కుక్క పిల్ల అని తెచ్చుకుంటే..  | They Were Shocked Accedental Bring Fox Instead Of A Puppy | Sakshi
Sakshi News home page

కుక్క పిల్ల అని తెచ్చుకుంటే.. 

Published Wed, Oct 12 2022 8:29 AM | Last Updated on Wed, Oct 12 2022 8:32 AM

They Were Shocked Accedental Bring Fox Instead Of A Puppy - Sakshi

బనశంకరి: రోడ్డు మీద కనిపించిన కుక్క పిల్లని ఇంటికి తెచ్చి పాలు పెరుగు పెట్టారు. తరువాత  అది నక్క పిల్ల అని తెలిసి అవాక్కయ్యారు. ఇటీవల బెంగళూరు బనశంకరికి చెందిన వ్యక్తి వీధిలో దొరికిన కుక్క పిల్లను ఇంటికి తీసుకువచ్చాడు. మామూలుగా దానికి పాలు, పెరుగు పెట్టారు.  

అవి తినడంతో అది అనారోగ్యానికి గురై నాలుగురోజుల పాటు ఇంట్లో మూలుగుతూ ఇబ్బంది పడింది. దాని అరుపులు విన్న ఇరుగుపొరుగువారు ప్రాణి సంరక్షకులను ఫోన్‌ చేశారు. కుక్కపిల్ల వీడియో పంపాలని వారు కోరగా వారు అలాగే చేశారు. దానిని పరిశీలించి అది కుక్క కాదు నక్క అని తేల్చారు. పోలీసులు వచ్చి నక్క పిల్లను తీసుకుని కెంగేరి వద్ద గల జంతు సంరక్షణాలయానికి తరలించారు. కాగా నగరంలో జనావాసాల్లోకి నక్కపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా ఉంది.  

(చదవండి: షాకింగ్‌ వీడియో.. నిర‍్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement