
డబ్ల్యూపీఎల్‌లో వరుసగా రెండో విజయం
8 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపు
రాణించిన రేణుక, స్మృతి మంధాన
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) దూసుకుపోతోంది. టోర్నీ తొలి పోరులో గుజరాత్ జెయింట్స్‌ను అలవోకగా ఓడించిన ఆర్‌సీబీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.
ముందుగా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆర్‌సీబీ... ఆ తర్వాత స్మృతి, వ్యాట్ దూకుడైన బ్యాటింగ్‌తో మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలుపు పూర్తి చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, సారా బ్రైస్ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు) కాస్త పోరాడింది.
మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుకా సింగ్ (3/23), జార్జియా వేర్‌హామ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా...గార్త్, బిష్త్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. స్మృతి మంధాన (47 బంతుల్లో 81; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), డానీ వ్యాట్ (33 బంతుల్లో 42; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 65 బంతుల్లోనే 107 పరుగులు జోడించి జట్టు విజయాన్ని
సునాయాసం చేశారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) పెరీ (బి) గార్త్ 17; షఫాలీ (సి) స్మృతి (బి) రేణుక 0; జెమీమా (స్టంప్డ్) రిచా (బి) వేర్‌హామ్ 34; నెదర్లాండ్ (సి) స్మృతి (బి) రేణుక 19; కాప్ (సి) వ్యాట్ (బి) బిష్త్ 12; జొనాసెన్ (సి) కనిక (బి) బిష్త్ 1; బ్రైస్ (స్టంప్డ్) రిచా (బి) వేర్‌హామ్ 23; శిఖా (సి) బిష్త్ (బి) రేణుక 14; రాధ (సి అండ్ బి) వేర్‌హామ్ 0; అరుంధతి రెడ్డి (సి) పెరీ (బి) గార్త్ 4; మిన్ను మణి (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 141.
వికెట్ల పతనం: 1–1, 2–60, 3–62, 4–84, 5–87, 6–105, 7–130, 8–130, 9–132, 10–141.
బౌలింగ్: రేణుక 4–0–23–3, కిమ్ గార్త్ 3.3–0–19–2, ఏక్తా బిష్త్ 4–0–35–2, జోషిత 2–0–21–0, వేర్‌హామ్ 4–0–25–3, కనిక 2–0–13–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) అరుంధతి (బి) శిఖా 81; డానీ వ్యాట్ (సి) జెమీమా (బి) అరుంధతి 42; ఎలీస్ పెరీ (నాటౌట్) 7; రిచా (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1–107, 2–133.
బౌలింగ్: కాప్ 2–0–27–0, శిఖా 4–0– 27–1, మిన్ను 1–0– 10–0, అరుంధతి 3.2–0–25–1, జొనాసెన్ 4–0–37–0, సదర్లాండ్ 2–0–18–0.
Comments
Please login to add a commentAdd a comment