50 ఓవర్ల క్రికెట్ ఫార్మట్‌లో (లిస్ట్-ఏ క్రికెట్) భారీ స్కోర్ నమోదైంది. ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్-2023లో భాగంగా ససెక్స్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో డర్హమ్ జట్టు 427 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ అలెక్స్ లీస్ (107 బంతుల్లో 144; 19 ఫోర్లు) భారీ శతకంతో విరుచుకుపడగా.. వన్‌డౌన్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హమ్ (54 బంతుల్లో 102; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విజృంభించాడు. వీరితో పాటు ఓపెనర్ గ్రహం క్లార్క్ (58 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు.
ఫలితంగా డర్హమ్ లిస్ట్-ఏ క్రికెట్ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు కలుపుకుని) 21వ అత్యుత్తమ స్కోర్ నమోదు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యుత్తమ టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు జట్టు పేరిట ఉంది. గతేడాది (2022) విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ఆ మ్యాచ్‌లో ఎన్ జగదీశన్ (277) భారీ డబుల్ సెంచరీతో విరుచుకుపడగా.. సాయి సుదర్శన్ (154) శతకంతో మెరిశాడు.
Records galore in Hove as centuries from Bedingham & Lees help Durham to commanding one-day cup win.#ForTheNorth
— Durham Cricket (@DurhamCricket) August 4, 2023
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. గతేడాది జూన్ 17న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 498 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నాడు ఇంగ్లీష్ జట్టులో ఏకంగా ముగ్గురు శతక్కొట్టారు. ఫిల్ సాల్ట్ (122), డేవిడ్ మలాన్ (125), జోస్ బట్లర్ (162 నాటౌట్) మెరుపు శతకాలతో చెలరేగిపోయారు.
Shot Jonesy to bring up our highest List A score 🤩#ForTheNorth pic.twitter.com/HDR5fVmBkZ
— Durham Cricket (@DurhamCricket) August 4, 2023
ఇక ససెక్స్-డర్హమ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ససెక్స్ 39.1 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ హెయిన్స్ (65), ప్రెంటిస్ (65) అర్ధసెంచరీలతో రాణించారు.
DAVID BEDINGHAM HAS OUR FASTEST LIST A 100 IN JUST 52 BALLS!!#ForTheNorth pic.twitter.com/5j9tZDIVug
— Durham Cricket (@DurhamCricket) August 4, 2023
Comments
Please login to add a commentAdd a comment