టీ20 బ్లాస్ట్ 2024లో సర్రే జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (సెప్టెంబర్ 3) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు డర్హమ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో డొమినిక్ సిబ్లే (67), సామ్ కర్రన్ (52) సర్రేను గెలిపించారు. ముఖ్యంగా సామ్ కర్రన్ ఆఖర్లో వీర బాదుడు బాది మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జట్టులో టాపార్డర్ అంతా విఫలం కాగా.. ఆఖర్లో బెన్ రెయినే (23), మైఖేల్ జోన్స్ (37 నాటౌట్), టర్నర్ (27), బాస్ డి లీడ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సర్రే బౌలర్లలో డేనియల్ వారెల్, రీస్ టాప్లే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టామ్ కర్రన్, సామ్ కర్రన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే.. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు తాకింది. డొమినిక్ సిబ్లే, సామ్ కర్రన్ అర్ద సెంచరీలతో రాణించి సర్రేను గెలిపించారు. వీరిద్దరు మినహా సర్రే ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.
విల్ జాక్స్ 8, లారీ ఈవాన్స్ 1, రోరి బర్న్స్ 10 పరుగులు చేశారు. డర్హమ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, పార్కిన్సన్ తలో రెండు వికెట్లు, బెన్ రెయినే ఓ వికెట్ పడగొట్టారు. టీ20 బ్లాస్ట్ రెండో క్వార్టర్ ఫైనల్లో ఇవాళ ససెక్స్, లాంకాషైర్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment