దొడ్డబళ్లాపురం: రోజూ అదృష్టం కలిసిరావాలంటే పొద్దున లేవగానే నక్క ఫొటో చూడండని కొందరంటుంటారు. అందుకే నక్క ఫొటోలకు ఫ్రేం కట్టి మరీ విక్రయిస్తుండడం చూస్తుంటాం.అయితే ఇక్కడో మహిళ అదృష్టాన్ని ఇంట్లోనే పెట్టేసుకోవాలనుకుందేమో, నక్కపిల్లను తీసుకువచ్చి ఇంట్లో పెంచుకుంటోంది. ఈ సంఘటన నెలమంగల తాలూకా మస్కూరులో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఒక చిన్నకారు రైతు మహిళ నక్క పిల్లను పెంచుకుంటోందని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఇంటిపై దాడిచేసి నక్కను స్వాధీనం చేసుకున్నారు. అదృష్టం వరిస్తుందని పెంచుతున్నానని, వేరే ఉద్దేశం లేదని ఆమె వేడుకోవడంతో అధికారులు కేసు నమోదు చేయకుండా వదిలేశారు. నక్కపిల్లను బన్నేరుఘట్ట నేషనల్ పార్కుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment