వచ్చే నెలలో ముంబైలో జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధానను నియమించారు.
భారత జట్టు వైస్ కెప్టెన్ అయిన స్మృతిపై ఇటీవల జరిగిన వేలం కార్యక్రమంలో ఆర్‌సీబీ రూ. 3 కోట్ల 40 లక్షలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. స్మృతికి ఆర్‌సీబీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పురుషుల ఐపీఎల్ టోర్నీలో ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న డు ప్లెసిస్, మాజీ సారథి విరాట్ కోహ్లి ట్విటర్‌లో ప్రకటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment