Surrey
-
సామ్ కర్రన్ వీర బాదుడు
టీ20 బ్లాస్ట్ 2024లో సర్రే జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (సెప్టెంబర్ 3) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు డర్హమ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో డొమినిక్ సిబ్లే (67), సామ్ కర్రన్ (52) సర్రేను గెలిపించారు. ముఖ్యంగా సామ్ కర్రన్ ఆఖర్లో వీర బాదుడు బాది మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జట్టులో టాపార్డర్ అంతా విఫలం కాగా.. ఆఖర్లో బెన్ రెయినే (23), మైఖేల్ జోన్స్ (37 నాటౌట్), టర్నర్ (27), బాస్ డి లీడ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సర్రే బౌలర్లలో డేనియల్ వారెల్, రీస్ టాప్లే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టామ్ కర్రన్, సామ్ కర్రన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే.. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు తాకింది. డొమినిక్ సిబ్లే, సామ్ కర్రన్ అర్ద సెంచరీలతో రాణించి సర్రేను గెలిపించారు. వీరిద్దరు మినహా సర్రే ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. విల్ జాక్స్ 8, లారీ ఈవాన్స్ 1, రోరి బర్న్స్ 10 పరుగులు చేశారు. డర్హమ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, పార్కిన్సన్ తలో రెండు వికెట్లు, బెన్ రెయినే ఓ వికెట్ పడగొట్టారు. టీ20 బ్లాస్ట్ రెండో క్వార్టర్ ఫైనల్లో ఇవాళ ససెక్స్, లాంకాషైర్ జట్లు తలపడనున్నాయి. -
సాయి సుదర్శన్ సంచలనం.. సిక్స్‌తో సెంచరీ! వీడియో
టీమిండియా యువ సంచలనం సాయిసుదర్శన్ ఇంగ్లండ్ కౌంటీల్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. కౌంటీ ఛాంపియన్ షిప్-2024లో సర్రే క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా నాటింగ్‌హామ్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సాయిసుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.సిక్స్‌తో తన తొలి కౌంటీ సెంచరీ మార్క్‌ను ఈ తమిళనాడు బ్యాటర్ అందుకున్నాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుదర్శన్.. తొలి ఇన్నింగ్స్‌లో సర్రే 525 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్‌గా 178 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్ రోరీ బర్న్స్(161) కూడా సెంచరీతో రాణించాడు. కాగా కౌంటీల్లో సుదర్శన్ ఆడటం ఇదే రెండో సారి. గతేడాది కౌంటీ ఛాంపియన్ షిప్లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో సర్రే తరపున ఆడాడు.అయితే ఈ ఏడాది సీజన్ మొత్తానికి అతడు అందుబాటులో ఉండడం లేదు. సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అతడు తిరిగి స్వదేశానికి రానున్నాడు.భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించే సి టీమ్‌లో సాయికి చోటు దక్కింది. అయితే ఇప్పటికే వన్డేల్లో అరంగేట్రం చేసిన సుదర్శన్.. దులీప్ ట్రోఫీలో రాణిస్తే టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సఫారీ క్రికెటర్ -
T20 Blast 2024: క్రికెట్ మైదానంలోకి నక్క
క్రికెట్ మైదానంలోకి పాములు, కుక్కలు రావడం ఇటీవలికాలంలో తరుచూ చూస్తున్నాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఓ గుంట నక్క మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 బ్లాస్ట్ 2024లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానంలో హ్యాంప్‌షైర్, సర్రే మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా.. నక్క ఒక్కసారిగా మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆటగాళ్లు, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.Fox invades the field in Vitality Blast. 😄pic.twitter.com/dENXcc1wIL— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2024నక్క మైదానంలో చక్కర్లు కొట్టడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. నక్క మైదానం సిబ్బంది వచ్చేలోపు పలాయనం చిత్తగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నక్క ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వచ్చిన దారిలోనే కామ్‌గా వెళ్లిపోయింది. ఇది చూసి ఆటగాళ్లు, ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. హ్యాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్ 183 పరుగులకు ఆలౌట్ కాగా.. సామ్ కర్రన్ శతక్కొట్టడంతో (102 నాటౌట్) సర్రే మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, టీ20 బ్లాస్ట్ 2024 చివరి దశకు చేరింది. మే 30న మొదలైన ఈ టోర్నీ పలు బ్రేక్‌ల అనంతరం గ్రూప్ దశను ముగించుకుంది. గ్రూప్ దశ అనంతరం మొత్తం ఎనిమిది జట్లు (సర్రే, డర్హమ్, ససెక్స్, లాంకాషైర్, సోమర్సెట్, వార్విక్షైర్, గ్లోసెస్టర్‌షైర్) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్ దశ సెప్టెంబర్ 3 నుంచి మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 3, 4, 5, 6 తేదీల్లో జరుగనున్నాయి. రెండు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 14న జరుగనున్నాయి. -
ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సామ్ కరన్ తొలి టీ20 సెంచరీ
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ టీ20 క్రికెట్లో తొలి శతకం సాధించాడు. టీ20 బ్లాస్ట్ లీగ్‌లో భాగంగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సర్రే క్రికెటర్.. 102 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా సర్రే- హాంప్‌షైర్ జట్లు గురువారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన సర్రే టీమ్ తొలుత బౌలింగ్ చేసింది.హాంప్‌షైర్ బ్యాటర్లలో కెప్టెన్ జేమ్స్ వినిస్(11 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ టోబీ అల్బర్ట్ 66 పరుగులతో రాణించాడు.వీరిద్దరి విజృంభణ నేపథ్యంలో 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, దురదృష్టవశాత్తూ టోబీ రనౌట్ కావడం, మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో 19.5 ఓవర్లలోనే హాంప్‌షైర్ ఆలౌట్ అయింది.సామ్ కర్రన్ ఫోర్లు, సిక్సర్ల వర్షంఇక లక్ష్య ఛేదనకు దిగిన సర్రేకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ విల్ జాక్స్ 6 పరుగులకే నిష్క్రమించాడు. మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లే 27 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన లారీ ఇవాన్స్(8), రోరీ బర్ర్స్(7) చేతులెత్తేశారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సామ్ కర్రన్.. ధనాధన్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ కొట్టిన.. సామ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 20 ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదిన సామ్ కర్రన్ వంద పరుగుల మార్కు అందుకోవడంతో పాటు.. జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. సామ్ కర్రన్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా హాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఏమిటీ టీ20 బ్లాస్ట్ లీగ్?రెండు దశాబ్దాలకు పైగా చరి త్ర ఉన్న టీ20 లీగ్ ఈ టీ20 బ్లాస్ట్. ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్‌ను మొదలుపెట్టింది.తొలుత దీనిని ట్వంటీ20 కప్(2003- 2009)గా పిలిచేవారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఫ్రెండ్స్లైఫ్ టీ20గా.. 2017 వరకు న్యూయెస్ట్ టీ20 బ్లాస్ట్.. ప్రస్తుతం విటలిటీ బ్లాస్ట్గా పిలుస్తున్నారు.ఈ లీగ్‌లో 18 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ దేశాలు పాల్గొంటాయి. వీటిని నార్త్, సౌత్ గ్రూపులుగా విభజిస్తారు. సాధారణంగా మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. టీ20 బ్లాస్ట్-2024 సీజన్ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.నార్త్ గ్రూప్ జట్లుడెర్బీషైర్ ఫాల్కన్స్, దుర్హాం, లంకాషైర్ లైటెనింగ్, లీసెస్టర్‌షైర్ ఫాక్సెస్, నార్తాంప్టన్‌షైర్ స్టీల్‌బాక్స్, నాట్స్ అవుట్లాస్(నాటింగ్హాంషైర్), బర్మింగ్‌హాం బేర్స్(విర్విక్షైర్), వర్సెస్టైర్షైర్ ర్యాపిడ్స్, సార్క్షైర్ వికింగ్స్.సౌత్ గ్రూపు జట్లుఎసెక్స్ ఈగల్స్, గ్లామోర్గాన్, గ్లౌసెస్టర్షైర్, హాంప్‌షైర్, కెంట్ స్పిట్‌ఫైర్స్, మిడిల్సెక్స్, సోమర్సెట్, సర్రే, ససెక్స్ షార్క్స్.ఈ సీజన్లో ప్రస్తుతం నార్త్ గ్రూపు నుంచి బర్మింగ్‌హాం 18 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. సౌత్ గ్రూపు నుంచి సర్రే 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. SAM CURRAN!! 🤩What a stunning way to reach your maiden T20 century and win a match! pic.twitter.com/bHPxZ6sTvc— Vitality Blast (@VitalityBlast) July 18, 2024 -
బ్యాట్ ఝులిపించిన సునీల్ నరైన్.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో విధ్వంసం
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా ఎసెక్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఆటగాడు, సర్రే ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో (4-0-42-1) తేలిపోయిన నరైన్.. బ్యాటింగ్‌లో రాణించి అజేయమైన మెరుపు అర్ధసెంచరీతో (37 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరిశాడు. నరైన్ బ్యాట్‌తో విజృంభించినా, అతని జట్టు సర్రే మాత్రం విజయం సాధించలేకపోయింది. కెప్టెన్ క్రిస్ జోర్డన్ (4-0-23-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (4-0-45-1), ఆసీస్ పేసర్ సీన్ అబాట్ (4-0-47-1) సహా అంతా విఫలమయ్యారు. ఫెరోజ్ ఖుషి (35 నాటౌట్), డేనియల్ లారెన్స్ (58), మైఖేల్ కైల్ పెప్పర్ (75) ఎసెక్స్కు గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. సునీల్ నరైన్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. నరైన్‌తో పాటు సర్రే ఆటగాళ్లు విల్ జాక్స్ (23), జేసన్ రాయ్ (28), జేమీ ఓవర్టన్ (23), టామ్ కర్రన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎసెక్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్, ఆరోన్ బియర్డ్, సామ్ కుక్, హార్మర్, స్నేటర్, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి గెలిపించాడు.. అనంతరం బరిలోకి దిగిన ఎసెక్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో ఫెరోజ్ ఖుషీ ఆఖరి బంతికి సిక్సర్ బాది ఎసెక్స్‌ను గెలిపించాడు. -
ఇరగదీస్తున్న సామ్ కర్రన్.. ఈసారి బంతితో విజృంభణ
టీ20 బ్లాస్ట్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో పలు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో రాణించిన కర్రన్.. నిన్న (జూన్ 16) సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో (4-0-26-5) చెలరేగాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన సర్రే టీమ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. విల్ జాక్స్ (60), ఆఖర్లో క్రిస్ జోర్డాన్ (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సోమర్సెట్ బౌలర్లలో బెన్ గ్రీన్ 4, డేవీ 3, మ్యాట్ హెన్రీ, వాన్ డెర్ మెర్వ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన సోమర్సెట్.. సామ్ కర్రన్ (5/26), క్రిస్ జోర్డాన్ (2/31), అట్కిన్సన్ (1/19) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. సోమర్ సెట్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (53), టామ్ అబెల్ (39) పర్వాలేదనిపించారు. ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే తేలిపోయాడు.. ఇక్కడేమో ఇరగదీస్తున్నాడు ఐపీఎల్ 2023లో సామ్ కర్రన్‌పై పంజాబ్ కింగ్స్ 18.50 కోట్ల పెట్టుబడి పెడితే, అందులో పావు భాగానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. అక్కడ బ్యాట్‌తో బంతితో తేలిపోయిన కర్రన్ స్వదేశంలో జరిగే టీ20 బ్లాస్ట్‌లో మాత్రం రెండు విభాగాల్లోనూ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యచ్‌లు ఆడిన కర్రన్.. ఓ ఫైఫర్ సాయంతో 12 వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్‌లో 3 అర్ధసెంచరీల సాయంతో 252 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో కర్రన్ చేసింది తక్కువ పరుగులే అయినా, పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి, తన జట్టు విజయాలకు దోహదపడ్డాడు. చదవండి: 546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం -
బౌలర్ బ్యాటర్‌గా మారిన వేళ.. ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అత్యద్భుతం చోటు చేసుకుంది. 76 మ్యాచ్‌ల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని ఓ బౌలర్ ఏకంగా ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ హండ్రెడ్ను, ఓవరాల్‌గా టీ20 చరిత్రలో నాలుగో వేగవంతమైన శతకాన్ని బాదాడు. కెంట్‌తో నిన్న (మే 26) జరిగిన మ్యాచ్‌లో సర్రే బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా బౌలర్ సీన్ అబాట్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా 19 ఏళ్ల క్రితం తన దేశానికే చెందిన ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. #ICYMI: Sean Abbott smashed the joint-fastest century in T20 Blast history.pic.twitter.com/HItU4rVxA4— CricTracker (@Cricketracker) May 27, 2023 ఈ మ్యాచ్‌లో మొత్తం 41 బంతులు ఎదుర్కొన్న అబాట్.. 11 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి జట్టులో మరెవరి నుంచి సహకారం లభించకపోయినా ఒక్కడే రాణించి, జట్టు స్కోర్‌ను 200 పరుగులు దాటించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. అబాట్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 223 చేయగా.. ఛేదనలో తడబడిన కెంట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెంట్ ఓపెనర్లు తవాండ ముయేయే (37 బంతుల్లో 59), డేనియల్ బెల్ డ్రమ్మండ్ (27 బంతుల్లో 52) జోడీ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ, ఆతర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో కెంట్ లక్ష్యానికి సుదూరంలో నిలిచిపోయింది. సర్రే బౌలర్లలో సునీల్ నరైన్, విల్ జాక్స్, టామ్ లేవ్స్ తలో 2 వికెట్లు.. సామ్ కర్రన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: శుబ్‌మన్ సూపర్ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ -
విజయానికి 9 పరుగులు.. కనివినీ ఎరుగని హైడ్రామా
ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లు.. ఈ దశలో ఎవరైనా సరే ఈజీగా విజయం సాధిస్తుందని అనుకుంటారు. కానీ ఇది టి20 మ్యాచ్. మరుక్షణం ఏం జరుగుతుందన్నది ఎవరు ఊహించలేరు. ఒక బంతికి రన్ తీస్తే.. మరుసటి బంతికి వికెట్ పడడం.. ఆ తర్వాత బౌండరీ.. మరోసారి వికెట్.. ఇలా ఆఖరి ఓవర్ ఒక థ్రిల్లర్‌ను తలపించింది. ఈ ఘటన విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సోమర్సెట్, సర్రీ మధ్య మ్యాచ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. టామ్ బాండన్ 39, గోల్డ్‌వార్తి 27, లామోన్బీ 21 పరుగులు చేశారు. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సర్రీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వరకు సజావుగానే సాగింది. 19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. పీటర్ సిడిల్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి సింగిల్ వచ్చింది. రెండో బంతికి 14 పరుగులు చేసిన జోర్డాన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చిన నికో రీఫర్ మూడో బంతిని బౌండరీ తరలించాడు. విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన దశలో రెండు వరుస బంతుల్లో సర్రీ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఆఖరి బంతికి ఫోర్ అవసరం కాగా.. కాన్ మెకర్ బౌండరీ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అలా కనివినీ ఎరుగని హైడ్రామాలో సర్రీ విజేతగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 9️⃣ runs to win from the final over... What happens next is just 🤯#Blast22 pic.twitter.com/PMI0HXMdw9 — Vitality Blast (@VitalityBlast) June 21, 2022 చదవండి: కరోనా బారిన పడ్డా.. కోహ్లి చేసింది కరెక్టేనా! -
అక్కడ సెల్ఫీ తీసుకుంటే అదుర్స్!
న్యూఢిల్లీ : సెల్ఫీలు దిగడం అనేది ఈ రోజుల్లో వేలం వెర్రిగా మారిన విషయం తెల్సిందే. ఇక ‘ఇన్స్టాగ్రామ్’ లాంటి ఫొటో సోషల్ మీడియా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సోలో, ఫ్రెండ్స్ ఫొటోలకు కూడా యమ డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మంచి బ్యాక్‌గ్రౌండ్ కోసం యువతీ యువకులు అతి సుందర నందన వనాలను వెతుక్కుంటూ సుదూర తీరాలకు సైతం పోతున్నారు. దాంతో అనామక ప్రాంతాలు కూడా పాపులర్ అవుతున్నాయి. అలా ప్రసిద్ధి చెందినదే లండన్‌కు 15 మైళ్ల దూరంలోని సర్రీకి సమీపంలో ఉన్న ‘మేఫీల్డ్స్ లావెండర్ ఫామ్’. ఇంగ్లీషు, ఫ్రెంచ్ ఉదా రంగు పూల వికాసంతో కళకళలాడుతున్న ఆ తోటలోకి ఫొటోల కోసం పోటీ పడుతున్నారు. ఇదే అదనుగా 25ఎకరాల ఆ తోట యజమాని మనిషికి ప్రవేశ రుసుమంటూ భారతీయ కరెన్సీలో దాదాపు 250 రూపాయలు విధించారు. అయినా లెక్క చేయకుండా జనం విరగబడుతూనే ఉన్నారు. వారాంతంలో ఫొటో సెషన్ కోసం వచ్చే వారి సంఖ్య మరీ పెరగడంతో తోట యజమాని అక్కడే తిష్టవేసి ‘మంచి ఫొటోలు తీసుకుంటే మళ్లీ మళ్లీ రావాల్సిన అవసరం ఉండదు’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదంతా వారాంతంలో రద్దీని తగ్గించడానికేనని ఆయన చెబుతున్నారు. ఇంతవరకు రెండు, మూడు లేదా ఐదు గంటలు అంటూ సమయాన్ని నిర్దేశించలేదని, రద్దీ పెరిగితే అది చేయాల్సి రావచ్చని చెప్పారు. ఇప్పటి వరకు ఫొటో సెషన్లకు ప్రసిద్ధి చెందిన ‘నాటింగ్ హిల్’, ‘కాట్స్‌వోల్డ్స్ విలేజ్’ ప్రాంతాలు వెనకబడి పోతున్నాయి. -
కౌంటీల్లో అడనున్న విరాట్ కోహ్లీ
-
సర్రే’కు విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కొత్తగా కౌంటీ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. జూన్‌లో కౌంటీ జట్టు సర్రే తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు అవసరమైన మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కోహ్లి కౌంటీలపై ఆసక్తి కనబరిచాడు. దీంతో సర్రే అతనితో సంప్రదింపులు జరిపింది. చివరకు గురువారం ఆ జట్టే కోహ్లితో ఒప్పందం కుదిరిందని అధికారికంగా ప్రకటించింది. దీంతో బెంగళూరులో అఫ్గానిస్తాన్‌తో 14 నుంచి 18 వరకు జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు అతను గైర్హాజరు కానున్నాడు. తన కౌంటీ క్రికెట్‌పై కోహ్లి స్పందించాడు. ‘నేను కౌంటీ క్రికెట్ ఆడాలని ఎన్నాళ్ల నుంచో కోరుకుంటున్నాను. సర్రేతో ఇప్పటికీ నా కోరిక తీరనుంది. ఈ అవకాశం ఇచ్చిన సర్రే డైరెక్టర్ అలెక్ స్టివార్ట్‌కు థ్యాంక్స్’ అని అన్నాడు. వచ్చే నెలలో కోహ్లి సర్రే తరఫున మూడు మ్యాచ్‌ల్లో పాల్గొంటాడు. జూన్ 9 నుంచి 12 వరకు హ్యాంప్‌షైర్‌తో, తర్వాత సోమర్సెట్ (20–23), చివరగా యార్క్‌షైర్ (25–28)తో జరిగే మ్యాచ్‌ల్లో కోహ్లి ఆడతాడు. -
సంగక్కర సరికొత్త రికార్డు
-
సంగక్కర సరికొత్త రికార్డు
చెమ్స్ ఫోర్ట్: ఇటీవల తన దేశవాళీ క్రికెట్ కెరీర్ కు సంబంధించి రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇంకా అత్యుత్తమ ఫామ్‌లోనే కొనసాగుతున్నాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో భాగంగా సర్రే తరపున ఆడుతున్న సంగక్కర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఎసెక్స్ తో మ్యాచ్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో సంగక్కర(177 బ్యాటింగ్;) భారీ సెంచరీ సాధించాడు. తద్వారా కౌంటీ చాంపియన్ షిప్ లో సర్రే తరపున వరుసగా ఐదు సెంచరీలు చేసిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతకుముందు సంగక్కర(136, 105, 114, 120) వరుస శతకాలతో మెరిశాడు. ఇదిలా ఉంచితే, సంగక్కరకు ఇది 99వ సెంచరీ కావడం మరో విశేషం. ఇందులో 61 ఫస్ట్ క్లాస్ సెంచరీలుండగా, 38 లిస్ట్-ఎ సెంచరీలున్నాయి. మరో నాలుగు నెలలు మాత్రమే క్రికెట్ ఆడుతున్నట్లు సంగక్కర ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ తరువాత దేశవాళీ క్రికెట్ నుంచి సైతం వీడ్కోలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగక్కరకు వయసు పైబడటంతో గేమ్ నుంచి పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.