జింబాబ్వే దేశవాళీ టీ20 టోర్నీ-2024లో సంచలనం నమోదైంది. శనివారం డర్హామ్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో ఈగల్స్ కేవలం 16 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీ20 చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా ఈగల్స్ చెత్త రికార్డును నెలకొల్పింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ అగ్రస్ధానంలో ఉంది. బిగ్‌బాష్ లీగ్-2022లో సిడ్నీ థండర్స్ కేవలం 15 పరుగులకే ఆలౌటైంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హామ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ సాధిచింది. డర్హామ్ బ్యాటర్లలో బాస్ డి లీడ్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మస్టర్డ్(46), రాబిన్సన్(49) పరుగులతో అదరగొట్టారు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈగల్స్ కేవలం 16 పరుగులకే కుప్పకూలింది.
డర్హామ్ బౌలర్లలో కాఫ్‌లీన్, పార్కిన్సన్, లూక్ రాబిన్సన్ తలా రెండు వికెట్లతో డర్హామ్ పతనాన్ని శాసించగా.. బాస్ డీ లీడ్, సౌటర్ తలా వికెట్ సాధించారు. మిగితా రెండు వికెట్లు రనౌట్ రూపంలో దక్కాయి. ఈగల్స్ బ్యాటర్లలో చిబావా(4) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే'
Comments
Please login to add a commentAdd a comment