List A cricket
-
సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ
టీనేజీ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 13 ఏళ్ల వైభవ్.. లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ (బీహార్) ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ పేరిట ఉండేది. అలీ 14 ఏళ్ల 51 రోజుల వయసులో లిస్ట్-ఏ క్రికెట్లోని అరంగేట్రం చేశాడు. తాజాగా వైభవ్ అలీ రికార్డును బద్దలు కొట్టాడు. వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్‌తో పాటు రంజీల్లో మరియు అండర్-19 స్థాయిలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు.కాగా, వైభవ్ లిస్ట్-ఏ అరంగేట్రం ఊహించినంత సజావుగా సాగలేదు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్ ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రాతినిథ్యం వహించిన బీహార్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్ 46.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. బిపిన్ సౌరభ్ (50), గనీ (48), ప్రబల్ ప్రతాప్ సింగ్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3, ఆర్యన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో 2, వెంకటేశ్ అయ్యర్, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు.197 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 25.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ హర్ష్ గావ్లి (83), కెప్టెన్ రజత్ పాటిదార్ (55) అర్ద సెంచరీలతో రాణించి మధ్యప్రదేశ్‌ను గెలిపించారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
ఒక్క పరుగు.. 8 వికెట్లు.. కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్
ఆస్ట్రేలియా దేశీ టోర్నీ వన్డే కప్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం ఎదురైంది. టాస్మానియాతో మ్యాచ్‌లో 52 పరుగుల వద్ద కేవలం రెండు వికెట్లు కోల్పోయిన ఈ జట్టు.. ఈ స్కోరుకు కేవలం ఒక్క పరుగు జతచేసి మిగిలిన ఎనిమిది వికెట్లు నష్టపోయింది. ఆ ఒక్క రన్ కూడా వైడ్ రూపంలో విశేషం. మరి డిఫెండింగ్ చాంపియన్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఇంత భారీ షాకిచ్చిన ఆ బౌలర్లు ఎవరంటే?!లిస్ట్-ఏ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన టాస్మానియా కెప్టెన్ జోర్డాన్ సిల్క్.. వెస్టర్న్ ఆస్ట్రేలియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఓపెనర్ ఆరోన్ హార్డీ(7)ని పేసర్ టామ్ రోజర్స్ అవుట్ చేయగా.. మరో ఓపెనర్ ఆర్సీ షార్ట్(22) వికెట్‌ను బ్యూ వెబ్‌స్టర్ పడగొట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ బాన్‌క్రాఫ్ట్(14) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకన్నాడు. ఈ క్రమంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాతి ఓవర్ నుంచే టాస్మానియా స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ తన మ్యాజిక్ మొదలుపెట్టాడు. 16వ ఓవర్లో రెండు వికెట్లు తీయగా.. వెస్టర్న్ ఆస్ట్రేలియా స్కోరు 52-4గా మారింది. ఇక ఆ తర్వాత వెబ్‌స్టర్ వెనుదిరిగి చూడలేదు. పేసర్ బిల్లీ స్టాన్‌లేక్‌తో కలిసి.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దిమ్మతిరిగేలా షాకిస్తూ వరుసగా పెలివియన్‌కు పంపాడు.వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బిల్లీ స్టాన్లేక్ రెండు వికెట్లు కూల్చగా.. 18వ ఓవర్ ఆఖరి బంతికి వెబ్‌స్టర్ తనఖాతాలో మరో వికెట్ జమచేసుకున్నాడు. అదే విధంగా.. 20వ ఓవర్లో మరో రెండు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.. ఆ మరుసటి ఓవర్లో పదో వికెట్‌ను కూల్చాడు. దీంతో వెస్టర్న్ ఆస్ట్రేలియా 20.1 ఓవర్లలో 53 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ క్రమంలో 28 బంతుల వ్యవధిలో వైడ్ రూపంలో ఒక్క పరుగు పొంది.. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక 53 పరుగులకే చాప చుట్టేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా వన్డే కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.మరోవైపు.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా కేవలం 8.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 55 పరుగులు చేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆరు వికెట్లతో చెలరేగిన బ్యూ వెబ్‌స్టర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక వెస్టర్న్ ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ఆర్సీ షార్ట్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND vs NZ 2nd Test: చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లి -
మేజర్ లీగ్ క్రికెట్‌కు లిస్ట్-ఏ హోదా
అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌కు లిస్ట్-ఏ హోదా లభించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. లీగ్ రెండో ఎడిషన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఐసీసీ నిర్ణయం వెలువడటంతో ఎంఎల్సీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (యూఏఈ) తర్వాత లిస్ట్-ఏ హోదా పొందిన రెండో అసోసియేట్ సభ్య దేశ లీగ్‌గా ఎంఎల్సీ గుర్తింపు దక్కించుకుంది. ఎంఎల్సీ రెండో సీజన్ ఈ ఏడాది జులై 5 నుంచి ప్రారంభంకానుంది. ఎంఎల్‌సీలో ఈసారి గత సీజన్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గత సీజన్లో ఆరు జట్లు సింగిల్ రౌండ్ రాబిన్ ఫార్మట్‌లో మూడు వారాల పాటు 19 మ్యాచ్‌లు ఆడగా.. ఈ సీజన్లో అన్నే జట్లు గత సీజన్ కంటే 6 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడనున్నాయి. ఎంఎల్సీని మరికొద్ది సీజన్లలో 10 జట్ల లీగ్‌గా ఎక్స్‌ప్యాండ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఎంఎల్‌సీలో బీసీసీఐ అనుబంధ ఆటగాళ్లు మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జట్ల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌కు తొలి సీజన్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ లీగ్‌ను లిస్ట్-ఏ హోదా లభించడానికి ఇదీ ఒక కారణం. ఎంఎల్సీ అరంగేట్ర ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టుకు కీరన్ పోలార్డ్ నేతృత్వం వహించాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో పాటు లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సీయాటిల్ ఆర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం ఎంఎల్‌సీలో మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. క్రికెట్లో లిస్ట్-ఏను వన్డే ఫార్మాట్ కింద పరిగణిస్తారు. అంతర్జాతీయ వన్డేలతో పాటు పలు దేశవాలీ టోర్నీలు కూడా ఈ జాబితా పరిధిలోకి వస్తాయి. లిస్ట్-ఏ పోటీలు గరిష్టంగా 8 గంటల పాటు సాగుతాయి. ఐసీసీచే అధికారికంగా వన్డే హోదా పొందని దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా లిస్ట్-ఏ కిందికే వస్తాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, టీ20 క్రికెట్‌తో పాటు లిస్ట్-ఏ క్రికెట్ ఐసీసీచే గుర్తించబడిన మూడు ప్రధాన ఫార్మాట్లలో ఒకటి. -
దీపక్ హుడా సంచలన ఇన్నింగ్స్.. రికార్డులివే! మాక్స్‌వెల్‌తో పాటు..
Deepak Hooda 180- VHT 2023 semi-final: టీమిండియా బ్యాటర్ దీపక్ హుడా దేశవాళీ వన్డే టోర్నీలో దుమ్ములేపాడు. విజయ్ హజారే ట్రోఫీ-2023 సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కర్ణాటకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లో 19 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 180 పరుగులు సాధించాడు. లక్ష్య ఛేదనలో రెండో బ్యాటర్‌గా తద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో అరుదైన ఘనతలు సాధించాడు. భారత్ తరఫున లిస్ట్- ఏ క్రికెట్లో లక్ష్య ఛేదనలో పృథ్వీ షా(123 బంతుల్లో 185 పరుగులు- నాటౌట్) తర్వాత అత్యధిక స్కోరు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అదే విధంగా.. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(220), రవికుమార్ సమర్థ్(192), పృథ్వీ షా(185) తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా దీపక్ హుడా చరిత్రకెక్కాడు. మాక్స్‌వెల్‌తో పాటు ఆ జాబితాలో అంతేగాక.. లిస్ట్-ఏ చరిత్రలో ఛేజింగ్‌లో నంబర్ 4లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన నాలుగో క్రికెటర్‌గా దీపక్ హుడా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెప్ మాక్స్వెల్(201*), అఫ్గనిస్తాన్ బ్యాటర్ సమీఉల్లా షెన్వారీ(192), బంగ్లాదేశ్‌కు చెందిన రకీబుల్ హసన్(190) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. హరియాణాతో ఫైనల్లో రాజస్తాన్ అమీతుమీ కాగా దీపక్ హుడా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో రాజస్తాన్ జట్టు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. కర్ణాటకతో రెండో సెమీఫైనల్లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కర్ణాటక నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ దీపక్ హుడా (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాజస్తాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. కరణ్ లాంబా (73 నాటౌట్; 7 ఫోర్లు)తో కలిసి దీపక్ నాలుగో వికెట్‌కు 255 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. శనివారం జరిగే ఫైనల్లో హరియాణాతో రాజస్తాన్ తలపడుతుంది. 1⃣5⃣0⃣ up for Deepak Hooda 👏👏 He brings it up off just 108 balls. He's played some fabulous shots. 👌👌 Follow the match ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/8qJ53nLmA6 — BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 𝐜𝐫𝐮𝐢𝐬𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 👏👏 A special partnership of 255 between Deepak Hooda (180) & Karan Lamba (73*) helps Rajasthan chase down 283 after being reduced to 23/3 👌 Scorecard ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/CQEIGoErM9 — BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023 -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు
21 ఏళ్ల ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే టోర్నీ మార్ష్ కప్ 2023-24లో భాగంగా టస్మానియాతో ఇవాళ (అక్టోబర్ 8) జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్ (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్ 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు. 21-year-old Jake Fraser-McGurk set a world record by scoring a 29-ball century in Australia's Marsh Cup, breaking Ab de Villiers' record of a 31-ball List A hundred! 🤯👏 pic.twitter.com/z53anVA89r — CricTracker (@Cricketracker) October 8, 2023 ఈ సెంచరీ ద్వారా ఫ్రేజర్ లిస్ట్-ఏ క్రికెట్లో సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. 2014-15లో జొహనెస్‌బర్గ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ 31 బంతుల్లోనే శతక్కొట్టగా.. ఇవాల్టి మ్యాచ్‌లో ఫ్రేజర్ దాదాపు 10 సంవత్సరాలుగా చలామణిలో ఉండిన ఆ రికార్డును బద్దలు కొట్టాడు. టస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్ సృష్టించిన విధ్వంసం ఏ రేంజ్లో ఉండిందంటే.. 436 పరుగులు అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న అతని జట్టు (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 11.4 ఓవర్లలోనే 172 పరుగులు చేసింది. కేవలం 11.4 ఓవర్లలోనే ఫ్రేజర్ సెంచరీని పూర్తి చేసుకుని ఔటయ్యాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్న సౌత్ ఆస్ట్రేలియా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తుంది. 35 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే 90 బంతుల్లో 122 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. నాథన్ మెక్‌స్వీనీ (47), జేక్ లీమన్ (25) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఫ్రేజర్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. హెన్రీ బ్రంట్ (51), డేనియల్ డ్రూ (52) అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. టస్మానియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోర్డన్ సిల్క్ (85 బంతుల్లో 116; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడగా.. ఓపెనర్ కాలెబ్ జువెల్ (52 బంతుల్లో 90; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. రైట్ (51) అర్ధసెంచరీతో రాణించగా... చార్లీ వాకిమ్ (48), వెబ్‌స్టర్ (42), వెథరాల్డ్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా నిర్ధేశించిన 436 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆస్ట్రేలియా ఛేదిస్తే.. దేశవాలీ క్రికెట్ అతి భారీ లక్ష్య ఛేదనగా.. లిస్ట్-ఏ క్రికెట్లో రెండో సక్సెస్ఫుల్ రన్ చేజ్‌గా రికార్డుల్లోకెక్కుతుంది. లిస్ట్-ఏ క్రికెట్లో సక్సెస్ఫుల్ రన్‌ఛేజ్ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. -
భీకర ఫామ్‌లో ఉన్న పృథ్వీ షాకు గాయం.. అర్ధాంతరంగా నిష్క్రమణ
టీమిండియా యువ ఓపెనర్, నార్తంప్టన్‌షైర్ స్టార్ ఆటగాడు పృథ్వీ షా రాయల్ లండన్ వన్డే కప్-2023 నుంచి అర్థంతరంగా నిష్క్రమించాడు. ఈ టోర్నీలో విధ్వంసకర డబుల్ సెంచరీతో పాటు సుడిగాలి సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉండిన షా.. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ముందుగా అనుకున్న దాని కంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షా జట్టు నుంచి వైదొలిగాడు. నార్తంప్టన్ యాజమాన్యం షాను అయిష్టంగా జట్టును నుంచి రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని ఆ జట్టు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇది నిజంగా బాధాకరం.. రాయల్ లండన్ వన్డే కప్ తదుపరి మ్యాచ్‌లకు పృథ్వీ షా అందుబాటులో ఉండడు. డర్హమ్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ షా గాయపడ్డాడు. ఈ టోర్నీలో లిడింగ్ రన్ స్కోరర్ (4 మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ, సెంచరీ సాయంతో 429 పరుగులు) అయిన షా జట్టులో లేకపోవడం పూరించలేని లోటు. స్కాన్ రిపోర్ట్ల్లో షాకు తగిలిన గాయం చాలా తీవ్రమైందని తెలిసింది. షా త్వరలో లండన్‌లో బీసీసీఐ ఆధ్వర్యంలోని స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలుస్తారు. అతి తక్కువ వ్యవధిలో షా నార్తంప్టన్‌షైర్‌పై తీవ్ర ప్రభావం చూపాడు అంటూ ఆ జట్టు కోచ్ జాన్ సాడ్లర్ ట్వీట్లో రాసుకొచ్చాడు. This one hurts. 😢 Prithvi Shaw has been ruled out of the remainder of his Steelbacks stint. 😔 pic.twitter.com/8XWLfrlxAY — Northamptonshire CCC (@NorthantsCCC) August 16, 2023 ఇదిలా ఉంటే, రాయల్ లండన్ వన్డే కప్-2023తో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి అడుగుపెట్టిన పృథ్వీ షా.. నార్తంప్టన్‌షైర్ తరఫున అరంగేట్రం చేసి తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడి నుంచి షా సుడి తిరిగింది. ఆగస్ట్ 9న సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఆతర్వాత ఆగస్ట్ 13న డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. భీకర ఫామ్‌లో ఉండిన షా ఈ టోర్నీలో మరిన్న అద్భుతాలు చేస్తాడనుకున్న తరుణంలో అనూహ్యంగా గాయపడటంతో నార్తంప్టన్ యాజమాన్యంతోపాటు షా అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఈ ప్రదర్శనలతో షా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అభిమానులు అనుకుంటున్న తరుణంగా గాయం షా కెరీర్‌ను మరో నాలుగు మెట్లు వెనక్కు వేసేలా చేసింది. ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు షాను ఆసియా కప్‌కు కాని, వన్డే వరల్డ్‌కప్‌కు కాని పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. -
వన్డే ఫార్మాట్లో పెను సంచలనం.. 515 పరుగుల రికార్డు స్కోర్, 450 పరుగుల తేడాతో విజయం
ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. యూఎస్ఏ అండర్-19 జట్టు అర్జెంటీనా యువ జట్టుపై 450 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. టొరొంటో వేదికగా నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్-19 క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. 2002లో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్.. కెన్యాపై చేసిన 480 పరుగులే ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లో ఉండింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసి, అండర్-19 వన్డే ఫార్మాట్లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా యూఎస్ఏ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు టీమ్ రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్లో అతి భారీ విజయం.. యూఎస్ఏ నిర్ధేశించిన 516 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటీనా.. పేసర్ ఆరిన్ నాదకర్ణి (6-0-21-6) ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. అండర్-19 క్రికెట్ వన్డే ఫార్మాట్లో ఇదే అతి భారీ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా (లిస్ట్-ఏ క్రికెట్) చూసినా యూఎస్ఏ సాధించిన విజయమే వన్డే ఫార్మాట్ మొత్తంలో అతి భారీ విజయంగా నమోదైంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అతి భారీ విజయం రికార్డు తమిళనాడు (అరుణాచల్‌పై 435 పరుగుల తేడాతో విజయం) పేరిట ఉండింది. మ్యాచ్ విషయానికొస్తే.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భవ్య మెహతా (136), రిషి రమేశ్ (100) సెంచరీలతో.. ప్రణవ్ చట్టిపలాయమ్ (61), అర్జున్ మహేశ్ (67) అర్ధసెంచరీలతో చెలరేగడంతో యూఎస్ఏ టీమ్ రికార్డు స్కోర్ చేసింది. యూఎస్ఏ టీమ్‌లో అమోఘ్ ఆరేపల్లి (48), ఉత్కర్ష్ శ్రీవత్సవ (45) కూడా రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన అర్జెంటీనా 19.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నాదకర్ణితో పాటు ఆర్యన్ సతీశ్ (2), పార్థ్ పటేల్ (1), ఆర్యన్ బత్రా (1) వికెట్లు పడగొట్టారు. అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో థియో (18) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
పృథ్వీ షా విధ్వంసకర శతకం.. డబుల్ సెంచరీ మరువక ముందే సుడిగాలి శతకం
రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా మరో సెంచరీ బాదాడు. నాలుగు రోజు కిందట (ఆగస్ట్ 9) సోమర్సెట్పై విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఇవాళ (ఆగస్ట్ 13) డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ కాగా.. నార్తంప్టన్‌షైర్ 25.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. Prithvi Shaw is in red-hot form in the One-Day Cup tournament in England. pic.twitter.com/pVIQwbOewJ — CricTracker (@Cricketracker) August 13, 2023 చెలరేగిన లూక్ ప్రాక్టర్.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్.. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ లూక్ ప్రాక్టర్ (9-0-34-4) ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. ప్రాక్టర్తో పాటు జేమ్స్ సేల్స్ (8-1-31-2), కియోగ్ (5.2-0-35-2), జాక్ వైట్ (10-0-49-1), కెర్రిగన్ (4-0-22-1) కూడా రాణించడంతో డర్హమ్ జట్టు పేకమేడలా కూలింది. డర్హమ్ ఇన్నింగ్స్‌లో ట్రెవాస్కిస్ (37), అలెక్స్ లీస్ (34), బుష్నెల్ (32), బోర్త్విక్ (20), ప్రిటోరియస్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. PRITHVI SHOW in One-day cup🔥 @PrithviShaw pic.twitter.com/GxY9uyrlUl — CricTracker (@Cricketracker) August 13, 2023 విధ్వంసకర డబుల్ సెంచరీని మరువక ముందే.. 199 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్ను ఓపెనర్ పృథ్వీ షా మెరుపు శతకం బాది ఒంటిచేత్తో గెలిపించాడు. సోమర్సెట్పై చేసిన ద్విశతకాన్ని మరువక ముందే షా మరో మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. షాకు రాబ్ కియోగ్ (42) సహకరించగా.. ఎమిలియో గే (17), సామ్ వైట్మన్ (4), లూక్ ప్రాక్టర్ (3) విఫలమయ్యారు. డర్హమ్ బౌలర్లలో జార్జ్ డ్రిస్సెల్ 3 వికెట్లు పడగొట్టగా.. బుష్నెల్ ఓ వికెట్ తీశాడు. -
వన్డే ఫార్మాట్లో మరో డబుల్ సెంచరీ.. ఈసారి..!
రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా చేసిన విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) మరువక ముందే మరో డబుల్ సెంచరీ నమోదైంది. సోమర్‌సెట్‌తో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ కెప్టెన్ జేమ్స్ బ్రేసీ అజేయ డబుల్ సెంచరీతో (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. బ్రేసీతో పాటు మరో ఓపెనర్ క్రిస్ డెంట్ (38 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఓలివర్ ప్రైస్ (83 బంతుల్లో 77; 8 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో గ్రేమ్ వాన్ బుర్రెన్ (12 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో గ్లోసెస్టర్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 454 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. సోమర్సెట్ బౌలర్లలో లాంగ్రిడ్జ్, జార్జ్ థామస్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో డబుల్ సెంచరీలు నమోదైన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి సోమర్సెటే కావడం విశేషం. నార్తంప్టన్‌షైర్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షా, గ్లోసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జేమ్స్ బ్రేసీ సోమర్సెట్ బౌలర్లను ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో సోమర్సెట్ బౌలర్లందరూ 9కిపైగా యావరేజ్‌తో పరుగులు సమర్పించుకున్నారు. లాంగ్రిడ్జ్ను (8 ఓవర్లలో 5 పరుగులు) అయితే బ్రేసీ, బుర్రెన్ ఊచకోత కోశారు. లిస్ట్-ఏ క్రికెట్లో ఏడో అత్యధిక స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ, దేశవాలీ వన్డేలు) ఏడో అత్యధిక స్కోర్ నమోదైంది. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ రికార్డు స్థాయిలో 454 పరుగులు స్కోర్ చేసింది. ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో ఓ జట్టు 500 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. దీని తర్వాత అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022లో నెదార్లండ్స్తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ 498 పరుగులు స్కోర్ చేసింది. పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదైంది. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ ఆటగాడు జేమ్స్ బ్రేసీ (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ (277) పేరిట ఉంది. అతని తర్వాత అలిస్టర్ బ్రౌన్ (268), రోహిత్ శర్మ (264), షార్ట్ (257), శిఖర్ ధవన్ (248),పృథ్వీ షా (244), మార్టిన్ గప్తిల్ (237), ట్రవిస్ హెడ్ (230), డంక్ (229), పృథ్వీ షా (227) ఉన్నారు. -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. 129 బంతుల్లో డబుల్ సెంచరీ! కానీ...
Prithvi Shaw Slams Double Century- Fans Reacts- లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తొలిసారి ఆడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ వన్డే కప్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. సోమర్‌సెట్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 153 బంతులు ఆడిన పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 244 పరుగులు సాధించి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అవుటయ్యాడు. పృథ్వీ షా అసాధారణ బ్యాటింగ్‌తో మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్తంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 పరుగులు సాధించింది. అనంతరం సోమర్సెట్ జట్టు 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. రికార్డుల పృథ్వీ నార్తంప్టన్‌షైర్ జట్టు తరఫున మూడో మ్యాచ్ ఆడిన పృథ్వీ షా 81 బంతుల్లో సెంచరీ చేయగా... డబుల్ సెంచరీని 129 బంతుల్లో దాటాడు. ముంబైకి చెందిన పృథ్వీ షాకిది లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. లిస్ట్ ‘ఎ’లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల లిస్టులో మాత్రం.. జాబితాలో పృథ్వీ షాది ఆరో స్థానం. ఈ జాబితాలో తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీశన్ (277; అరుణాచల్‌ప్రదేశ్‌పై 2022లో) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. అప్పటి నుంచి నో ఛాన్స్! 2021లో భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై పృథ్వీ షా 227 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2021 జూలైలో చివరిసారి శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు ఆడిన పృథ్వీ షా ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇక తాజాగా ఇంగ్లండ్‌లో అతడు బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మన వాళ్ల ప్రతిభను మనం గుర్తించకపోతే ఇదిగో ఇలాగే పక్క దేశాల్లో ఆడుకుంటారంటూ ఫైర్ అవుతున్నారు. ఇకనైనా పృథ్వీ వంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. చదవండి: మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే.. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 -
పేట్రేగిపోయిన పృథ్వీ షా.. భారీ ద్విశతకం, 28 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా యంగ్ ఓపెనర్, ముంబై ఆటగాడు పృథ్వీ షా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ (లిస్ట్-ఏ క్రికెట్), మెట్రో బ్యాంక్ వన్డే కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సోమర్‌సెట్‌తో ఇవాళ (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో భారీ ద్విశతం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాది ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 ఓపెనర్‌గా బరిలోకి దిగిన షా డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. సామ్ వైట్‌మ్యాన్ (54), రికార్డో వాస్కో (47), ఎమిలియో గే (30) రాణించారు. సోమర్ సెట్ బౌలర్లలో జాక్ బ్రూక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. డానీ లాంబ్ 2, షోయబ్ బషీర్, జార్జ్ థామస్ తలో వికెట్ దక్కించుకున్నారు. షా విధ్వంసం ధాటికి సోమర్సెట్ బౌలర్లంతా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకున్నాడు. 🚨 PRITHVI SHAW HAS 200! 🚨#MBODC23 pic.twitter.com/GeVYVD3o6z — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 పృథ్వీ షా డబుల్ సెంచరీ విశేషాలు.. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో కలిపి 60 పరుగులు చేసిన పృథ్వీ షా.. ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్లో తన మూడో అప్పియరెన్స్లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇదే టోర్నీతో షా ఇంగ్లండ్ డొమెస్టిక్ సర్క్యూట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 153 బంతులను ఎదుర్కొన్న షా 28 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 244 పరుగులు చేసి, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఈ టోర్నీ డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 129 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు చతేశ్వర్ పుజారా (174) పేరిట ఉంది. లిస్ట్-ఏ చరిత్రలో ఆరో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నార్తంప్టన్‌షైర్ తరఫున హైయెస్ట్ లిస్ట్-ఏ స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు లిస్ట్-ఏ క్రికెట్లో రెండు వేర్వేరు దేశాల్లో డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు. భారత దేశవాలీ వన్డే టోర్నీలోనూ షా ఓ డబుల్ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో రోహిత్ శర్మ (3) తర్వాత అత్యధిక డబుల్ సెంచరీలు (2) 100 on the shirt, 100 on the scoreboard 💯 Prithvi Shaw goes full @nassercricket with his celebration! #MBODC23 pic.twitter.com/5UJLbrF2uQ — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 Highest List A individual score for Prithvi Shaw. He surpassed his previous best 227*pic.twitter.com/fI783vh7JH — Don Cricket 🏏 (@doncricket_) August 9, 2023 Prithvi Shaw in 2023: Scored his maiden triple hundred - 379 in 383 balls in the Ranji Trophy. Scored 244 in 153 balls in the Royal London One Day Cup. pic.twitter.com/QhG2tOyaWk — Mufaddal Vohra (@mufaddal_vohra) August 9, 2023 -
సెంచరీతో కదం తొక్కిన పుజారా.. తేలిపోయిన పృథ్వీ షా
2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా టెస్ట్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్‌లో సెంచరీతో కదం తొక్కాడు. టోర్నీలో భాగంగా నార్తంప్టన్‌షైర్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో (119 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియాలో చోటు కోల్పోయాక కసితో రగిలిపోతున్న పుజారా.. తన తాజా ఇన్నింగ్స్‌తో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్‌లో పుజారా ఇన్నింగ్స్ సాగిన తీరు పై పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పుజారా సెంచరీతో చెలరేగినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ ఓటమిపాలవ్వడం కొసమెరుపు. Great to have you back, @cheteshwar1! 🙌 Century 💯 pic.twitter.com/k7SfSu59si — Sussex Cricket (@SussexCCC) August 6, 2023 వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. పుజారా శతకొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో పుజారా మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ టామ్ హెయిన్స్ (13), జేమ్స్ కోల్స్ (29), హడ్సన్ (14), ఒలివర్ కార్టర్ (21), జాక్ కార్సన్ (17), హెన్రీ క్రొకోంబ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. నార్తంప్టన్‌షైర్ బౌలర్లలో జాక్ వైట్ 3, ప్రాక్టర్, కియోగ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తేలిపోయిన పృధ్వీ షా.. గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. గ్లోసెస్టర్తో మ్యాచ్‌లో 35 బంతుల్లో 34 పరుగులు చేసి విచిత్ర రీతిలో ఔటైన (హిట్ వికెట్) షా.. తాజాగా ససెక్స్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్‌కే (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) పరిమితమయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో షాకు మంచి ఆరంభమే లభించినా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. షా భారీ స్కోర్ చేయకపోయినా, మిగతా వారు రాణించడంతో అతని జట్టు విజయం సాధించింది. ససెక్స్‌తో మ్యాచ్‌లో 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్.. మరో 8 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నార్తంప్టన్‌షైర్ ఆటగాళ్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. షాతో పాటు రికార్డో (37), సామ్ వైట్‌మ్యాన్ (30), రాబ్ కియోగ్ (22), లూక్ ప్రాక్టర్ (10), లెవిస్ మెక్మానస్ (36) రెండంకెల స్కోర్లు చేయగా.. టామ్ టేలర్ (42 నాటౌట్), జస్టిన్ బ్రాడ్ (22 నాటౌట్) నార్తంప్టన్షైర్ను విజయతీరాలకు చేర్చారు. ససెక్స్ బౌలర్లలో కర్రీ, కార్సన్ చెరో 2 వికెట్లు, క్రొకోంబ్, హడ్సన్, జేమ్స్ కోల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
50 ఓవర్ల ఫార్మాట్లో భారీ స్కోర్.. ఇంగ్లండ్ 498 పరుగులు చేస్తే..!
50 ఓవర్ల క్రికెట్ ఫార్మట్‌లో (లిస్ట్-ఏ క్రికెట్) భారీ స్కోర్ నమోదైంది. ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్-2023లో భాగంగా ససెక్స్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో డర్హమ్ జట్టు 427 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ అలెక్స్ లీస్ (107 బంతుల్లో 144; 19 ఫోర్లు) భారీ శతకంతో విరుచుకుపడగా.. వన్‌డౌన్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హమ్ (54 బంతుల్లో 102; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విజృంభించాడు. వీరితో పాటు ఓపెనర్ గ్రహం క్లార్క్ (58 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు. ఫలితంగా డర్హమ్ లిస్ట్-ఏ క్రికెట్ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు కలుపుకుని) 21వ అత్యుత్తమ స్కోర్ నమోదు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యుత్తమ టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు జట్టు పేరిట ఉంది. గతేడాది (2022) విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ఆ మ్యాచ్‌లో ఎన్ జగదీశన్ (277) భారీ డబుల్ సెంచరీతో విరుచుకుపడగా.. సాయి సుదర్శన్ (154) శతకంతో మెరిశాడు. Records galore in Hove as centuries from Bedingham & Lees help Durham to commanding one-day cup win.#ForTheNorth — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. గతేడాది జూన్ 17న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 498 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నాడు ఇంగ్లీష్ జట్టులో ఏకంగా ముగ్గురు శతక్కొట్టారు. ఫిల్ సాల్ట్ (122), డేవిడ్ మలాన్ (125), జోస్ బట్లర్ (162 నాటౌట్) మెరుపు శతకాలతో చెలరేగిపోయారు. Shot Jonesy to bring up our highest List A score 🤩#ForTheNorth pic.twitter.com/HDR5fVmBkZ — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 ఇక ససెక్స్-డర్హమ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ససెక్స్ 39.1 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ హెయిన్స్ (65), ప్రెంటిస్ (65) అర్ధసెంచరీలతో రాణించారు. DAVID BEDINGHAM HAS OUR FASTEST LIST A 100 IN JUST 52 BALLS!!#ForTheNorth pic.twitter.com/5j9tZDIVug — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 -
మాట మార్చిన పాక్ క్రికెటర్.. అయినా కోహ్లితో నాకు పోలికేంటి?!
Khurram Manzoor On Virat Kohli: టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి గురించి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఖుర్రమ్ మంజూర్ మాట మార్చాడు. కోహ్లితో పోల్చుకుని అతడిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం తన విజయాల గురించి చెప్పుకోవడానికి మాత్రమే అలా మాట్లాడానని పేర్కొన్నాడు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం తన మాటలను వక్రీకరించాయన్నాడు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కాగా 50 ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలో తానే నంబర్ 1 అని, కోహ్లి స్థానం తన తర్వాతే అంటూ ఖుర్రమ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా వన్డేల్లో తన సగటు 53 అని.. ప్రతి ఆరు ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ బాదానంటూ చెప్పుకొచ్చాడు. ఈ కోహ్లి పేరును ప్రస్తావిస్తూ ఖుర్రమ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఖుర్రమ్ మంజూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘కొన్ని మీడియా సంస్థలు, నా ఇంటర్వ్యూలో తీసుకున్న వాళ్లు నా మాటలను వక్రీకరించారు. విరాట్ కోహ్లి తరానికొక్క గొప్ప ప్లేయర్. ఓ ఆటగాడిగా తనని నేను ఆరాధిస్తాను. తనతో పోలికేంటి? లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీల నిష్పత్తి గురించి మాట్లాడుతూ.. కోహ్లి కంటే నా గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.. తను రెండో స్థానంలో ఉన్నాడని మాత్రమే చెప్పాను. తనతో నాకసలు పోలికే లేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. గణాంకాలతో సంబంధం లేదు.. తను ఎప్పటికీ గొప్ప క్రికెటరే’’ అని ఖుర్రమ్ మంజూర్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన గణాంకాలకు సంబంధించిన ఫొటోను జత చేశాడు. ఇకనైనా మీడియా సంస్థలు విచక్షణతో వ్యవహరించాలని చురకలు అంటించాడు. కాగా పాక్ తరఫున ఖుర్రమ్ 16 టెస్టులు, ఏడు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. చదవండి: Hardik Pandya: మా ఓటమికి ప్రధాన కారణం అదే! అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే మాత్రం.. Rahul Tripathi: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' 1/3 Its funny how some media outlets and individuals have taken my interview out of context and twisted my words. Virat Kohli is a generational player and I have always admired him as the best. pic.twitter.com/d1UzhA7egI — Khurram Manzoor Khan (@_khurrammanzoor) January 26, 2023 -
నేనే నంబర్ వన్, నా తర్వాతే కోహ్లి.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లితో పోల్చుకుంటూ పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఖుర్రమ్ మన్సూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 36 ఏళ్ల ఈ పాకిస్తానీ ఔట్ డేటెడ్ బ్యాటర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ.. 50 ఓవర్ల ఫార్మాట్లో (లిస్ట్-ఏ) విరాట్ కోహ్లి కంటే నేనే బెటర్, ఈ ఫార్మాట్లో కోహ్లి రికార్డులు నా రికార్డుల ముందు బలాదూర్, ప్రపంచంలో నేనే నంబర్ వన్ బ్యాటర్ అంటూ తన డప్పు తాను కొట్టుకున్నాడు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఖుర్రమ్ తన అవివేకాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. విరాట్‌తో పోల్చుకోవడం తన ఉద్దేశం కాదని, వాస్తవానికి 50 ఓవర్ల క్రికెట్లో టాప్-10 బ్యాటర్స్‌లో నేనే ప్రపంచ నంబర్ వన్ అని, రికార్డుల ప్రకారం కోహ్లి నా తర్వాతే ఉంటాడని ఇష్టమొచ్చినట్లు వాగాడు. లిస్ట్-ఏ క్రికెట్లో నా కన్వర్జన్ రేట్ బెటర్‌గా ఉందని, ఇందుకు గణాంకాలే సాక్షమని అన్నాడు. 50 ఓవర్ల క్రికెట్లో కోహ్లి ప్రతి 6 ఇన్నింగ్స్‌లకు సెంచరీ చేస్తే, నేను ప్రతి 5.68 ఇన్నింగ్స్‌లకే సెంచరీ బాదాను అని చెప్పుకొచ్చాడు. గత 10 ఏళ్లుగా ఈ ఫార్మాట్లో తన సగటు 53గా ఉందని, ప్రపంచ లిస్ట్-ఏ క్రికెట్ గణాంకాల్లో తాను ఐదో స్థానంలో ఉన్నానని తెలిపాడు. కాగా, ఖుర్రమ్ లిస్ట్-ఏ క్రికెట్లో 166 మ్యాచ్‌ల్లో 53 సగటున 27 శతకాల సాయంతో 7992 పరుగులు చేశాడని తెలుస్తోంది. 2008లో పాక్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఖుర్రం.. తన కెరీర్ మొత్తంలో 16 టెస్ట్‌లు, 7 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2016లో చివరిసారిగా పాక్‌కు ఓ టీ20 మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించిన ఖుర్రమ్ ఆతర్వాత అత్తాపత్తా లేడు. ఖుర్రమ్ టెస్ట్‌ల్లో సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 3 హాఫ్ సెంచరీలు చేశాడు. కోహ్లి-ఖుర్రమ్ ఇద్దరూ ఓ మ్యాచ్‌లో ఎదురెదురు పడ్డారు. ఆ మ్యాచ్‌లో కోహ్లినే ఖుర్రమ్ను రనౌట్ చేయడం కొసమెరుపు. -
VHT 2022: సాహో రుతురాజ్.. 220 పరుగులతో విధ్వంసం! గొప్ప, ‘చెత్త’ రికార్డు.. రెండూ...
Vijay Hazare Trophy 2022 - Maharashtra vs Uttar Pradesh, 2nd quarter final- అహ్మదాబాద్: భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో గత సోమవారం నారాయణ్ జగదీశన్ ప్రపంచ రికార్డులతో హోరెత్తించాడు. ఇప్పుడు సరిగ్గా వారం రోజుల తర్వాత ఇదే టోర్నీలో మరో బ్యాటర్ కొత్త ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మహారాష్ట్ర కెప్టెన్, భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆరు రెగ్యులర్ బంతులతో పాటు ఒక నోబాల్ ఈ ఓవర్లో రాగా, దానిని కూడా సిక్స్‌గా మలచి రుతురాజ్ మొత్తం 43 పరుగులు రాబట్టాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదైంది. పాపం శివ సింగ్ దీంతో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా సమమైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ శివ సింగ్ బాధిత బౌలర్‌గా నిలిచాడు. 48 ఓవర్లో ముగిసేసరికి మహారాష్ట్ర 272/5గా ఉంది. 49వ ఓవర్ తర్వాత స్కోరు 315/5గా మారింది. ఆ ఓవర్లో రుతురాజ్ వరుసగా 6, 6, 6, 6, 6 (నోబాల్), 6, 6 బాదాడు. వరుసగా వైడ్ లాంగాన్, లాంగాన్, డీప్ స్క్వేర్ లెగ్, లాంగాఫ్ మీదుగా తొలి నాలుగు సిక్సర్లు వెళ్లాయి. ఐదో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్సర్ కొట్టగా, బౌలర్ గీత దాటడంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత లాంగాన్, డీప్ మిడ్‌వికెట్ మీదుగా తర్వాతి రెండు సిక్సర్లను గైక్వాడ్ మలిచాడు. ఇందులో ఆరో సిక్సర్‌తో రుతురాజ్ డబుల్ సెంచరీ పూర్తయింది. చివరకు 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో అతను 220 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సెమీస్‌లో మహారాష్ట్ర ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసి సవాల్ విసరగా... 47.4 ఓవర్లలో 272 పరుగులకే ఉత్తరప్రదేశ్ ఆలౌటైంది. 58 పరుగులతో గెలిచిన మహారాష్ట్ర సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 -
శిఖర్ ధావన్ అరుదైన రికార్డు.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ లిస్ట్-ఏ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 12,000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఏడో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనతను ధావన్ సాధించాడు. కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ధావన్ బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు లిస్ట్-ఏ క్రికెట్లో 297 మ్యాచ్‌లు ఆడిన ధావన్ 12,025 పరుగులు చేశాడు. వీటిలో 162 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(21,999) పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక పరుగులు వీరే సచిన్ టెండూల్కర్(551 మ్యాచ్‌లు) - 21,999 పరుగులు సౌరవ్ గంగూలీ(437 మ్యాచ్‌లు) -15, 622 పరుగులు రాహుల్ ద్రవిడ్ (449 మ్యాచ్‌లు)- 15,271 పరుగులు విరాట్ కోహ్లీ(296 మ్యాచ్‌లు)- 13,786 పరుగులు ఎంఎస్ ధోని(423 మ్యాచ్‌లు)- 13,353 పరుగులు యువరాజ్ సింగ్(423 మ్యాచ్‌లు)-12,633 పరుగులు శిఖర్ ధావన్(297 మ్యాచ్‌లు)-12,025 పరుగులు రాణించిన ధావన్, అయ్యర్ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(72), శ్రేయస్ అయ్యర్(80), గిల్(50) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు
విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా తమిళనాడు-అరుణాచల్‌ప్రదేశ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 21) జరిగిన గ్రూప్-సి మ్యాచ్ కనీవినీ ఎరుగని రికార్డులకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) డబుల్ సెంచరీతో శివాలెత్తడంతో తమిళనాడు 435 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లిస్ట్-ఏ (అంతర్జాతీయ వన్డేలతో పాటు దేశవాలీ వన్డేలు) క్రికెట్లో ఇదే అత్యంత భారీ విజయంగా రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు.. ఓపెనర్లు జగదీశన్, సాయ్ సుదర్శన్ (102 బంతుల్లో 154; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ శతకాలతో వీరవిహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. అనంతరం ఆసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అరుణాచల్‌ప్రదేశ్.. 28.4 ఓవర్లలో కేవలం 71 పరుగులకే ఆలౌటై, లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మణిమారన్ సిద్ధార్థ్ (5/12) అరుణాచల్‌ప్రదేశ్ పతనాన్ని శాశించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన జగదీశన్ వ్యక్తిగతంతా పలు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇదే టోర్నీలో 4 వరుస శతకాలు బాదిన (114 నాటౌట్, 107, 168, 128) జగదీశన్.. తాజాగా డబుల్ సెంచరీతో వరుసగా ఐదో శతకాన్ని నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఇలా వరుసగా ఐదు సెంచరీలు చేయడం ప్రపంచ రికార్డు. గతంలో శ్రీలంక దిగ్గజం సంగక్కర, సౌతాఫ్రికా ఆటగాడు అల్విరో పీటర్సన్, భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ వరుసగా 4 శతాకలు బాదారు. ఈ మ్యాచ్‌లో డబుల్ సాధించే క్రమంలో జగదీశన్ ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డునే బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో రోహిత్ (శ్రీలంకపై 264 పరుగులు) అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. జగదీశన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ విభాగంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇంగ్లీష్ క్రికెటర్ అలిస్టర్ బ్రౌన్ (268) పేరిట ఉండేది. డబుల్ సాధించే క్రమంలో జగదీశన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి శతకాన్ని సాధించేందుకు 76 బంతులు తీసుకున్న అతను.. రెండో సెంచరీని కేవలం 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. డబుల్ సెంచరీలో రెండో అర్ధభాగాన్ని ఇన్ని తక్కువ బంతుల్లో పూర్తి చేయడం కూడా లిస్ట్-ఏ క్రికెట్లో రికార్డే. మొత్తానికి నారాయణ్ జగదీశన్ ధాటికి లిస్ట్-ఏ రికార్డులు చాలావరకు బద్ధలయ్యాయి. అతను సృష్టించిన విధ్వంసం ధాటికి పలు ప్రపంచ రికార్డులు సైతం తునాతునకలయ్యాయి. అతని సిక్సర్ల సునామీలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కొట్టుకుపోయింది. -
ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
తమిళనాడు స్టార్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో నారాయణ్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. ఇది ఈ టోర్నీలో అతడికి వరుసగా ఐదో సెంచరీ. తద్వారా జగదీశన్ ప్రపంచరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు 2014-15 సీజన్లో నాలుగు సెంచరీలు చేసిన శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరిట ఈ రికార్డు ఉంది. తాజా మ్యాచ్‌లో సెంచరీ సాధించిన జగదీశన్ సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో 141 బంతులు ఎదుర్కొన్న జగదీశన్.. 15 సిక్స్‌లు, 25 ఫోర్లతో 277 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ రికార్డు బద్దలు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా జగదీశన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లీష్ క్రికెటర్ అలిస్టర్ బ్రౌన్(268) పేరిట ఉండేది. అదే విధంగా భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రోహిత్ శర్మ(264) రికార్డును జగదీశన్ బ్రేక్ చేశాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ 264 పరుగులు సాధించాడు. తమిళనాడు స్కోర్ ఎంతంటే? ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. జగదీశన్‌తో పాటు మరో ఓపెనర్ సాయి సుదర్శన్(154) పరుగులతో రాణించాడు. లిస్ట్-ఏ క్రికెట్ అంటే? అంతర్జాతీయ వన్డేలతో పాటు దీశీవాళీ వన్డేటోర్నీలు కూడా లిస్ట్-ఏ క్రికెట్ పరిగణలోకి వస్తాయి. లిస్ట్-ఏ క్రికెట్లో ఓవర్ల సంఖ్య నలభై నుంచి అరవై వరకు ఉంటుంది. అదే విధంగా అధికారిక వన్డే హోదాను సాధించని దేశాలు పాల్గొనే అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా లిస్ట్-ఏ క్రికెట్ పరిగణలోకి వస్తాయి. చదవండి: IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్! -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. ఆస్ట్రేలియా క్రికెటర్ సరికొత్త రికార్డు
Travis Head hits fastest-ever List A double- century: లిస్ట్-ఏ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రెవీస్ హెడ్ తన పేరిట సరికొత్త రికార్డును లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా డొమాస్టిక్ వన్డే కప్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 114 బంతుల్లో హెడ్.. డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 127 బంతుల్లో 28 ఫోర్లు, 8 సిక్స్‌లతో 230 పరుగులు సాధించాడు. లిస్ట్- ఏ క్రికెట్లో రెండు సార్లు డబుల్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా హెడ్ మరో ఘనత సాధించాడు. కాగా ఆస్ట్రేలియా లిస్ట్- ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా హెడ్ రికార్డులకెక్కాడు. మార్ష్ కప్‌లో 257 పరుగులు చేసిన డీ ఆర్సీ షార్ట్ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. అయితే వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా 392 పరగుల భారీ లక్ష్యాన్ని క్వీన్స్లాండ్ ముందట ఉంచింది. 392 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్లాండ్ 40 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 67 పరుగుల తేడాతో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక హెడ్ ఆస్ట్రేలియా తరుపున 2018లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. చదవండి: IPL 2022 Mega Auction: రైనా సహా ఆ ముగ్గురి ఖేల్ ఖతమైనట్టే..! https://t.co/NaQmQhq7fs — varun seggari (@SeggariVarun) October 13, 2021 -
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన శ్రీలంక ఆల్‌రౌండర్
కొలొంబో: శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరా అరుదైన రికార్డును సాధించాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి లంక క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెట్లో భాగంగా శ్రీలంక ఆర్మీ అండ్ స్పోర్ట్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ప్రత్యర్ధి బౌలర్ దిల్హన్ కూరే బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో అతను 13 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ(52 పరుగులు) పూర్తి చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ కాగా, అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు శ్రీలంక ఆల్‌రౌండర్ కౌసల్య వీరరత్నే పేరిట నమోదై ఉంది. రంగన క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన వీరరత్నే 2005 నవంబర్‌లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ(18 బంతుల్లో 66) పూర్తిచేశాడు. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే వేగవంతమైన అర్ధశతకం. వీరరత్నే ఫిఫ్టీలో 2 ఫోర్లు, 8 సిక్సర్లుండగా... అందులో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు సాధించడం విశేషం. కాగా, తిసార పెరీరా ఈ ఘనతను సాధించడానికి కొద్ది వారాల క్రితమే అంతర్జాతీయ టీ20లో విండీస్ యోధుడు కీరన్ పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. శ్రీలంకతోనే జరిగిన ఈ మ్యాచ్‌లో లంక బౌలర్ అఖిల ధనుంజయ బౌలింగ్‌లో పోలార్డ్ ఈ ఘనతను సాధించాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్ల జాబితాలో తిసార పెరీరా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పెరీరాకు ముందు గ్యారి సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి(భారత్), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్(భారత్), రాస్ వైట్లీ(ఇంగ్లండ్), హజ్రతుల్లా జజాయ్(ఆఫ్ఘనిస్తాన్), లియో కార్టర్(న్యూజిలాండ్), పోలార్డ్(వెస్టిండీస్) ఉన్నారు. చదవండి: ముంబై ఇండియన్స్ శిబిరంలో రోహిత్ -
ఇదంతా రాహుల్ ద్రవిడ్ సర్ వల్లే..
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత జట్టకు ఎంపిక కావడంతో భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తాను అండర్-19 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం వెనుక మాజీ కోచ్, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందన్నాడు. ఇప్పుడు తాను నిలకడగా పరుగులు చేస్తున్నానంటే అదంతా ద్రవిడ్ సర్ వల్లే అంటూ జైస్వాల్ స్పష్టం చేశాడు. ‘ ఆడే ప్రతీ బంతిపై ఫోకస్ పెట్టమని ద్రవిడ్ సర్ ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవారు. ఏ బంతిని నువ్వు ఎదుర్కొంటున్నావో అప్పుడు ఆ బంతిపై దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పేవారు. ముఖ్యంగా ప్రాక్టీస్ సెషనల్లో ఏ ఏరియాల్లో నేను బలహీనంగా ఉన్నానో వాటిని సరిచేసేవారు. ఇలా ద్రవిడ్ సర్ చెప్పిన ప్రతీ విషయం నాకు చాలా ఉపయోగపడింది’ యశస్వి జైస్వాల్ పేర్కొన్నాడు. ఇక తన ప్రదర్శన గురించి జైస్వాల్ మాట్లాడుతూ.. ‘ నేను ప్రతీ మ్యాచ్‌ను ఒకే రకంగా ఆస్వాదిస్తాను. నేను కింది స్థాయిలో ఎంత సహజ సిద్ధంగా ఆడానో అదే ప్రదర్శనను రిపీట్ చేయడంపై ఫోకస్ చేస్తా. నా ఆటపైనే దృష్టి పెడతా.. ఫలితాలపై కాదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తా’ అని జైస్వాల్ తెలిపాడు. విజయ్ హజారే ట్రోఫీలో మూడు డబుల్ సెంచరీలతో యశస్వి జైస్వాల్ ఆకట్టుకున్నాడు. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. దాంతో అండర్-19 వరల్డ్‌కప్ జట్టులో ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. అక్టోబర్‌లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి 203 పరుగులు సాధించాడు. ఫలితంగా అంతర్జాతీయ, దేశవాళీ వన్డేల్లో కలిపి (లిస్ట్–ఎ మ్యాచ్‌లు) అతి పిన్న వయసులో (17 ఏళ్ల 292 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. -
యశస్వి డబుల్ యశస్సు
బెంగళూరు: భారత క్రికెట్లో మరో కొత్త టీనేజీ సంచలనం! సంచలన బ్యాటింగ్ ప్రదర్శనలకు కేరాఫ్ అడ్రస్‌వంటి ముంబై మైదానాల నుంచి వచ్చిన మరో కుర్రాడు కొత్త ప్రపంచ రికార్డుతో సంచలనం సృష్టించాడు. ముంబైకి చెందిన యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్ అంతర్జాతీయ, దేశవాళీ వన్డేల్లో కలిపి (లిస్ట్–ఎ మ్యాచ్‌లు) అతి పిన్న వయసులో (17 ఏళ్ల 292 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఈ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో యశస్వి 154 బంతుల్లో 17 ఫోర్లు, 12 సిక్సర్లతో 203 పరుగులు సాధించాడు. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన అలన్ బారో 20 ఏళ్ల 276 రోజుల వయసులో చేసిన డబుల్ సెంచరీ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వికి తోడుగా ఆదిత్య తారే (78; 6 ఫోర్లు, సిక్స్) కూడా రాణించడంతో ముంబై 50 ఓవర్లలో 3 వికెట్లకు 358 పరుగులు చేసింది. అనంతరం 319 పరుగులకు ఆలౌటైన జార్ఖండ్ 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. విరాట్ సింగ్ (77 బంతుల్లో 100; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. పానీపూరి నుంచి పరుగుల వరద వరకు... 11 ఏళ్ల వయసు... కానీ పెద్ద క్రికెటర్ కావాలనేది కల. అది నెరవేర్చుకోవాలంటే స్వస్థలం భదోహీ (ఉత్తర ప్రదేశ్)లో మాత్రం సాధ్యం కాదు. అందుకే దేనికైనా సిద్ధం అంటూ ‘చలో ముంబై’ అన్నాడు. సొంతూర్లో తండ్రిది చిన్న కిరాణా కొట్టు. ఇద్దరు పిల్లల పోషణ కూడా ఆయనకు భారంగా అనిపించి నీ ఇష్టం అనేశాడు. దూరపు బంధువొకరు ముంబైలో ఉంటే ఆయనను నమ్ముకొని బయల్దేరాడు. ఏదైనా పని ఇప్పిస్తానంటూ డెయిరీ దుకాణంలో నౌకరీ ఇప్పించిన ఆ బంధువు ఇల్లు మాత్రం రెండో మనికి అవకాశమే లేనంత చిన్నది! దాంతో తను పని చేస్తున్న చోటే రాత్రి కూడా పడుకోవడం మొదలు పెట్టాడు. అయితే రోజంతా పనికంటే క్రికెట్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో వారు పనికిరావంటూ పంపించేశారు. దాంతో కథ మళ్లీ మొదటికొచి్చంది. మళ్లీ అదే బంధువు ఆదుకుంటూ తాను పని చేస్తున్న ‘ముస్లిం యునైటెడ్ క్లబ్’ క్రికెట్ గ్రౌండ్లో ఒక మూలన ఉండే టెంట్లో ఆ అబ్బాయిని ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచిన ఆ టెంటే అప్పటి నుంచి యశస్వి ప్రపంచమైపోయింది. స్థానికంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం, యునైటెడ్ క్లబ్‌కు సంబంధించి గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. తనకంటే వయసులో పెద్దవారితో క్రికెట్ మ్యాచ్‌లు ఆడితే 200–300 రూపాయలు వచ్చేవి. వాటినే ఎంతో పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో రామ్‌లీలా ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు యశస్వి అక్కడ పానీ పూరీలు కూడా అమ్మాడు! తనతో ఆడే కుర్రాళ్లు ఆ సమయంలో పానీపూరీ తినేందుకు తన వద్దకు రావద్దని అతను కోరుకునే పరిస్థితి. టెంట్లో ఉంటున్న సమయంలో తాను ఆకలితో పడుకున్న రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. యశస్వి గాథలు ఆజాద్ మైదాన్‌లో చాలా మందికి చేరాయి. సహజ ప్రతిభావంతుడైన ఒక కుర్రాడిని అండగా నిలవాల్సిన అవసరం తెలిసింది. వీరిలో ఒక స్థానిక కోచ్ జ్వాలా సింగ్ అందరికంటే ముందుగా స్పందించాడు. యశస్విలాంటి నేపథ్యంతోనే అదే ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి పెద్ద స్థాయికి చేరలేకపోయిన జ్వాలా సింగ్‌కు బహుశా అతనిలో తన ప్రతిరూపం కనిపించి ఉంటుంది! అందుకే ఈ కుర్రాడిని చేరదీసి ఆటను తీర్చిదిద్ది ముందుకు నడిపించాడు. అతని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లిన యశస్వి స్థానిక లీగ్‌లలో పరుగుల వరద పారించాడు. గత ఐదేళ్లలో అన్ని స్థాయిల మ్యాచ్‌లలో కలిపి అతను దాదాపు 50 సెంచరీలు బాదాడు. వేర్వేరు వయో విభాగాల్లో ఈ అసాధారణ ప్రదర్శన అతడికి ముంబై అండర్–19 జట్టులో, ఆ తర్వాత భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. గత ఆగస్టులో ఇంగ్లండ్‌లో అండర్–19 ముక్కోణపు టోరీ్నలో ఫైనల్లో సహా మొత్తం నాలుగు అర్ధ సెంచరీలతో జట్టుకు టైటిల్ అందించిన అతను ఇప్పుడు సీనియర్ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 ఆసియా కప్ టోర్నీతో యశస్వికి మొదటిసారి గుర్తింపు లభించింది. భారత్ విజేతగా నిలిచిన ఆ టోరీ్నలో యశస్వి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి అతని ఆట మరింత జోరందుకుంది. ముంబై సీనియర్ టీమ్‌కు ఎంపిక కావడం అతని కెరీర్లో కీలక మలుపు. 44, 113, 22, 122, 203... విజయ్ హజారే ట్రోఫీలో యశస్వి జైస్వాల్ వరుస స్కోర్లు ఇవి. ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు ఉన్నాయి. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా. వీటిని చూస్తే యశస్వి ప్రదర్శన ఒక సంచలన ఇన్నింగ్స్‌కే పరిమితం కాదని, అతని ఆటలో ఎంత నిలకడ ఉందో అర్థమవుతుంది. తాజా ప్రదర్శన యశస్విని భవిష్యత్ తారగా ఆశలు రేపేలా చేసింది. మ్యాచ్‌లు ఆడేటప్పుడు లంచ్ విరామం సమయంలో నా సహచరులు లేదా వాళ్ల తల్లిదండ్రులు మంచి భోజనాలు తీసుకు రావడం చాలా సార్లు చూశాను. నేను మాత్రం ఏదైనా వండుకుంటేనే తినే పరిస్థితి. బ్రేక్ ఫాస్ట్ అనేది దాదాపుగా లేనట్లే. వాళ్లలోనే ఎవరో ఒకరిని బతిమాలి పని కానిచ్చేయడమే. ఈ విషయంలో నేను ఏమాత్రం సిగ్గు పడకపోయేవాడిని. ‘డబ్బులు లేవు కానీ ఆకలి మాత్రం ఉంది’ అంటూ వారిని అడిగి తినేందుకు సిద్ధపడిపోయేవాడిని.నా పరిస్థితి చూసుకున్నప్పుడు చాలా సార్లు తల్లిదండ్రులు గుర్తుకొచ్చి ఏడుస్తూ కుమిలిపోయేవాడిని. వేసవిలో ప్లాస్టిక్ టెంట్లో పడుకున్నప్పుడు వేడితో చచి్చపోయేవాడిని. దాంతో గ్రౌండ్‌లోనే పడుకునేందుకు సిద్ధమైపోయా. అయితే ఒక రాత్రి ఏదో పురుగు కుట్టి కన్ను వాచిపోవడంతో ఆ తర్వాత ఎంత వేడి అయినా టెంట్‌లోకే మారిపోయా. క్రికెట్లో ఒత్తిడి అనే మాటే నాకు తెలీదు. ఎన్నో ఏళ్లుగా రోజూ అనుభవించిన వాడిని. బరిలోకి దిగితే పరుగులు చేయగలనని నమ్మకం ఉండేది కానీ ఆ రోజు భోజనం దొరుకుతుందా లేదా అనే దాని గురించే ఆందోళన చెందిన రోజులు ఉన్నాయి. –యశస్వి జైస్వాల్ లిస్ట్–ఎ క్రికెట్లో భారత్ ‘డబుల్ సెంచరీ’ హీరోలు అంతర్జాతీయ క్రికెట్లో... ►రోహిత్ శర్మ 264 (శ్రీలంకపై, కోల్‌కతాలో 2014) ►రోహిత్ శర్మ 209 (ఆ్రస్టేలియాపై, బెంగళూరులో 2013) ►రోహిత్ శర్మ 208 నాటౌట్ (శ్రీలంకపై, మొహాలీలో 2017) ►సచిన్ టెండూల్కర్ 200 నాటౌట్ (దక్షిణాప్రికాపై, గ్వాలియర్‌లో 2010) ►వీరేంద్ర సెహా్వగ్ 219 (వెస్టిండీస్‌పై, ఇండోర్‌లో 2011) దేశవాళీ క్రికెట్లో... ►శిఖర్ ధావన్ 248 (దక్షిణాఫ్రికా ‘ఎ’పై, ప్రిటోరియాలో 2013) ►కరణ్ కౌశల్ 202 (సిక్కింపై, గుజరాత్లో 2018) ►సంజూ సామ్సన్ 212 నాటౌట్ (గోవాపై, బెంగళూరులో 2019) ►యశస్వి జైస్వాల్ 203 (జార్ఖండ్‌పై, బెంగళూరులో 2019) -
24 పరుగులకే ఆలౌట్
అల్ అమరాట్: లిస్ట్-ఎ క్రికెట్లో మరో చెత్త రికార్డు నమోదైంది. తాజాగా ఒమన్ క్రికెట్ జట్టు మూడు పదుల స్కోరు కూడా చేయకుండానే కుప్పకూలడంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఒమన్ జట్టు 17.1 ఓవర్లలోనే 24 పరుగులకు ఆలౌటైంది. ఇందులో ఓపెనర్లు టీకే భండారీ, జతీందర్ సింగ్‌లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరితే, మిగతా ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఖవర్ అలీ(15) ఒక్కడే రెండంకెల స్కోరును నమోదు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో రుద్రి స్మిత్, ఆడ్రియన్ నెయిల్‌లు తలో నాలుగు వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించారు. ఇది లిస్ట్-ఎ క్రికెట్లో నాల్గో అత్యల్ప స్కోరుగా రికార్డు అయ్యింది. లిస్ట్-ఎ క్రికెట్లో అత్యల్ప స్కోరు రికార్దు వెస్టిండీస్ పేరిట ఉంది. 2007లో బార్బోడాస్తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ అండర్-19 జట్టు 18 పరుగులకే ఆలౌటైంది. ఇదే నేటికీ లిస్ట్-ఎ క్రికెట్లో అత్యల్ప స్కోరు. తాజా మ్యాచ్‌లో 25 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లాండ్ వికెట్లేమీ కోల్పోకుండా 3.2 ఓవర్లలో ఛేదించింది. -
‘శభాష్’ నదీమ్.. క్రికెట్లో సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును లిఖించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గురువారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ స్పిన్నర్ సంచలన స్పెల్‌తో చెలరేగాడు. దీంతో రెండు దశాబ్దాల రికార్డును తిరగరాశాడు. పది ఓవర్లు వేసి కేవలం పదిపరుగులిచ్చి ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టేశాడు. నదీమ్ దెబ్బకు రాజస్తాన్ 73 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అతి తక్కువ పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీసిన ఆటగాడిగా ఢిల్లీకి చెందిన రాహుల్ సాంగ్వి(8/15)పేరిట ఉన్న రికార్డును తాజాగా నదీమ్ సవరించాడు. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్ ఊపు చూస్తుంటే పది వికెట్లు తీసేలా కనిపించాడు కానీ మరో స్పిన్నర్ వికెట్ తీయడంతో కుదరలేదు. నదీమ్ తీసిన ఎనిమిది వికెట్లలో ఒక హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. లిస్ట్ ఏ క్రికెట్లో ఒక మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసిన జాబితాలో చమింద వాస్, హోల్డింగ్, అండర్వుడ్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. ‘చాలా సంతోషంగా ఉంది. సరికొత్త రికార్డును సృష్టించినందుకు. మ్యాచ్ అయ్యాక చెప్పారు. రెండు దశాబ్దాల రికార్డును తిరగరాశావని చెప్పినప్పుడు సంతోషంగా అనిపించింది. హ్యాట్రిక్ కూడా సాధించడం డబుల్ హ్యాపీ. ఈ ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటానే నమ్మకం ఏర్పడింది. కానీ ఈ ప్రదర్శన సరిపోతుందని అనుకోవటం లేదు. ఆసియాకప్ సందర్బంగా జాతీయ ఆటగాళ్లకు బౌలింగ్ చేసే అవకాశం లభించింది. అది ఎంతగానో ఉపయోగపడింది. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే నా తదుపరి లక్ష్యం. దానికోసం కష్టపడుతున్నా’ అంటూ నదీమ్ పేర్కొన్నాడు. 29 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 375 వికెట్లు పడగొట్టాడు.