Durham
-
సామ్ కర్రన్ వీర బాదుడు
టీ20 బ్లాస్ట్ 2024లో సర్రే జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (సెప్టెంబర్ 3) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు డర్హమ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో డొమినిక్ సిబ్లే (67), సామ్ కర్రన్ (52) సర్రేను గెలిపించారు. ముఖ్యంగా సామ్ కర్రన్ ఆఖర్లో వీర బాదుడు బాది మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జట్టులో టాపార్డర్ అంతా విఫలం కాగా.. ఆఖర్లో బెన్ రెయినే (23), మైఖేల్ జోన్స్ (37 నాటౌట్), టర్నర్ (27), బాస్ డి లీడ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సర్రే బౌలర్లలో డేనియల్ వారెల్, రీస్ టాప్లే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టామ్ కర్రన్, సామ్ కర్రన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే.. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు తాకింది. డొమినిక్ సిబ్లే, సామ్ కర్రన్ అర్ద సెంచరీలతో రాణించి సర్రేను గెలిపించారు. వీరిద్దరు మినహా సర్రే ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. విల్ జాక్స్ 8, లారీ ఈవాన్స్ 1, రోరి బర్న్స్ 10 పరుగులు చేశారు. డర్హమ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, పార్కిన్సన్ తలో రెండు వికెట్లు, బెన్ రెయినే ఓ వికెట్ పడగొట్టారు. టీ20 బ్లాస్ట్ రెండో క్వార్టర్ ఫైనల్లో ఇవాళ ససెక్స్, లాంకాషైర్ జట్లు తలపడనున్నాయి. -
టీ20 క్రికెట్లో సంచలనం.. కేవలం 16 పరుగలకే ఆలౌట్
జింబాబ్వే దేశవాళీ టీ20 టోర్నీ-2024లో సంచలనం నమోదైంది. శనివారం డర్హామ్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో ఈగల్స్ కేవలం 16 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీ20 చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా ఈగల్స్ చెత్త రికార్డును నెలకొల్పింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ అగ్రస్ధానంలో ఉంది. బిగ్‌బాష్ లీగ్-2022లో సిడ్నీ థండర్స్ కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హామ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ సాధిచింది. డర్హామ్ బ్యాటర్లలో బాస్ డి లీడ్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మస్టర్డ్(46), రాబిన్సన్(49) పరుగులతో అదరగొట్టారు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈగల్స్ కేవలం 16 పరుగులకే కుప్పకూలింది. డర్హామ్ బౌలర్లలో కాఫ్లీన్, పార్కిన్సన్, లూక్ రాబిన్సన్ తలా రెండు వికెట్లతో డర్హామ్ పతనాన్ని శాసించగా.. బాస్ డీ లీడ్, సౌటర్ తలా వికెట్ సాధించారు. మిగితా రెండు వికెట్లు రనౌట్ రూపంలో దక్కాయి. ఈగల్స్ బ్యాటర్లలో చిబావా(4) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
50 ఓవర్ల ఫార్మాట్లో భారీ స్కోర్.. ఇంగ్లండ్ 498 పరుగులు చేస్తే..!
50 ఓవర్ల క్రికెట్ ఫార్మట్‌లో (లిస్ట్-ఏ క్రికెట్) భారీ స్కోర్ నమోదైంది. ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్-2023లో భాగంగా ససెక్స్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో డర్హమ్ జట్టు 427 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ అలెక్స్ లీస్ (107 బంతుల్లో 144; 19 ఫోర్లు) భారీ శతకంతో విరుచుకుపడగా.. వన్‌డౌన్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హమ్ (54 బంతుల్లో 102; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విజృంభించాడు. వీరితో పాటు ఓపెనర్ గ్రహం క్లార్క్ (58 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు. ఫలితంగా డర్హమ్ లిస్ట్-ఏ క్రికెట్ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు కలుపుకుని) 21వ అత్యుత్తమ స్కోర్ నమోదు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యుత్తమ టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు జట్టు పేరిట ఉంది. గతేడాది (2022) విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ఆ మ్యాచ్‌లో ఎన్ జగదీశన్ (277) భారీ డబుల్ సెంచరీతో విరుచుకుపడగా.. సాయి సుదర్శన్ (154) శతకంతో మెరిశాడు. Records galore in Hove as centuries from Bedingham & Lees help Durham to commanding one-day cup win.#ForTheNorth — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. గతేడాది జూన్ 17న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 498 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నాడు ఇంగ్లీష్ జట్టులో ఏకంగా ముగ్గురు శతక్కొట్టారు. ఫిల్ సాల్ట్ (122), డేవిడ్ మలాన్ (125), జోస్ బట్లర్ (162 నాటౌట్) మెరుపు శతకాలతో చెలరేగిపోయారు. Shot Jonesy to bring up our highest List A score 🤩#ForTheNorth pic.twitter.com/HDR5fVmBkZ — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 ఇక ససెక్స్-డర్హమ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ససెక్స్ 39.1 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ హెయిన్స్ (65), ప్రెంటిస్ (65) అర్ధసెంచరీలతో రాణించారు. DAVID BEDINGHAM HAS OUR FASTEST LIST A 100 IN JUST 52 BALLS!!#ForTheNorth pic.twitter.com/5j9tZDIVug — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 -
వైరల్‌గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య
ఇంగ్లండ్ టెస్టు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వోర్సెస్టర్షైర్తో మ్యాచ్‌లో డుర్హమ్ తరపున 88 బంతుల్లోనే 161 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆ తర్వాత అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ గ్లామోర్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టోక్స్ 110 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఒక రకంగా స్టోక్స్‌కు మంచి ప్రాక్టీస్ లభించినట్లే. ఇక విషయంలోకి వెళితే.. గ్లామోర్గాన్స్ బౌలర్ మార్నస్ లబుషేన్ వేసిన ఒక బంతి స్టోక్స్ నడుము కింది భాగంలో తగిలింది. దీంతో స్టోక్స్ క్రీజులోనే కిందపడిపోయాడు. అయితే ఇదంతా ఫన్నీగా మాత్రమే. వాస్తవానికి స్టోక్స్‌కు పెద్దగా దెబ్బలు తగల్లేదు. తన కాలును స్ట్రెచ్ చేసుకోవడానికే స్టోక్స్ క్రీజులో పడిపోయాడు. అయితే స్టోక్స్‌కు దెబ్బ తగిలిందేమోనని పరిగెత్తుకొచ్చిన లబుషేన్ అసలు విషయం తెలుసుకొని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పైకి లేచిన స్టోక్స్ తన బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టోక్స్ 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఇంగ్లండ్ కొత్త కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయిన సంగతి తెలిసిందే. కొత్త కెప్టెన్, కొత్త కోచ్ కలయికలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సరికొత్తగా సిద్ధమవనుంది. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు లార్డ్స్ వేదికగా జూన్ 2న ప్రారంభం కానుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన డుర్హమ్ 311 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్ 2, కీగన్ పీటర్సన్ 7, లీస్ 44 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన గ్లామోర్గాన్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. చదవండి: Harpreet Bhatia Forgery Case: అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం.. రంజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు Man down 😬 Ben Stokes is floored after inside edging a Labuschagne short ball into the unmentionables#LVCountyChamp pic.twitter.com/0y3bAxCIBo — LV= Insurance County Championship (@CountyChamp) May 12, 2022 -
ఒక్క ఓవర్ 34 పరుగులు.. 64 బంతుల్లో సెంచరీ; ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ విధ్వంసం
ఇంగ్లండ్ టెస్టు జట్టు నూతన కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో దుమ్మురేపాడు. ఒక ఓవర్లో 34 పరుగులు పిండుకోవడంతో పాటు 64 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్-2లో డర్హమ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్ వోర్సెస్టర్‌షైర్‌పై ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్లే అవకాశం తృటిలో కోల్పోయినప్పటికి ప్రత్యర్థి బౌలర్‌కు మాత్రం చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 117వ ఓవర్‌కు ముందు స్టోక్స్ 59 బంతుల్లో 70 పరుగులతో ఆడుతున్నాడు. జోష్ బేకర్ వేసిన ఆ ఓవర్లో తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదిన స్టోక్స్.. చివరి బంతిని బౌండరీ తరలించి 34 పరుగులు రాబట్టడంతో పాటు 64 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ముగిసిపోలేదు. డర్హమ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి స్టోక్స్ 88 బంతుల్లో 8 ఫోర్లు, 17 సిక్సర్లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. 161 పరుగుల్లో 134 పరుగులు కేవలం సిక్సర్లు, ఫోర్ల ద్వారానే వచ్చాయంటే స్టోక్స్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో అర్థమయి ఉండాలి. ఇక రెండోరోజు లంచ్ విరామం తర్వాత డర్హమ్ 6 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బెన్ స్టోక్స్(161 పరుగులు), బెండిగమ్(135 పరుగులు), సీన్ డిక్సన్(104 పరుగులు) ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన వోర్సెస్టర్షైర్ టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.ఇక గతేడాది కాలంగా టెస్టుల్లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుస సిరీస్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జో రూట్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బెన్ స్టోక్స్‌ను కొత్త టెస్టు కెప్టెన్‌గా నియమించింది. చదవండి: Brendon Mccullum: ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్! 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣ What. An. Over. 34 from six balls for @benstokes38 as he reaches a 64 ball century 👏#LVCountyChamp pic.twitter.com/yqPod8Pchm — LV= Insurance County Championship (@CountyChamp) May 6, 2022 -
మరో డబుల్ సాధించిన పుజారా.. 28 ఏళ్ల కిందటి రికార్డు సమం
పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మూడంకెల స్కోర్‌ను అందుకున్నాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. టీమిండియాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పట్టించుకోలేదన్న కసితో రగిలిపోతున్న పుజారా.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో ససెక్స్‌కు ఆడుతున్న అతను.. 3 మ్యాచ్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు (201*, 203), ఓ సెంచరీ (109) సాయంతో ఏకంగా 531 పరుగులు సాధించాడు. తాజాగా డర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) ద్విశతకం బాదిన పుజారా.. తన జట్టును పటిష్టమైన స్థితిలో ఉంచాడు. ఈ క్రమంలో అతను 28 ఏళ్ల కిందటి ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. కౌంటీ క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ తర్వాత రెండు డబుల్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కాగా, ససెక్స్‌తో జరుగుతున్న డివిజన్-2 మ్యాచ్‌లో టాస్ గెలిచిన డర్హమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ససెక్స్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పుజారా (334 బంతుల్లో 203; 24 ఫోర్లు) డబుల్ సెంచరీతో సత్తా చాటడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 538 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఈ క్రమంలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన డర్హమ్.. నాలుగో రోజు (మే 1) తొలి సెషన్ సమయానికి వికెట్ నష్టపోకుండా 245 పరుగులు చేసింది. ఓపెనర్లు సీన్ డిక్సన్ (148 నాటౌట్), అలెక్స్ లీస్ (84 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్ -
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త..
Ind Vs Eng Warm Up Match: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు బీసీసీఐ.. టీమిండియాకు శుభవార్త చెప్పింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోవడంతో భారత జట్టు బొక్కబోర్లా పడ్డ విషయం విధితమే. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి తప్పిదం జరగకుండా బీసీసీఐ జాగ్రత్త పడింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కోహ్లీ సేనకు ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేసింది. ఈ నెల 20న డర్హమ్లోని ఎమిరేట్స్ రివర్‌సైడ్‌లో కౌంటీ ఛాంపియన్షిప్ ఎలెవన్ జట్టుతో టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని డర్హమ్ క్రికెట్ అధికారికంగా వెల్లడించింది. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మూడు వారాల పాటు బయో బబుల్ నుంచి బయటకు వెళ్లిన ఇండియన్ క్రికెటర్లు ఇవాళ లండన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ టీమిండియాకు ఓ షాకింగ్ వార్త తెలిసింది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతన్ని వదిలేసి మిగతా జట్టంతా మూడు రోజుల మ్యాచ్ కోసం సిద్ధం కానుందని బీసీసీఐ వెల్లడించింది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 4 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ప్రారంభంనుంది. -
కీపర్ రాకెట్ త్రోకు దిమ్మతిరిగింది
-
కీపర్ రాకెట్ త్రోకు దిమ్మతిరిగింది
చెస్టర్ లీ స్టీట్: ఇంగ్లండ్‌లో జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్‌లో దుర్హామ్ వికెట్ కీపర్ ఫర్హాన్ బెహర్డియన్ విసిరిన అద్భుతమైన త్రోకు లీసెస్టర్‌షైర్ కెప్టెన్ కొలిన్ అకర్మ్యాన్కు దిమ్మతిరిగింది. నాన్‌స్టైకర్ ఎండ్‌వైపు రాకెట్ వేగంతో విసిరిన ఆ త్రో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయయింది. లీసస్టర్‌షైర్ తొలుత బ్యాటింగ్ చేసే క్రమంలో ఇన్నింగ్స్ 9 ఓవర్ రెండో బంతికి అకర్‌మ్యాన్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. బంతిని హిట్ చేసి పరుగు కోసం యత్నించే సమయంలో రనౌట్ అయ్యాడు. కాగా, అప్పటికే బంతిని పట్టుకున్న కీపర్ బెహర్దియన్.. ఆ బంతిని వేగంగా నాన్‌స్టైకర్ ఎండ్ వైపు ఉన్న వికెట్లపైకి విసిరాడు. అంతే అకర్‌మ్యాన్ క్రీజ్‌లోకి చేరేలోపే వికెట్లు ఎగిరిపడటంతో భారంగా పెవిలియన్‌కు చేరాడు. అకర్‌మ్యాన్ పది పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో దుర్హామ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఆ తర్వాత 131 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దుర్హామ్ జట్టు 15. 2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
కుప్పకూలిన క్రికెట్ స్టాండ్
దుర్హామ్ : ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య ఎమిరేట్స్ రివర్సైడ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. స్టేడియంలో ఈశాన్యం దిశలో ప్రేక్షకులు కూర్చుని ఉన్న స్టాండ్‌లో ఓ భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రేక్షకులు గాయాల పాలయ్యారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఆ స్టాండ్‌లోని ప్రేక్షకులను వేరే స్టాండ్‌కు పంపారు. కాగా, మ్యాచ్‌కు వారం రోజుల ముందు జరిగే పరీక్షలన్నింటిలో సదరు స్టాండ్‌కు మంచి మార్కులు వచ్చినట్లు తెలిసింది. -
నగరం కింద మరో నగరం
లండన్: మొన్న మహారాష్ట్ర రాజభవన్ కింద ఓ భారీ సొరంగంలో పెద్ద నిర్మాణం బయటపడినట్లు బ్రిటన్‌లోని చారిత్రకంగా ప్రసిద్ధ చెందిన నగరం దుర్హామ్ కింద మరో నగరం బయటపడింది. ఇప్పటికే ఉన్న ఈ నగరం కింద అబ్బురపరిచే మాయానగరంలాంటి కట్టడాలు బయల్పడ్డాయి. అందులో చిన్నచిన్న నివాసాలు, టన్నెల్స్ బయల్పడ్డాయి. ఇప్పటికీ చెక్కు చెదరని కిటికీలు, తలుపులతోపాటు, అప్పట్లో దివిటీలకోసం ఉపయోగించిన కాగడాలు కూడా చెక్కుచెదరకుండా దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది 250 సంవత్సరాల కింద నిర్మించిన నగరంగా చరిత్ర కారులు భావిస్తున్నారు. ఏకంగా ఒక వీధికి వీధి చెక్కు చెదరకుండా మరికొన్ని వీధులు కొంత ధ్వంసం అయి కనిపిస్తున్నాయి. జెప్ హైఫీల్డ్(49) అనే వ్యక్తి దీనిని వెలుగులోకి తెచ్చాడు. ప్రస్తుతం గృహనిర్మాణాలు ఎలా ఉన్నాయో అచ్చం అలాగే ఉన్నాయి. ప్రత్యేకంగా ఇళ్లల్లో వస్తువులు పెట్టుకునేందుకు ఇప్పుడు మనం అమర్చుకుంటున్న అరల మాదిరిగానే 250 ఏళ్ల కిందట ఇవి ఉండటం గమనార్హం. వీటిల్లో కొన్నింటిని పునరుద్ధరించి తిరిగి లగ్జరీ హోటల్ గదులుగా, తాత్కలిక నివాసాలుగా మారుస్తామని జెఫ్ చెప్తున్నాడు. ఇందులో పశువుల కొట్టాలు, మార్కెట్ ప్రాంగణాలు, విలువైన వస్తు విక్రయాల అంగడి గదులు కూడా ఉన్నాయంట. అయితే, దీని కచ్చితమైన చరిత్రను తెలుసుకునేందుకు స్పష్టమైన ఆధారాలు మాత్రం లభ్యం కావడం లేదని, వాటికోసం ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు.