టీమిండియా యంగ్ ఓపెనర్, ముంబై ఆటగాడు పృథ్వీ షా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ (లిస్ట్-ఏ క్రికెట్), మెట్రో బ్యాంక్ వన్డే కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సోమర్‌సెట్‌తో ఇవాళ (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో భారీ ద్విశతం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాది ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల రికార్డు స్కోర్ చేసింది.
✅ Sixth-highest score in List A history
— Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023
✅ Second-highest List A score in 🏴
✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk
ఓపెనర్‌గా బరిలోకి దిగిన షా డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. సామ్ వైట్‌మ్యాన్ (54), రికార్డో వాస్కో (47), ఎమిలియో గే (30) రాణించారు. సోమర్ సెట్ బౌలర్లలో జాక్ బ్రూక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. డానీ లాంబ్ 2, షోయబ్ బషీర్, జార్జ్ థామస్ తలో వికెట్ దక్కించుకున్నారు. షా విధ్వంసం ధాటికి సోమర్‌సెట్ బౌలర్లంతా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకున్నాడు.
🚨 PRITHVI SHAW HAS 200! 🚨#MBODC23 pic.twitter.com/GeVYVD3o6z
— Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023
పృథ్వీ షా డబుల్ సెంచరీ విశేషాలు..
- ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో కలిపి 60 పరుగులు చేసిన పృథ్వీ షా.. ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్‌లో తన మూడో అప్పియరెన్స్‌లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇదే టోర్నీతో షా ఇంగ్లండ్ డొమెస్టిక్ సర్క్యూట్‌లోకి అరంగేట్రం చేశాడు.
- ఈ మ్యాచ్‌లో 153 బంతులను ఎదుర్కొన్న షా 28 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 244 పరుగులు చేసి, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఈ టోర్నీ డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.
- ఈ టోర్నీ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
- 129 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు.
- ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు చతేశ్వర్ పుజారా (174) పేరిట ఉంది.
- లిస్ట్-ఏ చరిత్రలో ఆరో అత్యధిక వ్యక్తిగత స్కోర్
- ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్
- నార్తంప్టన్‌షైర్ తరఫున హైయెస్ట్ లిస్ట్-ఏ స్కోర్
- ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు
- లిస్ట్-ఏ క్రికెట్‌లో రెండు వేర్వేరు దేశాల్లో డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు. భారత దేశవాలీ వన్డే టోర్నీలోనూ షా ఓ డబుల్ సెంచరీ చేశాడు.
- లిస్ట్-ఏ క్రికెట్‌లో రోహిత్ శర్మ (3) తర్వాత అత్యధిక డబుల్ సెంచరీలు (2)
100 on the shirt, 100 on the scoreboard 💯
— Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023
Prithvi Shaw goes full @nassercricket with his celebration! #MBODC23 pic.twitter.com/5UJLbrF2uQ
Highest List A individual score for Prithvi Shaw. He surpassed his previous best 227*pic.twitter.com/fI783vh7JH
— Don Cricket 🏏 (@doncricket_) August 9, 2023
Prithvi Shaw in 2023:
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 9, 2023
Scored his maiden triple hundred - 379 in 383 balls in the Ranji Trophy.
Scored 244 in 153 balls in the Royal London One Day Cup. pic.twitter.com/QhG2tOyaWk
Comments
Please login to add a commentAdd a comment