అర్ష్‌దీప్‌ సూపర్‌ బౌలింగ్‌.. పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్‌ | IPL 2023: Mumbai Indians Vs Punjab Kings Match Updates | Sakshi
Sakshi News home page

IPL 2023 : అర్ష్‌దీప్‌ సూపర్‌ బౌలింగ్‌.. పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్‌

Published Sat, Apr 22 2023 7:27 PM | Last Updated on Sat, Apr 22 2023 11:44 PM

IPL 2023: Mumbai Indians Vs Punjab Kings Match Updates - Sakshi

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పోరాడి ఓడింది.215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సూర్యకుమార్‌ యాదవ్‌ 26 బంతుల్లో 57 పరుగులు, కామెరాన్‌ గ్రీన్‌ 43 బంతుల్లో 67, రోహిత్‌ శర్మ 27 బంతుల్లో 44 పరుగులు చేయగా.. టిమ్‌ డేవిడ్‌ 13 బంతుల్లో 25 నాటౌట్‌ పరుగులు చేశాడు.

సూర్యకుమార్‌ ఉన్నంతసేపు మ్యాచ్‌ ముంబైవైపే ఉంది. కానీ సెకండ్‌ స్పెల్‌ బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్‌ సూర్యకుమార్‌ వికెట్‌తో పాటు.. తన చివరి ఓవర్లో తిలక్‌ వర్మ, నెహాల్‌ వదేరాలను ఔట్‌ చేసి పంజాబ్‌ వరుస ఓటములకు బ్రేక్‌ వేశాడు.

సూర్యకుమార్‌ ఔట్‌.. ముంబై 184/4
18 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ 25 బంతుల్లో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై విజయానికి 12 బంతుల్లో 32 పరుగులు కావాలి.

14 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 132/2
తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ 46 ,సూర్యకుమార్‌ 39 పరుగులతో ఆడుతున్నారు.

రోహిత్‌ శర్మ(44) ఔట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై
44 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.  గ్రీన్‌ 43, సూర్యకుమార్‌ 20 పరుగులతో ఆడుతున్నారు.

9 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 79/1
తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టానికి 79 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ 35, రోహిత్‌ శర్మ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఆరు ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 54/1
ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ 24, రోహిత్‌ శర్మ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఒక్క పరుగు చేసిన ఇషాన్‌ కిషన్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో షార్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

పంజాబ్‌ కింగ్స్‌ భారీ స్కోరు.. ముంబై టార్గెట్‌ 215
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్‌ కరన్‌ 55 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. హర్‌ప్రీత్‌ బాటియా 41 పరుగులు చేశాడు. జితేశ్‌ శర్మ ఏడు బంతుల్లోనే 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒక దశలో పంజాబ్‌ కింగ్స్‌ 160 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ అర్జున్‌ టెండూల్కర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మర్చేసింది. ఆ ఓవర్‌లో అర్జున్‌ వైడ్‌, నోబ్‌ సహా 6,4,4,6,4,4,1 మొత్తంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబై బౌలర్లలో గ్రీన్‌, పియూష్‌ చావ్లా తలా రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్‌, అర్జున్‌, జాసన్‌ బెహండార్ఫ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

17 ఓవర్లలో  పంజాబ్‌ కింగ్స్‌ 162/4
14 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హర్‌ప్రీత్‌ సింగ్‌ 44, సామ్‌ కరన్‌ 33 పరుగులతో ఆడుతున్నారు.

14 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 105/4
14 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. హర్‌ప్రీత్‌ సింగ్‌ 15, బాటియా 8 పరుగులతో ఆడుతున్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అర్జున్‌ టెండూల్కర్‌ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.

ఆరు ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 58/1
ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ నష్టానికి 58 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 25, అథర్వ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 11 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో చావ్లాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా శనివారం 31వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. హ్యాట్రిక్‌ విజయాలతో ముంబై జోరు మీదు ఉండగా.. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ మాత్రం రెండు వరుస ఓటములను ఎదుర్కొంది.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), హర్‌ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్‌), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement