
డబ్ల్యూపీఎల్-2025లో ముంబై వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ముంబై బ్యాటర్లలో హీలీ మాథ్యూస్(50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), నాట్ స్కివర్ బ్రాంట్(41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీనియర్ ద్వయంతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.
గుజరాత్ బౌలర్లలో గిబ్సన్ రెండు, గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫీల్డర్లు సునాయస క్యాచ్‌లను జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌కు గుజరాత్ స్టార్ ప్లేయర్ డాటిన్ దూరమైంది. డాటిన్ లేని లోటు గుజరాత్ టీమ్‌లో స్పష్టంగా కన్పించింది.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), సజీవన్ సజన, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్
గుజరాత్: బెత్ మూనీ (వికెట్ కీపర్), కష్వీ గౌతమ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, డేనియల్ గిబ్సన్, భారతీ ఫుల్మాలి, సిమ్రాన్ షేక్, మేఘనా సింగ్, తనూజా కన్వర్, ప్రియా మిశ్రా
Comments
Please login to add a commentAdd a comment