
కుక్కలు మొరగడం, పిల్లులు మ్యావ్ అనడం, పక్షులు కూత పెట్టడం చూశాం. మరి నక్కలు ఏం చేస్తాయి? ఊల పెడతాయి అంటారా? అవును, అది రాత్రిళ్లు ఎక్కువగా ఊల పెడుతుంటాయి. కానీ అవి కూడా మాట్లాడతాయి. కానీ ఏం మాట్లాడుతుందో మనకు ఒక్క ముక్క అర్థం కాదు. అయితే "నక్కలు ఏదో మాట్లాడుతున్నాయి. అదేంటో చెప్పండి.." అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది నెటిజన్ల మెదడుకు సవాల్ విసురుతోంది. ఎంత జుట్టు పీక్కున్నా నక్కలు ఏం మాట్లాడుతున్నాయో ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. (అదిగో చిరుత.. ఇదిగో జింక)
నిజానికి అవి మాట్లాడటం కన్నా ఎక్కువగా నవ్వుతూనే ఉన్నాయి. ఈ వీడియో ఈ ఏడాది మార్చిలో యూట్యూబ్‌లో ప్రత్యక్షం కాగా తాజాగా ట్విటర్‌లో వైరలవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 18 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఇందులో కనిపించే మూడు నక్కలు ఫిన్నెగన్, డిక్సీ, విక్సీ. వీటికి చక్కిలిగింతలు పెట్టిన కొద్దీ తెగ నవ్వుతున్నాయి. మధ్యమధ్యలో ఏవేవో శబ్ధాలు చేస్తూ నవ్వుతూ తుళ్లుతూ కిందపడి దొర్లుతున్నాయి. అయితే వీటి నవ్వు మనుషులను పోలి ఉండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. (వైరల్: పాము కాదు, స్పైడర్ కాదు మరేంటి?)
Comments
Please login to add a commentAdd a comment