్రం ఈ జాబితాలో బాగా దిగువన ఉన్నాయి.