PC: IPL Twitter
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (2023లో రూ. 18.50 కోట్లు) పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్.. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో చెలరేగిపోయాడు. నిన్న (మే 25) మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన సామ్ (47 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్సర్లు).. అన్న టామ్ కర్రన్ (33 బంతుల్లో 50; 8 ఫోర్లు) సహకారంతో తన జట్టు సర్రేను గెలిపించాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన మిడిల్‌సెక్స్.. విల్ జాక్స్ (3/17), గస్ అట్కిన్సన్ (3/20), సునీల్ నరైన్ (2/37), సీన్ అబాట్ (1/22) ధాటికి 14.5 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.
మిడిల్‌సెక్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ హోల్డెన్ (43), పీటర్ మలాన్ (30), జాన్ సిమ్సన్ (15), జో క్రాక్నెల్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బంతితో ఇరగదీసిన విల్ జాక్స్ బ్యాటింగ్‌లోనూ (22 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలు కనబర్చి, తన జట్టులో గెలుపులో కీలకపాత్ర పోషించిన సామ్ కర్రన్‌పై కొందరు భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలలో కూడా ఊహించని సొమ్మునిచ్చిన ఐపీఎల్‌లో ఏం చేయలేకపోయాడు కానీ, సొంత దేశ లీగ్‌లో మాత్రం ఇరగదీస్తున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2023లో 18.50 కోట్లు పెడితే ఒక్క మ్యాచ్‌లో కూడా పంజాబ్‌ను గెలిపించలేకపోయిన సామ్.. టీ20 బ్లాస్ట్‌లో వచ్చీ రాగానే అన్న సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడని ధ్వజమెత్తుతున్నారు.
ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడిన సామ్ కర్రన్.. 27.60 సగటున, 135.96 స్ట్రయిక్ రేట్‌తో ఒక్క హాఫ్ సెంచరీ సాయంతో 276 పరుగులు చేశాడు. అలాగే 10 వికెట్లు కూడా పడగొట్టాడు. సామ్ తీసుకున్న మొత్తంతో పోలిస్తే అతని ప్రదర్శన రవ్వంత కూడా కాదు. 10 లక్షల కనీస ధర పెట్టిన ఆటగాళ్లు సైతం అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని ఇరగదీస్తున్న వేల కోట్లు కుమ్మరించి కొనుక్కున్న సామ్ తేలిపోవడం నిజంగా బాధాకరం.
చదవండి: IPL 2023: అత్యుత్తమ భారత ఆటగాళ్లతో కూడిన జట్టు ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment