టీ20 బ్లాస్ట్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్‌లో పలు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో రాణించిన కర్రన్.. నిన్న (జూన్ 16) సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో (4-0-26-5) చెలరేగాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన సర్రే టీమ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. విల్ జాక్స్ (60), ఆఖర్లో క్రిస్ జోర్డాన్ (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సోమర్‌సెట్ బౌలర్లలో బెన్ గ్రీన్ 4, డేవీ 3, మ్యాట్ హెన్రీ, వాన్ డెర్ మెర్వ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన సోమర్‌సెట్.. సామ్ కర్రన్ (5/26), క్రిస్ జోర్డాన్ (2/31), అట్కిన్సన్ (1/19) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. సోమర్ సెట్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (53), టామ్ అబెల్ (39) పర్వాలేదనిపించారు.
ఐపీఎల్‌లో 18.50 కోట్లు పెడితే తేలిపోయాడు.. ఇక్కడేమో ఇరగదీస్తున్నాడు
ఐపీఎల్ 2023లో సామ్ కర్రన్‌పై పంజాబ్ కింగ్స్ 18.50 కోట్ల పెట్టుబడి పెడితే, అందులో పావు భాగానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. అక్కడ బ్యాట్‌తో బంతితో తేలిపోయిన కర్రన్ స్వదేశంలో జరిగే టీ20 బ్లాస్ట్‌లో మాత్రం రెండు విభాగాల్లోనూ ఇరగదీస్తున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యచ్‌లు ఆడిన కర్రన్.. ఓ ఫైఫర్ సాయంతో 12 వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్‌లో 3 అర్ధసెంచరీల సాయంతో 252 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో కర్రన్ చేసింది తక్కువ పరుగులే అయినా, పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి, తన జట్టు విజయాలకు దోహదపడ్డాడు.
చదవండి: 546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం
Comments
Please login to add a commentAdd a comment