కుప్పకూలిన క్రికెట్‌ స్టాండ్ | Cricket stand collapses during England international match leaving at least three injured | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన క్రికెట్‌ స్టాండ్

Published Sun, Sep 17 2017 4:30 PM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

కుప్పకూలిన క్రికెట్‌ స్టాండ్

కుప్పకూలిన క్రికెట్‌ స్టాండ్

దుర్హామ్‌ : ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య ఎమిరేట్స్‌ రివర్‌సైడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ట్వంటీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. స్టేడియంలో ఈశాన్యం దిశలో ప్రేక్షకులు కూర్చుని ఉన్న స్టాండ్‌లో ఓ భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రేక్షకులు గాయాల పాలయ్యారు.

దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఆ స్టాండ్‌లోని ప్రేక్షకులను వేరే స్టాండ్‌కు పంపారు. కాగా, మ్యాచ్‌కు వారం రోజుల ముందు జరిగే పరీక్షలన్నింటిలో సదరు స్టాండ్‌కు మంచి మార్కులు వచ్చినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement